Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించింది ఎవరు..? చిరంజీవిపై పుకార్లు ఎందుకు వచ్చాయి...?

సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించింది ఎవరు..? చిరంజీవిపై పుకార్లు ఎందుకు వచ్చాయి...?

ఒకప్పుడు తిరుగులేని స్టార్ హీరోగా ఉన్న సుమన్ పై లేని పోని పుకార్లు ఎందుకు వచ్చాయి. సుమన్ ను స్టార్ హీరో అవ్వకుండా అడ్డుకున్నది ఎవరు..? ఆయన జీవితాల్లో వివాదాలకు కారణం ఏంటి..?   

Mahesh Jujjuri | Updated : Jan 07 2025, 05:22 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Actor suman

Actor suman


80స్ హీరోలలో సుమన్ చాలా అందంగా ఉండేవారు. మేకప్ వేసినా వేయకపోయినా.. సుమన్ ఎంతో అందంగా హ్యాండ్సమ్ గా కనిపించేవారు. అందుకే చాలామంది అమ్మాయిలు ఆయన్ను ఇష్టపడేవారు. మంచి నటన, గ్లామర్ అన్నీ ఉన్న సమన్ స్టార్ హీరో స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు.

సుమన్ ను స్టార్ అవ్వకుండా తొక్కేశారు అన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి గతంలో. అంతే కాదు సుమన్ పై అన్యాయంగా కేసులు పెట్టి ఎదగకుండా చేయండ.. మరీ ముఖ్యంగా సుమన్ పై బ్లూ ఫిల్మ్ చేస్తున్నాడంటూ కేసు సంచలనంగా మారింది. దాంతో సుమన్ కెరీర్ పై ఇది ఎక్కువగా ప్రభావం చూపించింది. 

26
actor suman

actor suman

అయితే ఇందులో నిజానిజాలు ఏంటి..? సుమన్ ను ఈ విషయంలో ఇరికించారా..? ఆ పని చేసింది ఎవరు..? ఈ విషయాల్లో ఒ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సుమన్ తో సన్నిహితంగా ఉండే సీనియర్ దర్శకులు సాగర్.  గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈయన చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి.

సుమన్ మెడకి చుట్టుకున్న వివాదం ఏంటి ? అసలు సుమన్ పై కేసులు ఎవరు పెట్టారు ? ఎందుకు పెట్టారు అనే విషయాల్ని సాగర్ పూర్తిగా వివరించారు. ఇందులో ఉన్న అపోహల్ని, ఊహాగానాలని తొలగించారు.ఇంటర్వ్యూలో సాగర్ ఈ విషయాలు బయట పెట్టారు
 

36
Suman

Suman

ఆయన మాట్లాడుతూ.. సుమన్ పై రాజకీయంగా ఈ కేసులు పడ్డాయన్నారు. ముఖ్యమంత్రి కి తెలిసి ఈ విషయం జరిగిందన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి, డిజిపి చాలా పవర్ ఫుల్. లిక్కర్ కంట్రాక్టర్ కూడా ధనబలంతో పవర్ ఫుల్ గా ఉంటారు.

అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్, రాష్ట్ర డిజిపి, లిక్కర్ కాంట్రాక్టర్ వడయార్ ఈ ముగ్గురి వల్లే సుమన్ జైలుపాలయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో సుమన్ పై హై లెవల్ స్కెచ్ వేసి ఇరికించారు. కొన్ని బెయిల్ రాని కేసులు కూడా పెట్టారు. 

46
kollywood actor suman

kollywood actor suman

సుమన్ మంచి అందగాడు కావడంతో చాలామంది అమ్మాయిలు ఆయన్ వెంటపడేవారట. సుమన్ ను అప్పటి  డిజిపి కుమార్తె ఇష్టపడిందట . కానీ సుమన్ కి ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేదు. ఆల్రెడీ ఆమెకు పెళ్ళవడ్డం.. అయినా సరే  సుమన్ ని ఇష్టపడేదిట.

అదేటైమ్ లో  సుమన్ స్నేహితుడు ఒకడు వడయార్ కుమార్తెని ప్రేమించాడు. ఇటు డిజిపి కూతురు సుమన్ షూటింగ్ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి పోలీస్ సెక్యూరిటీతో వెళ్ళేదట. ఇక ఈ విషయంలో రకరకాల ఊహాగానాల నడుమ.. విషయం వైరల్ అయ్యింది.

ముఖ్యమంత్రి ఎంజీఆర్ దగ్గరకు సుమన్, డిజిపి కూతురు వ్యవహారం  వెళ్ళింది. దీనితో ఎంజీఆర్ సుమన్ ని పిలిపించాడు. బాబు నువ్వు నటుడివి. ఎంతో భవిష్యత్తు ఉంది. ఇలాంటివి వద్దు అని ఎంజీఆర్ చెప్పారట. ఎంజీఆర్ కు అప్పటికే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటంతో.. అప్పట్లో మాట్లాడే స్థితిలో లేరు. ఏమైనా చెప్పాలనుకుంటే రాసి చూపించేవారు. 
 

56
Suman Talwar

Suman Talwar

దీనితో సుమన్ ఆ విషయం నాకు కాదు చెప్పాల్సింది.. ఆ అమ్మాయికి అనిచెప్పండి అని అన్నాడట.  సున్నితంగానే ఎంజీఆర్ తో అన్నారట. అది రాంగ్ వేలో వెళ్ళింది. సుమన్ చెప్పిన సమాధానం ఎంజీఆర్ కి నచ్చలేదు. దీనితో డిజిపి తన బలం ఉపయోగించి సుమన్ పై అల్లర్ల కేసు పెట్టి అరెస్ట్ చేశారు. లోలోపల చాలా కేసులు బనాయించారు. కానీ బ్లూ ఫిలిం కేసు పెట్టినట్లు కూడా ప్రచారం జరిగింది. అవన్నీ వట్టి పుకార్లు అని సాగర్ కొట్టిపారేశారు. సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాప్ ఉండేది. ఆ విధంగా అపుకార్లు వచ్చాయి అని అన్నారు. 
 

66
Asianet Image

కొన్ని నెలల పాటు సుమన్ జైల్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మగారికి గవర్నర్ బాగా తెలుసు. కాబట్టి త్వరగానే బెయిల్ వచ్చింది. కానీ బయటకు వచ్చేసరికి సుమన్ డబ్బు ఇచ్చిన స్నేహితులందరూ మోసం చేశారు. ఆ విధంగా సుమన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సాగర్ తెలిపారు. అయితే సుమన్ అరెస్ట్ వెనుక చిరంజీవి ఇన్వాల్వ్ మెంట్ ఉండనే పుకార్లు అప్పట్లో పత్రికల్లో వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు అని సాగర్ అన్నారు. ఆవంత పనికిమాలిన ఊహాగానాలు అని అన్నారు. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories