MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • River : 6,400 కి.మీ దూరం ప్రవాహించే నదిపై ఒక్క బ్రిడ్జ్ కూడా లేదా..! అదేదో తెలుసా?

River : 6,400 కి.మీ దూరం ప్రవాహించే నదిపై ఒక్క బ్రిడ్జ్ కూడా లేదా..! అదేదో తెలుసా?

మూడు దేశాల గుండా ప్రయాణం, ఏకంగా 6,400 కిలోమీటర్ల పొడవు… ఇలాంటి నదిపై కనీసం ఒక్కటంటే ఒక్క బ్రిడ్జి కూడా లేదా..! ఇంతకూ ఆ నది ఏదో తెలుసా? ఈ నది గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 18 2026, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెజాన్ నది గురించి ఆసక్తికర విషయాలు..
Image Credit : pinterest

అమెజాన్ నది గురించి ఆసక్తికర విషయాలు..

Amazon River : దక్షిణ అమెరికా ఖండంలో ప్రవహించే అమెజాన్ నది కేవలం ఒక నీటి ప్రవాహం మాత్రమే కాదు, అది ఈ భూగోళానికి జీవనాడి. ప్రపంచంలోనే అత్యధిక నీటి ప్రవాహం కలిగిన నది ఈ అమెజాన్. దట్టమైన అడవుల గుండా ప్రయాణం, అరుదైన జీవరాశులు, విస్మయపరిచే సహజ వింతలతో నిండిన ఈ నది గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

పెరూ దేశంలోని ఆండిస్ పర్వతాల్లో పుట్టే ఈ అమెజాన్ నది బ్రెజిల్ లో అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తుంది. మధ్యలో మరో దేశం కొలంబియాలో కూడా ఈ నది ప్రవహిస్తుంది. ఇలా మూడు దేశాల గుండా దాదాపు 6,400 కిలోమీటర్ల (4,000 మైళ్ళు) దూరం ప్రయాణిస్తుంది. ప్రపంచంలోని అన్ని నదుల నుండి సముద్రాల్లో కలిసే నీటిలో 15 నుండి 20 శాతం ఈ అమెజాన్ నదివే. ఇలా ప్రపంచంలో అత్యధిక నీటి ప్రవాహం గల ఇలాంటి నదిపై ఒక్కటంటే ఒక్క బ్రిడ్జ్ లేకపోవడం ఆశ్చర్యకరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వంతెనలు లేని ఏకైక నది ఇదే..
Image Credit : Gemini AI

వంతెనలు లేని ఏకైక నది ఇదే..

వేల కిలోమీటర్ల పొడవునా ప్రవహించే అమెజాన్ నదిపై ఒక్కటంటే ఒక్క వంతెన (Bridge) కూడా లేకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. దట్టమైన వర్షాధార అడవులు ఉండటం, తీరం వెంట జనాభా చాలా తక్కువగా నివసించడం వల్ల ఇక్కడ వంతెనల అవసరం పడలేదు. పైగా వర్షాకాలంలో ఈ నది వెడల్పు విపరీతంగా పెరిగిపోతుంది. నది ఒడ్డున ఉన్న మట్టి చాలా మెత్తగా ఉండటం వల్ల ఇక్కడ వంతెనలు నిర్మించడం భౌగోళికంగా కూడా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడి ప్రజలు రవాణా కోసం ఎక్కువగా పడవలు, ఫెర్రీలనే ఉపయోగిస్తారు.

Related Articles

Related image1
Kumbha mela: కోట్లాది భక్తుల స్నానాలతో గంగా నది అపరిశుభ్రంగా మారిందా.? సాక్ష్యాలతో నిజం చెప్పిన శాస్త్రవేత్త
Related image2
Hyderabad Weekend Trip : ఏడు పాయలుగా చీలిన నది, నీటిమధ్యలో అద్భుత ఆలయం.. ఉదయం అలా వెళ్ళి సాయంత్రం ఇలా తిరిగిరావచ్చు
35
ప్రపంచంలోనే అతిపెద్ద నది
Image Credit : Getty

ప్రపంచంలోనే అతిపెద్ద నది

అమెజాన్ నది ప్రవాహ పరిమాణం (Water Discharge) విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని సముద్రాల్లోకి కలిసే మొత్తం మంచి నీటి ప్రవాహంలో దాదాపు 20 శాతం నీరు ఒక్క అమెజాన్ నది నుంచే వస్తుంది. ఈ నది గుండా సెకనుకు ప్రవహించే నీటి పరిమాణం దాదాపు 2,09,000 క్యూబిక్ మీటర్లు. ప్రపంచంలోని తర్వాత 7 అతిపెద్ద నదులు కలిపి మహాసముద్రంలోకి వదిలే నీటి కంటే అమెజాన్ నది ఒక్కటే ఎక్కువ నీటిని సముద్రంలోకి చేరుస్తుంది.

45
అమెజాన్ నదిలో అరుదైన ప్రాణులు
Image Credit : Gemini AI

అమెజాన్ నదిలో అరుదైన ప్రాణులు

అమెజాన్ నది తీరంలో ఉన్న అడవులను "భూగోళపు ఊపిరితిత్తులు" (Lungs of the Earth) అని పిలుస్తారు. ఈ నది అవవాహక ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద జీవవైవిధ్య కేంద్రంగా నిలిచింది. ప్రపంచంలో తెలిసిన ప్రతి 10 జీవజాతులలో ఒకటి అమెజాన్ ప్రాంతంలోనే నివసిస్తుంది.

పింక్ రివర్ డాల్ఫిన్లు : మంచి నీటిలో మాత్రమే నివసించే అరుదైన గులాబీ రంగు డాల్ఫిన్లు ఈ నది సొంతం.

పిరానా చేపలు : పదునైన పళ్ళు కలిగి, గుంపులుగా దాడి చేసే పిరానా చేపలు ఇక్కడ విస్తారంగా ఉంటాయి.

గ్రీన్ అనకొండ : ప్రపంచంలోనే అత్యంత బరువైన, పెద్ద పాములలో ఒకటైన గ్రీన్ అనకొండలు ఈ నది నీటిలోనే నివసిస్తాయి.

ఎలక్ట్రిక్ ఈల్స్ : దాదాపు 600 వోల్ట్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఎలక్ట్రిక్ ఈల్ చేపలు అమెజాన్‌లో పర్యటకులను, పరిశోధకులను ఆశ్చర్యపరుస్తాయి.

55
వర్షాకాలంలో 'సముద్రం'లా మారే నది
Image Credit : Gemini

వర్షాకాలంలో 'సముద్రం'లా మారే నది

సాధారణ రోజుల్లో అమెజాన్ నది వెడల్పు 2 నుండి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కానీ వర్షాకాలం వచ్చేసరికి ఈ నది నీటిమట్టం విపరీతంగా పెరుగుతుంది… కొన్ని ప్రాంతాల్లో నది వెడల్పు దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల వరకు మారుతుంది. సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద దీని వెడల్పు 325 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది కలిసే చోట నీటి ప్రవాహం ఎంత తీవ్రంగా ఉంటుందంటే... సముద్రం లోపలికి 160 కిలోమీటర్ల దూరం వరకు కూడా సముద్ర నీరు ఉప్పగా కాకుండా తీపి నీరుగానే ఉంటుంది.

అమెజాన్ నది కేవలం నీటి ప్రవాహమే కాకుండా భూగోళ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. వర్షాభావ పరిస్థితులు, అడవుల నరికివేత వంటి మానవ చర్యల వల్ల ఈ విచిత్ర జలవ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఈ భూమిపై జీవం సజావుగా సాగాలంటే అమెజాన్ నదిని, దాని చుట్టూ ఉన్న వర్షాధార అడవులను పరిరక్షించుకోవడం ఎంతో ఆవశ్యకం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Investment : ఈరోజు తులం బంగారం కొంటే 2050 నాటికి ఎంత డబ్బు వస్తుంది? లాభం ఎంత?
Recommended image2
Dimple Cheeks : కొందరి బుగ్గలపై సొట్టలు పడతాయి? ఈ సొట్టబుగ్గలకు కారణమేంటి?
Recommended image3
Ambani Ice cream: అంబానీ వారి ఐస్‌క్రీమ్.. అది కూడా కేవలం రూ.10లకే
Related Stories
Recommended image1
Kumbha mela: కోట్లాది భక్తుల స్నానాలతో గంగా నది అపరిశుభ్రంగా మారిందా.? సాక్ష్యాలతో నిజం చెప్పిన శాస్త్రవేత్త
Recommended image2
Hyderabad Weekend Trip : ఏడు పాయలుగా చీలిన నది, నీటిమధ్యలో అద్భుత ఆలయం.. ఉదయం అలా వెళ్ళి సాయంత్రం ఇలా తిరిగిరావచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved