ఈ జబర్దస్త్ యాంకర్ ఒకేసారి ఇద్దరు లవర్స్ ని మైంటైన్ చేసిందా... అసలు ఏం జరిగింది?
జబర్దస్త్ యాంకర్ గా ఉన్న సిరి హన్మంత్ పై ఒక అపవాదు ఉంది. ఆమె ఏక కాలంలో ఇద్దరు లవర్స్ ని మైంటైన్ చేసిందట. ఆమె కారణంగా ఒక జంట విడిపోవడంతో పాటు ఏళ్లుగా ప్రేమిస్తున్న ప్రియుడు కూడా బాధపడ్డాడట. దీని పై ఆమె ఒకసారి వివరణ ఇచ్చింది.
అనసూయ జబర్దస్త్ మానేశాక, కన్నడ భామ సౌమ్యరావు రంగంలోకి దిగింది. ఏడాదికి పైగా ఆమె యాంకర్ గా ఉన్నారు. కారణం తెలియదు కానీ సౌమ్యరావు కూడా తప్పుకుంది. ఆమె స్థానంలోకి సిరి హన్మంత్ వచ్చింది. కొన్నాళ్లుగా ఆమెనే కొనసాగుతున్నారు.
కాగా సిరి హన్మంత్ పై ఒక అపవాదు ఉంది. శ్రీహాన్ తో చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న ఆమె మరొకరిని కూడా ఇష్టపడిందట. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తో ఆమె ఎఫైర్ సాగించారని అంటారు.
బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్, సిరి హన్మంత్ పాల్గొన్నారు. వీరిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగేవారు. ఒకరికి మరొకరు మద్దతుగా ఉండేవారు. వారి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని వారు అంటారు. ప్రవర్తన మాత్రం కొంచెం తేడాగా ఉండేది.
సిరి విషయంలో షణ్ముఖ్ చాలా పొసెసివ్ గా ఉండేవాడు. వేరొకరితో మాట్లాడినా, సన్నిహితంగా ఉన్నా నచ్చేది కాదు. ఇద్దరి మధ్య గొడవలు, ఏడుపులు, అలగడాలు, కలిసిపోవడాలు... ఇలా అనేక ఎమోషన్స్ ఉండేవి. ఓ సారి షణ్ముఖ్ కోసం సిరి బాత్ రూమ్ లో తల బద్దలు కొట్టుకుంది.
ఈ క్రమంలో సిరి-షణ్ముఖ్ లవర్స్ అనే ప్రచారం జరిగింది. దీన్ని బలపరుస్తూ షణ్ముఖ్ లవర్ దీప్తి సునైన అతనికి బ్రేకప్ చెప్పింది. షణ్ముఖ్-దీప్తి సునైన విడిపోవడానికి సిరినే కారణం అని కథనాలు వెలువడ్డాయి. వాటిని సిరి ఖండించింది.
శ్రీహాన్ ఉండగా బిగ్ బాస్ హౌస్లో షణ్ముఖ్ తో రొమాన్స్ చేసింది. అతనికి దగ్గరైందన్న పుకార్ల మీద ఓ షోలో సిరి స్పందించింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక శ్రీహాన్ నేను ఒకరినొకరం అపార్థం చేసుకోవడం, అర్థం చేసుకోవడం జరిగింది.
ప్రపంచం అంతా నేను తప్పు చేశాను అన్నారు. కానీ లోకంగా ఒకవైపు శ్రీహాన్ మరొకవైపు ఉన్నాడు. తొమ్మిదేళ్ల రిలేషన్ తర్వాత మరోసారి కొత్తగా జీవితం స్టార్ట్ చేశాము... అని చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ తో నాకు ఎలాంటి ఎఫైర్ లేదని ఆమె పరోక్షంగా చెప్పింది. ఓ సందర్భంలో తప్పులు అందరూ చేస్తారని సిరి అనడం విశేషం.
సిరి-శ్రీహాన్ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. వీరి వద్ద సిరి కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి పెరుగుతున్నాడు. అతడు శ్రీహాన్ తండ్రిగా, సిరిని తల్లిగా భావిస్తాడు. మరోవైపు విడిపోయిన షణ్ముఖ్, దీప్తి సునైన మరలా కలవలేదు.