MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మీకు తెలుసా? ఆయన ప్లేట్ లో ఎక్కువగా కనిపించే కూరలేంటి? ఇష్టంగా ఏం తింటారు. షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు ఆయన ఆహరపు అలవాట్లు ఎలా ఉంటాయి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 18 2026, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలకృష్ణ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మీకు తెలుసా?
Image Credit : Asianet News

బాలకృష్ణ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మీకు తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ వెండితెరపై ఎంత మాస్ అండ్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తారో, బయట కూడా అంతే ఆత్మీయంగా, కచ్చితమైన అలవాట్లతో ఉంటారు. ముఖ్యంగా భోజనం విషయంలో ఆయనకు కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలు, పద్ధతులు ఉన్నాయి. ఆయన ఆహారపు అలవాట్ల గురించి మీకు తెలుసా? బాలయ్య ఎక్కువగా ఇష్టపడే భోజనం ఏంటి? ఆయన ప్లేట్ లో ఎక్కువగా కనిపించే కూర ఏది. కడుపునిండా తిన్నా కూడా ఆయన ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాలయ్య ప్లేట్‌లో పక్కాగా ఉండాల్సిన ఆ కూర ఏంటి?
Image Credit : Asianet News

బాలయ్య ప్లేట్‌లో పక్కాగా ఉండాల్సిన ఆ కూర ఏంటి?

బాలకృష్ణ భోజనం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నాన్-వెజ్ . అయితే ఆయన నాన్ వెజ్ మాత్రమేకాదు వెజ్ ను కూడా బాగా ఇష్టపడతారు. రోజువారి భోజనం ప్లేట్‌లో పక్కాగా, ప్రతిరోజూ ఉండాల్సిన వాటిలో 'పప్పు' పక్కాగా ఉండాల్సిందే. భోజనం ముగించే ముందు లేదా ప్రారంభంలో వేడివేడి అన్నంలోకి నేతి పప్పు, ఆవకాయ లేదా పప్పుచారు ఉండటం ఆయనకు అలవాటు. అంతే కాదు బాలయ్య ఎక్కువగా ఇష్టపడే వాటిలో గోంగూర పచ్చడి ముందుంటుంది. ఆయన భోజనం గోంగూర పచ్చడి లేకుండా పూర్తి అవ్వదని అంటుంటారు.

35
బాలకృష్ణకు అత్యంత ఇష్టమైన నాన్-వెజ్ వంటకాలు
Image Credit : facebook.com/OnlyForBalakrishnaFans

బాలకృష్ణకు అత్యంత ఇష్టమైన నాన్-వెజ్ వంటకాలు

బాలయ్యకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా రాయలసీమ నాటు కోడి వంటకాలంటే ఎంతో ఇష్టం. ఇంట్లో అయినా.. షూటింగ్ స్పాట్‌లో అయినా.. నాటుకోడి పులుసు, గారెల కాంబినేషన్ ఆయన అత్యంత ఇష్టంగా తింటారట. ఇక మటన్ అంటే కూడా బాలయ్యకు ఇష్టమని తెలుస్తోంది. సంప్రదాయ పద్ధతిలో కారంగా, మసాలాలతో వండిన మటన్ కూరలు, తలకాయ కూరను ఆయన చాలా ఇష్టపడతారని తెలుస్తోంది.

45
షూటింగ్ లో ఉంటే బాలయ్య భోజనం సంగతేంటి?
Image Credit : Facebook/Nandamuri Balakrishna

షూటింగ్ లో ఉంటే బాలయ్య భోజనం సంగతేంటి?

బాలకృష్ణ కేవలం తినడమే కాదు, ఇతరులకు కొసరి కొసరి వడ్డించడంలోనూ ఎంతో ముందుంటారు. షూటింగ్ సమయంలో బాలకృష్ణ ఇంటి భోజనం తినరు. ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి.. షూటింగ్ లో ఉంటే.. అందరితో పాటు ప్రొడక్షన్ లో ఏభోజనం ఉంటే అదే తింటారు. ఇంటికి దగ్గరలో షూటింగ్ జరుగుతున్నా సరే.. ఆయన ప్రొడక్షన్ ఫుడ్ నే ఇష్టపడతారు. ఎవరైనా అడిగినా కూడా తను ఆ ఫుడ్ తినే ఈ స్థాయికి వచ్చినట్టు గౌరవంగా చెపుతారు. అందరితో కలిసి.. అందరు తినే భోజనం తినడమే ఆయనకు ఇష్టం.

55
ఫిట్‌నెస్ కోసం బాలయ్య ఏం చేస్తారు?
Image Credit : balakrishna facebook

ఫిట్‌నెస్ కోసం బాలయ్య ఏం చేస్తారు?

వయస్సు పెరుగుతున్నా ఇప్పటికీ అంతే ఉత్సాహంతో, ఫిట్‌గా ఉండేందుకు బాలకృష్ణ ఏం చేస్తారని చాలామంది తెలుసుకోవాలని అనుకుంటారు. ఆయన పలు సందర్భాల్లో చెప్పిన దాని ప్రకారం.. బాలయ్య ఉదయం 3 గంటల తరువాత లేస్తారు. నాలుగున్నర గంటలలోపు వ్యాయామం, స్నానం, పూజ అయిపోతుంది. ఉదయాన్నే కసరత్తులు చేయడం ఆయనకు అలవాటు. అంతే కాదు మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు, ఎప్పుడు దైవ ధ్యానంలో ఉంటుంటారు. కడుపునిండా భోజనం చేసినా.. దానికి తగ్గట్టు వ్యాయామం చేయడం బాలయ్యకు అలవాటు. ఈ అలవాట్లే బాలకృష్ణను ఈ ఏజ్ లో కూడా ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: కోమా నుంచి బయటపడడమే గొప్ప అయితే బోనస్ గా హీరోకి ఆ శక్తి..ఓటీటీలోకి మలయాళీ థ్రిల్లర్, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Sara Ali Khan Home: తండ్రి 5000 కోట్ల ఆస్తికి అధిపతి.. రూ.18 కోట్ల హౌస్ లో ఉంటున్న కూతురు
Recommended image3
Naga Chaitanya: నాగార్జున మొదటి భార్య ఇప్పుడేం చేస్తోంది? నాగ చైతన్య తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా?
Related Stories
Recommended image1
Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved