MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dhamki Review: విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ ట్విట్టర్ రివ్యూ, డబుల్ ట్రీట్ ఇచ్చిన మాస్ కా దాస్

Dhamki Review: విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ ట్విట్టర్ రివ్యూ, డబుల్ ట్రీట్ ఇచ్చిన మాస్ కా దాస్

విశ్వక్ సేన్ యమా జోరుమీద ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. పక్కా ప్లాన్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. అప్పుడప్పుడు మెగా ఫోన్ కూడా పట్టుకుంటున్న ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం ధమ్కీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈరోజు రిలీజ్ అవుతున్న సినిమా ప్రీమిర్ షోలు పడగా.. ధమ్కీపై తమ అభిప్రయాలు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు ఆడియన్స్. మరి వారు ఏమంటున్నారో చూద్దాం...? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 22 2023, 07:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బ్లాక్ బస్టర్స్ కాకపోయినా.. ఓ మోస్తారు మాస్ హిట్లతో జోరు పెంచాడు విశ్వక్ సేన్. అంతే కాదు అప్పుడప్పుడు డైరెక్షన్ కూడా చేస్తూ.. షాక్ ఇస్తున్నాడు.ఫ‌ల‌క్‌నుమాదాస్ తరువాత విశ్వక్ సేన్ విశ్వక్  స్వీయ దర్శకత్వంలో.. తానే హీరోగా తెరకెక్కిన సినిమా దాస్ కా ధమ్కీ. ఈసినిమా ఉగాది కానుకగా  ఈరోజు(22 మార్చి) రిలీజ్ కు రెడీగా ఉంది. 

29

నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాల విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ చేశాడు. మరోసారి దర్శకుడు తరుణ్ భాస్కర్ నటుడిగా తెరపై కనిపించబోతున్నాడు ఈసినిమాతో. ఇక ధమ్కీ సినిమా ప్రీమియర్ షోలు సదడి చేయగా. ఈసినిమాపై ఆడియన్స్ తమ అభిప్రాయాలు ట్వీట్టర్ ద్వారా తెలియచేస్తున్నారు. ఎక్కువ శాతం ధమ్కీ  సినిమాపై పాజిటీవ్ గానే కామెంట్స్ వస్తున్నాయి. 

39

ఈసినిమా ఫస్ట్ హాఫ్ బాగుందంటున్నారు ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ మూవీ బాగానే ఆకట్టుకుంది. అంతే కాదు కామెడీ కూడా సినిమాకు ప్లాస్ పాయింట్ అవుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా పర్వాలేదనిపించందట ప్రేక్షకులకు. పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు లేదు. అందరూ ఊహాంచే విధంగానే ఉంది. ట్విస్ట్ ఏమీ కనిపించలేదు అంటున్నారు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ సినిమా మాత్రం బాగుంది అనేస్తున్నారు. 

49

అయితే ఈసినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అంటున్నారు ట్విట్టర్ జనాలు. విశ్వక్ సేన్ కు ఓ సలహా కూడా ఇస్తున్నారు. విశ్వక్ తన హెయిర్ స్టైల్ ను మార్చుకుంటే బాగుంది.. ఎప్పుడూ ఒకటే హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నారు. అది కూడా బెటర్ హోయిర్ స్టైల్ ను మెయింటేన్ చేస్తే చూడాలని ఉంది అంటున్నారు మాస్ కా దాస్ ఫ్యాన్స్. 
 

59

ఈసినిమా స్క్రీన్ ప్లే  అద్భుతంగా ఉంది అంటున్నారు ఆడియన్స్... అంతే కాదు సాంగ్స్ పక్కాగా ఎక్కడ రావాలో అక్కడ వచ్చేలా ప్లాన్ చేశారు.. పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు సినిమాలో సెకండ్ హాఫ్ ఎక్కువగా ఆడియన్స్ ను ఆకర్షిస్తోంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లు అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. కొన్ని సీన్లు థ్రిల్లింగా అనిపించాయట. 
 

69

ఇంట్రవెల్ ను యావరేజ్ గా.. ఊహించే విధంగా ఇచ్చిన విశ్వక్ సేన్.. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగా ఇచ్చాడట. అంతే కాదు ప్రీ క్లైమాక్స్ కూడా సూపర్ గా ఉంటుంది అంటున్నారు. అంతే కాదు సెకండ్ హాఫ్ లో పంచ్ లు.. ఒకటి తేరుకునేలోపు మరో ట్విస్ట్ తో.. సినిమాను ఇంట్రెస్టింగ్ గా మార్చాడంటూ.. విశ్వక్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది. 

79
Dhamki

Dhamki

ఈసినిమాలో ప్లస్ పాయింట్స్ తో పాటు మైనస్ లు కూడా చెప్పేస్తున్నారు ట్విట్టర్ జనాలు. ముఖ్యంగా సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు కొన్ని ఇబ్బందిపెడుతున్నాయని అంటున్నారు. అంతే కాదు ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగా ఉంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం అవుతుందిత. 
 

89

ఇక ఈసినిమాలో ఐటం సాంగ్ అనవసరంగా పెట్టారంటూ కామెంట్ చేస్తున్నారు జనాలు. ఈ సాంగ్ తో సినిమాకు పెద్దగా ఉపయోగం లేదంటున్నారు. అంతే కాదు విశ్వక్ సేన్ హెయిర్ స్టైల్ క్యారెక్టర్ కు సూటబుల్ గా లేదు అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 

99

ఇక ఈసినిమా మొత్తానికి చాలా మంది మనసును గెలుచుకుంది. అయితే.. ఈరోజు రిలీజ్ తరువాత అందరూ ఆదరిస్తారా..? సూపర్ హిట్ అవుతుందా..? యావరేజ్ గా మిగులుతుందా అనేది చూడాలి. చాలా వరకూ ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందే విధంగానే ఉంది అంటున్నారు ట్విట్టర్ జనాలు. మరి ఈరోజు రిలీజ్ తరువాత చూడాలి మాస్ కా దాస్ ధమ్కీ.. దమ్ము. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Hansika Divorce: విడాకులు మంజూరు చేసిన కోర్టు, సంచలన నిర్ణయం తీసుకున్న హన్సిక.. ఎవ్వరూ ఊహించలేరు
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్, శ్రీలీల ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ అదిరింది.. కానీ ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?
Recommended image3
Rashmika Mandanna: స్వేచ్ఛనిచ్చే ప్రేమను వెతుక్కోండి.. రష్మిక మందన్న పోస్ట్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved