MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Plants: చీకటి గదిలో పెట్టినా మొక్కలకు పగలు, రాత్రి ఎలా తెలుస్తుంది? బయటపడ్డ బిగ్ సీక్రెట్

Plants: చీకటి గదిలో పెట్టినా మొక్కలకు పగలు, రాత్రి ఎలా తెలుస్తుంది? బయటపడ్డ బిగ్ సీక్రెట్

Plant Circadian Clock: మొక్కలు రాత్రి, పగలును ఎలా గుర్తిస్తాయో మీకు తెలసా? పరిశోధకులు షాకింగ్ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. మొక్కల శరీరంలో ఉండే సర్కేడియన్ క్లాక్, షుగర్, ఎథిలీన్ గ్యాస్ పాత్రపై సైంటిస్టులు ఏం చెప్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 18 2026, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొక్కలకు కూడా ఒక డైలీ రూటీన్.. సర్కేడియన్ క్లాక్ రహస్యం ఏంటో తెలుసా?
Image Credit : Gemini

మొక్కలకు కూడా ఒక డైలీ రూటీన్.. సర్కేడియన్ క్లాక్ రహస్యం ఏంటో తెలుసా?

మనుషులకు ఉన్నట్టే చెట్లకు, మొక్కలకు కూడా ఒక డైలీ రూటీన్ ఉంటుంది. మనం ఉదయాన్నే లేవడం, తినడం, పనులు చేసుకోవడం, రాత్రికి నిద్రపోవడం ఎలాగో.. మొక్కల్లో కూడా అలాగే ఒక నిర్దిష్టమైన సైకిల్ నడుస్తుంది.

పగటి సమయంలో మొక్కల ఆకులు సూర్యరశ్మి, కార్బన్ డై ఆక్సైడ్ ఆధారంగా ఫోటోసింథసిస్ ద్వారా షుగర్‌ను తయారు చేస్తాయి. అదే రాత్రి వేళల్లో ఈ ప్రక్రియ చాలా స్లో అవుతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. మొక్కల ఎదుగుదల, ఇతర పనులు కూడా రోజులో సమయాన్ని బట్టి మారిపోతుంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొక్కల 24 గంటల సర్కేడియన్ క్లాక్ ఎలా పనిచేస్తుంది?
Image Credit : AI Image

మొక్కల 24 గంటల సర్కేడియన్ క్లాక్ ఎలా పనిచేస్తుంది?

చెట్లు పగలు, రాత్రిని బట్టి మారడానికి వాటి శరీరంలో ఉండే 24 గంటల సర్కేడియన్ క్లాక్ కారణం. జీవుల బాడీలోని మెటబాలిజం, బ్లడ్ ప్రెజర్, నిద్ర, హార్మోన్ల విడుదల వంటి ప్రక్రియలను ఈ గడియారమే కంట్రోల్ చేస్తుంది.

అయితే సైంటిస్టులకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఏదైనా ఒక మొక్కను పూర్తిగా చీకటిగా ఉండే గదిలో ఉంచినా కూడా, దాని పగలు-రాత్రి సైకిల్ కొన్ని రోజుల పాటు అలాగే నడుస్తుంది. అంటే మొక్కలు కేవలం సూర్యుడి వెలుగును చూసి మాత్రమే సమయాన్ని లెక్కించవు. వాటి బాడీ లోపల ఒక ప్రత్యేకమైన ఇంటర్నల్ క్లాక్ పనిచేస్తుంది.

Related Articles

Related image1
Famous Temples in South India: సౌత్ ఇండియాలో జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టాప్ 5 హిందూ దేవాలయాలు
Related image2
Nagupamu In Dream: నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది?
35
క్లాక్ సైకిల్‌లో షుగర్, ఎథిలీన్ గ్యాస్ రోల్
Image Credit : chatgpt

క్లాక్ సైకిల్‌లో షుగర్, ఎథిలీన్ గ్యాస్ రోల్

సూర్యరశ్మి ద్వారా మొక్కల్లో తయారయ్యే సుక్రోజ్ ఈ జెనెటిక్ క్లాక్‌ను రన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చీకటిలో మొక్కల సర్కేడియన్ రిథమ్‌ను కాపాడటానికి షుగర్ అవసరం. అదే సమయంలో నిరంతరం వెలుతురు ఉంటే, ఈ షుగర్ సైకిల్ సమయాన్ని తగ్గిస్తుంది. అంటే మొక్కలు వెలుతురుతో పాటు తమలో తయారయ్యే షుగర్ ఆధారంగా కూడా పగలు, రాత్రిని గుర్తుపడతాయి.

దీంతో పాటు మొక్కలు ఎథిలీన్ అనే గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనిని ఏజింగ్ హార్మోన్ అని పిలుస్తారు. పండ్లు త్వరగా పండటానికి ఇది ఉపయోగపడుతుంది. బాగా పండిన అరటిపండును ఎవోకాడో పక్కన పెడితే, దాని నుంచి వచ్చే ఎథిలీన్ గ్యాస్ వల్ల ఎవోకాడో కూడా త్వరగా పండుతుంది. ఇది మొక్కల మధ్య ఒక కెమికల్ సిగ్నల్‌లా పనిచేస్తుంది.

45
Arabidopsis మొక్కపై సైంటిస్టుల రీసెర్చ్
Image Credit : annawaldl to Pixabay

Arabidopsis మొక్కపై సైంటిస్టుల రీసెర్చ్

Arabidopsis అనే ఒక చిన్న పూల మొక్కపై శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు. ఎథిలీన్ గ్యాస్ కేవలం పగలు రాత్రి బట్టి మారడమే కాకుండా, మొక్కలోని సర్కేడియన్ క్లాక్‌ను కూడా రెగ్యులేట్ చేస్తుందని గుర్తించారు. ఇది మొక్క బాడీ క్లాక్‌తో ముడిపడి ఉన్న GIGANTEA వంటి జీన్‌పై ప్రభావం చూపుతుంది. ఎథిలీన్ వల్ల సర్కేడియన్ సైకిల్ తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, షుగర్ ఆ ప్రభావాన్ని అడ్డుకుంటుంది.

మొక్కల్లో ఒక్క గడియారం మాత్రమే ఉండదు. 24 గంటల సర్కేడియన్ క్లాక్‌తో పాటు, రుతువులు, దీర్ఘకాలిక మార్పులను గుర్తించే ఇతర టైమింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఈ సైకిల్స్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటే పంటల దిగుబడిని పెంచవచ్చు. అలాగే కూరగాయలు, పండ్ల లైఫ్‌ను పెంచే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

55
కోసిన తర్వాత కూడా పండ్లు బతికే ఉంటాయా?
Image Credit : getty

కోసిన తర్వాత కూడా పండ్లు బతికే ఉంటాయా?

మనం కోసేసిన తర్వాత కూడా పండ్లు, కూరగాయల్లోని కణాలు బతికే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి జీవ గమనం పూర్తిగా ఆగిపోదు. అందుకే అరటిపండ్లను రవాణా చేసేటప్పుడు పాడవకుండా ఉండటానికి పచ్చిగా ఉన్నప్పుడే కోస్తారు. డెలివరీ పాయింట్‌కు చేరుకున్నాక, ఎథిలీన్ గ్యాస్ సహాయంతో వాటిని పండిస్తారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
విద్య
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Investment : ఈరోజు తులం బంగారం కొంటే 2050 నాటికి ఎంత డబ్బు వస్తుంది? లాభం ఎంత?
Recommended image2
Dimple Cheeks : కొందరి బుగ్గలపై సొట్టలు పడతాయి? ఈ సొట్టబుగ్గలకు కారణమేంటి?
Recommended image3
Ambani Ice cream: అంబానీ వారి ఐస్‌క్రీమ్.. అది కూడా కేవలం రూ.10లకే
Related Stories
Recommended image1
Famous Temples in South India: సౌత్ ఇండియాలో జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టాప్ 5 హిందూ దేవాలయాలు
Recommended image2
Nagupamu In Dream: నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved