MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్

Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్

బిగ్ బాస్ తెలుగు 10లో నామినేషన్స్ ప్రారంభం అయ్యాయి. నామినేషన్స్ లో భాగంగా సృష్టి, సుధీర్ మధ్య జరిగిన గొడవ చాలా వైల్డ్ గా ఉంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 21 2026, 11:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg Boss Telugu 10
Image Credit : Asianet News

Bigg Boss Telugu 10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 15వ రోజు సోమవారం నామినేషన్స్ ప్రాసెస్ మొదలైంది. ఈ నామినేషన్స్ ని బిగ్ బాస్ చాలా వైవిధ్యంగా ప్లాన్ చేశారు. నామినేషన్స్ లో సుధీర్, సృష్టి మధ్య రణరంగం మొదలైంది. కోపాలు, తీవ్రమైన భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఝాన్సీ ఇమ్యూనిటీ తొలగించిన ముకేశ్
Image Credit : Asianet News

ఝాన్సీ ఇమ్యూనిటీ తొలగించిన ముకేశ్

ఇతర ఇంటి సభ్యుల ఓట్ల వల్ల ముఖేష్ స్టార్ ఆఫ్ ది వీక్ అయిన సంగతి తెలిసిందే. దీనితో బిగ్ బాస్ ముకేశ్ కి ప్రత్యేకమైన పవర్స్ ఇచ్చారు. తన పవర్ ఉపయోగించి కెప్టెన్ ఝాన్సీని కెప్టెన్సీ నుంచి తొలగించవచ్చు లేదా ఆమెని ఇమ్యూనిటీని తొలగించవచ్చు అని బిగ్ బాస్ తెలిపారు. దీనితో ముకేశ్ ఆమె ఇమ్యూనిటీ తొలగించే ఆప్షన్ ఎంచుకున్నారు. ఝాన్సీ ఇమ్యూనిటీని ముఖేష్ తొలగించారు. దీనితో ఝాన్సీ ని కూడా ఎవరైనా నామినేట్ చేయవచ్చు. ఆ ఇమ్యూనిటీ ముకేశ్ కి లభిస్తుంది.

35
వంశీని నామినేట్ చేసిన రామ్ ప్రసాద్
Image Credit : Asianet News

వంశీని నామినేట్ చేసిన రామ్ ప్రసాద్

నామినేషన్స్ లో భాగంగా ఇద్దరు వెళ్లి 2 ఎన్వలప్ కవర్స్ తీసుకోవాలి. ఒకరు మాత్రమే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వాళ్ళు ఒకరిని లేదా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం పొందుతారు. ముందుగా రామ్ ప్రసాద్.. వంశీని నామినేట్ చేశారు. ఫుడ్ విషయంలో వంశీ ప్రతిసారీ ఇంటి సభ్యులపై అరవడం నచ్చలేదని రాంప్రసాద్ తెలిపారు. ఈ విషయంలో వర్షిణి, వంశీ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది.

45
వర్షిణి ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు
Image Credit : Asianet News

వర్షిణి ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు

ఆ తర్వాత రోహిత్.. సుధీర్ ని నామినేట్ చేశాడు. సుధీర్ కి సొంత అభిప్రాయాలు లేవు. వర్షిణి ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. ఆమె చేతిలో కీలు బొమ్మ అవుతున్నాడు అంటూ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యలో సృష్టి గురించి ప్రస్తావన వచ్చింది. సుధీర్.. సృష్టి తో లవ్ ట్రాక్ నడపాలని గతంలో ప్రయత్నించినట్లు త్రిగుణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆమెతో కేవలం ఫ్రెండ్ షిప్ చేయడానికి ప్రయత్నించానని సుధీర్ తెలిపాడు. నువ్వు అస్సలు నా టైపు కాదు. నీతో కనీసం నాకు ఫ్రెండ్ షిప్ కూడా లేదు అని సృష్టి చెప్పింది. దీనితో సుధీర్ గట్టిగా కేకలు వేస్తూ నాకు ఫ్రీడమ్ వచ్చింది అని ఎగురుతూ చెప్పాడు. సుధీర్ అలా బిహేవ్ చేయడంతో సృష్టి కోపం కట్టలు తెంచుకుంది.

55
గుద్దితే మూతి పళ్ళు రాలిపోతాయ్
Image Credit : Asianet News

గుద్దితే మూతి పళ్ళు రాలిపోతాయ్

నీకు ఫ్రీడమ్ రావడం ఏంటి, నేను ఏమైనా నిన్ను పట్టుకుని కుర్చున్నానా.. విపరీతమైన అర్థాలు వచ్చేలా కామెంట్ చేస్తే గుద్దుతా. గుద్దితే మూతి పళ్ళు రాలిపోతాయి అంటూ సృష్టి అతడి మీదికి దూకింది. ఇతర సభ్యులు ఆమెని అడ్డుకున్నారు. దీనితో షాలిని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: రాజశేఖర్‌లాగా నేను కూడా యాక్ట్ చేయలేను.. చిరంజీవి ఓపెన్‌ స్టేట్‌మెంట్‌.. ఎప్పుడంటే?
Recommended image2
Babu Mohan: పాన్‌లో విషం కలిపి బాబు మోహన్‌ను చంపాలనుకున్నది ఎవరు? సంచలన విషయాలు వెల్లడించిన స్టార్ నటుడు
Recommended image3
Comrade Kalyan 4 Days Collections: సోమవారం పడిపోయిన శ్రీవిష్ణు మూవీ.. కామ్రేడ్‌ కళ్యాణ్‌కి టోటల్‌ కలెక్షన్లు
Related Stories
Recommended image1
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image2
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved