MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి

Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి

Allu Arjun Raaka Movie: అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ రాకా సినిమాలో 37 మందిని ఒకేసారి రియల్ టైమ్ మోషన్ క్యాప్చర్ చేయడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదైంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 21 2026, 09:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాకా 37 వెనుక అసలు మిస్టరీ ఇదే
Image Credit : Asianet News

రాకా 37 వెనుక అసలు మిస్టరీ ఇదే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రాకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌లో 37 అనే నంబర్‌ను ప్రత్యేకంగా చూపించడంతో ఈ సంఖ్య వెనుక ఉన్న రహస్యం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఇప్పుడు దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఆ మిస్టరీకి తెరపడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
37 సంఖ్య వెనుక గిన్నిస్ రికార్డ్
Image Credit : Asianet News

37 సంఖ్య వెనుక గిన్నిస్ రికార్డ్

రాకా సినిమా బృందం విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో చేసిన కొత్త ప్రయోగానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి 37 మందిని ఒకేసారి రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఒకే సమయంలో అత్యధిక మందిని రియల్ టైమ్ మోషన్ క్యాప్చర్ చేసిన ఘనత రాకా బృందం సొంతం చేసుకుంది.

35
గత రికార్డును అధిగమించిన రాకా
Image Credit : Asianet News

గత రికార్డును అధిగమించిన రాకా

ఇంతకుముందు రియల్ టైమ్‌లో ఒకేసారి 19 మందిని మోషన్ క్యాప్చర్ చేసిన రికార్డ్ ఉండేది. ఇప్పుడు రాకా సినిమా బృందం 37 మందిని ఒకేసారి విజయవంతంగా క్యాప్చర్ చేయడం ద్వారా ఆ రికార్డును అధిగమించింది. దీంతో ఈ ప్రయోగం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. సినిమా కోసం ఉపయోగించిన ఈ సాంకేతిక ప్రయోగం రాకా ప్రాజెక్ట్‌లోని ప్రత్యేకతల్లో ఒకటిగా నిలిచింది.

ఈ చరిత్రాత్మక విజయానికి గుర్తుగా అల్లు అర్జున్, అట్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. భారతీయ సినిమాకు సంబంధించిన ఈ రికార్డ్ రాకా బృందం సాధించిన ప్రత్యేక ఘనతగా నిలిచింది. అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ రికార్డ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించడంతో ఇటీవల పోస్టర్‌లో కనిపించిన 37 సంఖ్యకు అసలు అర్థం ఏమిటనేది స్పష్టమైంది.

45
భారీ బడ్జెట్‌తో రాకా
Image Credit : Asianet News

భారీ బడ్జెట్‌తో రాకా

రాకా చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 800 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీపికా పదుకొణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

55
విజువల్ ఎఫెక్ట్స్‌లో కొత్త ప్రయోగం
Image Credit : Asianet News

విజువల్ ఎఫెక్ట్స్‌లో కొత్త ప్రయోగం

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా ఒకేసారి 37 మందిని రియల్ టైమ్‌లో క్యాప్చర్ చేయడం రాకా సినిమా బృందం చేసిన కొత్త ప్రయోగంగా నిలిచింది. గతంలో 19 మంది ఉన్న రికార్డును అధిగమిస్తూ 37 మందితో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో అల్లు అర్జున్ రాకా సినిమా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న చిత్రంగా నిలిచింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Amitabh Bachchan Net Worth: 90 కోట్ల అప్పు నుంచి 4 వేల కోట్ల ఆస్తి వరకు బిగ్ బీ జర్నీ
Recommended image2
Allu Arjun: ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు ముగ్గురి వల్లా కాలేదు..భార్య సాయం తీసుకుని చించిపడేసిన అల్లు అర్జున్
Recommended image3
Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్
Related Stories
Recommended image1
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved