MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Marriage Rules : ఈ అబ్బాయిలు పాాకిస్థాన్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దా? ఎందుకో తెలుసా?

Marriage Rules : ఈ అబ్బాయిలు పాాకిస్థాన్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దా? ఎందుకో తెలుసా?

సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరుల పెళ్లిళ్లపై కఠిన నిబంధనలు పెట్టింది. సౌదీ అబ్బాయిలు ఓ నాలుగు దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంపై నిషేధం ఉంది… ఆ దేశాలేవో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 04 2026, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సౌదీ అరేబియా మ్యారేజ్ రూల్స్
Image Credit : AI Generated Image

సౌదీ అరేబియా మ్యారేజ్ రూల్స్

"నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు" అన్నట్లుంది పాకిస్థాన్, సౌదీ అరేబియా ప్రెండ్షిప్. ఇటీవలే ఈ రెండు దేశాలు ''మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్'' పై సంతకం చేశాయి... దీనిప్రకారం ఈ దేశాలు రక్షణ విషయంలో ఒకదానికొకటి సహకరించుకోనున్నాయట. భారత్ ను టార్గెట్ గా చేసుకుని పాక్ ఇలాంటి ఒప్పందం చేసుకుందని స్పష్టంగా అర్థమవుతోంది.

అయితే రక్షణ మాట అటుంచితే పాకిస్థాన్ ప్రజలను కనీసం మనుషులుగా గుర్తించడంలేదు సౌదీ... ఇందుకు నిదర్శనమే పాక్ అమ్మాయిలను సౌదీ అబ్బాయిలు పెళ్లాడకూడదు అనే నిబంధన. ఇలా సౌదీ అరేబియా చీ కొడుతున్నా సరే పాక్ ఆ దేశం వెంటపడిమరీ ఒప్పందాలు చేసుకుంటోంది.

ప్రేమకు దేశాలతో, సరిహద్దులతో సంబంధం లేదు. కానీ సౌదీ అరేబియాలో మాత్రం తమ దేశ అబ్బాయిలు ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అంటోంది. అక్కడి ప్రభుత్వం పెళ్లిళ్లపై కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టింది. సౌదీ యువకులు ఈ రూల్స్‌ను కచ్చితంగా పాటించాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సౌదీ అరేబియా అబ్బాయిలు పాక్ అమ్మాయిలను పెళ్లిచేసుకోవద్దా?
Image Credit : AI Generated Image

సౌదీ అరేబియా అబ్బాయిలు పాక్ అమ్మాయిలను పెళ్లిచేసుకోవద్దా?

సౌదీ అరేబియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం… ఆ దేశ పౌరులు ప్రపంచంలోని ఏ దేశం అమ్మాయిలనైనా కొన్ని షరతులతో పెళ్లాడవచ్చు… కానీ ఓ నాలుగు దేశాల అమ్మాయిలను పెళ్లిచేసుకోవాలంటే మాత్రం కష్టం. ఈ నిబంధన ఇప్పుడు కొత్తగా పెట్టినవి కావు… చాలా ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. సౌదీ నిషేధించిన దేశాల్లో మూడు మన పొరుగు దేశాలే కావడం గమనార్హం.

సౌదీ ప్రభుత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చాద్ దేశాల అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంపై నిషేధం విధించింది. విదేశీ మహిళలతో పెళ్లిళ్లను ప్రోత్సహించకూడదని… తమ దేశ అబ్బాయిలు ఇక్కడి అమ్మాయిలనే పెళ్లాడాలనే ఉద్దేశంతో ఈ నిబంధన తెచ్చారు. ఒకవేళ ఈ నాలుగు దేశాలు కాకుండా ఇతర దేశాల వారిని పెళ్లి చేసుకోవాలన్నా కొన్ని రూల్స్ పాటించాల్సిందే.

33
విదేశీ మహిళల్ని పెళ్లాడాలంటే ఏం చేయాలి?
Image Credit : AI Generated Image

విదేశీ మహిళల్ని పెళ్లాడాలంటే ఏం చేయాలి?

విదేశీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకునే సౌదీ యువకులు కొన్ని రూల్స్ పాటించాలి. సదరు విదేశీ యువతికి సంబంధించి ప్రభుత్వం సూచించిన కొన్ని డాక్యుమెంట్లను సమర్పించి పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వ అధికారిక శాఖల నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవు.

ఇప్పటికే పెళ్లైనవారు లేదా విడాకులు తీసుకున్నవారు విదేశీయులను పెళ్లి చేసుకోవాలంటే మరిన్ని నిబంధనలు పాటించాలి. పెళ్లి అనుమతి కోసం దరఖాస్తు చేశాక ఆరు నెలలు ఆగాలి. అన్నీ పరిశీలించాకే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ నిబంధన ద్వారా తమ దేశంలోకి వచ్చేవారి సమాచారాన్ని సౌదీ ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది. దేశ పౌరుల రక్షణ కోసమే ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్నామని సౌదీ అరేబియా ప్రభుత్వం చెబుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని దేశం.. మరి వాహనాలను ఎలా నియంత్రిస్తారో తెలుసా?
Recommended image2
Girls vs Boys: అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉంటారు? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Recommended image3
చూడ్డానికి ఒకేలా ఉన్నా.. ఎస్కలేటర్, ట్రావెలేటర్ మధ్య తేడా ఏంటి.?
Related Stories
Recommended image1
Wedding Facts : తాళిని మూడుముళ్లు వేసే ఎందుకు కడతారో తెలుసా? ఈ సాంప్రదాయం వెనక ఇంత అర్థం దాగుందా..!
Recommended image2
Marriage : ఇదెక్కడి విడ్డూరం..! అబ్బాయి మెడలో అమ్మాయి తాళి కట్టి పెళ్ళాడిందా!!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved