MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • `పుష్ప`లో అల్లు అర్జున్‌, రష్మిక, ఫహద్‌ పాత్రలకు మొదట సుకుమార్‌ అనుకున్న స్టార్స్ ఎవరో తెలుసా? మతిపోవాల్సిందే

`పుష్ప`లో అల్లు అర్జున్‌, రష్మిక, ఫహద్‌ పాత్రలకు మొదట సుకుమార్‌ అనుకున్న స్టార్స్ ఎవరో తెలుసా? మతిపోవాల్సిందే

అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` మూవీ సంచలనంగా మారింది. అయితే ఈ సినిమాలో సుకుమార్‌ అనుకున్న మొదటి కాస్టింగ్‌ అంతా వేరే. ఒకవేళ వాళ్లే కాస్టింగ్‌ అయితే..  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 22 2024, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తెలుగులో రూపొందుతున్న భారీ బడ్జెట్‌, మోస్ట్ ఎగ్జైటింగ్‌ ప్రాజెక్ట్ ల్లో `పుష్ప2` ఒకటి. `పుష్ప`కిది కొనసాగింది. మొదటి భాగం పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. విలన్‌ పాత్రలో ఫహద్‌ ఫాజిల్‌ నటించాడు. క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌ రూపొందించిన మూవీ ఊహించినవిజయాన్ని సాధించింది. ఇండియన్‌ ఆడియెన్స్ ని మాత్రమే కాదు, మేకర్స్ ని సర్‌ప్రైజ్‌ చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దీనికి రెండో్ పార్ట్ ని రూపొందిస్తున్నారు సుకుమార్‌. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్‌ పాత్రలో మొదట సుకుమార్‌ ఎవరిని అనుకున్నారనేది ఇప్పుడు వైరల్‌ అవుతుంది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే మహేష్‌బాబుతో సుకుమార్‌ ఓ సినిమా చేయాల్సింది. కానీ అది వర్కౌట్‌ కాలేదు. అధికారికంగా ప్రకటించి మళ్లీ బ్యాక్‌ అయ్యారు. ఈ మూవీ కథనే అల్లు అర్జున్‌కి చెప్పాడని, ఆయన చేశాడని, అదే `పుష్ప` అంటున్నారు. కానీ దర్శకుడి వెర్షన్‌లో మాత్రం అది వేరే ఇదే వేరే అంటున్నారు. 
 

35

ఇదిలా ఉంటే `పుష్ప` కథకి కూడా మహేష్‌ బాబునే హీరోగా అనుకున్నాడట సుకుమార్‌. అప్పటికే మహేష్‌ బాబుతో సినిమా సెట్‌ కాకపోవడంతో బన్నీకి చెప్పాడట. బన్నీతో ఓ సినిమా చేయాల్సిన కమిట్‌ మెంట్‌ఉన్న నేపథ్యంలో ఈ కథని చెప్పగా ఆయన ఓకే చేశాడు. అలా `పుష్ప` తెరకెక్కింది. అయితే అల్లు అర్జున్‌ పాత్రనే కాదు, శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్నా పాత్రకి, నెగటివ్‌రోల్‌ చేసిన ఫహద్‌ ఫాజిల్‌ పాత్రకి కూడా సుకుమార్‌ వేరే ఆర్టిస్ట్ లను అనుకున్నారట. 

45

శ్రీవల్లి పాత్రకి మొదట సమంతని అనుకున్నాడట సుకుమార్‌. ఆమెని అప్రోచ్‌ అయినట్టు సమాచారం. కానీ సామ్‌ ఆసక్తి చూపించలేదు. దీంతో రష్మిక మందన్నా వద్దకు వెళ్లింది. ఇంకోవైపు మొదట షేకావత్‌ పాత్రకి విజయ్‌ సేతుపతిని అనుకున్నాడట సుకుమార్‌. అది కూడా సెట్‌ కాలేదు. దీంతో ఫహద్‌ ఫాజిల్‌ని దించాడట. ఐటెమ్ సాంగ్‌ కోసం నోరా ఫతేహి ని అనుకున్నారట. ఆమె చేయకపోవడంతో సమంతని తీసుకున్నారని తెలుస్తుంది. మహేష్‌, సమంత, విజయ్‌ సేతుపతి చేయాల్సిన ఈ మూవీ బన్నీ, రష్మిక, ఫహద్‌లు చేశారు. బ్లాక్‌ బస్టర్‌ కొట్టారు. వీళ్లు తప్ప మరెవ్వరు సెట్‌ కారు అనేలా చేసి తామేంటో నిరూపించుకున్నారు. ఒకవేళ ఫస్ట్ అనుకున్న కాస్టింగ్‌తో సినిమా చేస్తే ఈ రేంజ్‌ రీచ్‌, హైప్‌ ఉండేదా అనేది డౌట్‌. 

55

ప్రస్తుతం `పుష్ప2` శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల సినిమాకి హైలైట్‌ అయితే జాతర ఎపిసోడ్‌ని భారీ స్థాయిలో తెరకెక్కించారట. రాజీపడకుండా సుకుమార్‌ తీశారని తెలుస్తుంది. మరో షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరగబోతుందట. కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు. ఆ తర్వాత జపాన్‌లో షూటింగ్‌ ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ రెండో పార్ట్ ఎండింగ్‌లో విజయ్‌ సేతుపతి కనిపించబోతున్నారని తెలుస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved