అఫీషియల్..హనుమాన్ విలన్ తో 42 టాలీవుడ్ హీరోయిన్ లవ్ ఎఫైర్, లివ్ ఇన్ రిలేషన్
భారత సంతతికి చెందిన ఎన్నారై బ్యూటీ విమల రామన్. విమల రామన్ తెలుగులో గాయం 2, రంగ ది దొంగ లాంటి చిత్రాల్లో నటించింది. విమల రామన్ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు.

భారత సంతతికి చెందిన ఎన్నారై బ్యూటీ విమల రామన్. విమల రామన్ తెలుగులో గాయం 2, రంగ ది దొంగ లాంటి చిత్రాల్లో నటించింది. విమల రామన్ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు.విమల రామన్ పుట్టి పెరిగింది అంతా ఆస్ట్రేలియాలోనే.
మోడలింగ్ ప్రారంభించాక అవకాశాలు వెతుక్కుంటూ ఇండియాకు వచ్చింది. గాయం 2 లాంటి చిత్రాలు ఆమెకి గుర్తింపు తీసుకువచ్చాయి. ఆమె ఎక్కువగా నటించింది టాలీవుడ్ చిత్రాల్లోనే.
అయితే విమలారామన్ క్రేజీ హీరోయిన్ కాలేకపోయింది. ప్రస్తుతం విమలారామన్ వయసు 42 ఏళ్ళు. ఇంతవరకు విమలారామన్ పెళ్లి ఊసే ఎత్తలేదు. నాలుగు పదుల వయసు దాటాక ఆమెకి ఒక తోడు కావాలని గుర్తుకు వచ్చినట్లు ఉంది.
గత కొంతకాలంగా ఆమె పర్సనల్ లైఫ్ గురించి వార్తలు వస్తున్నాయి. హనుమాన్ విలన్ వినయ్ రాయ్ తో ఆమె ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతూ వచ్చింది. వినయ్ రాయ్ హను మాన్ చిత్రంలో విలన్ గా అదరగొట్టాడు.
తాజాగా వినయ్ రాయ్ తో విమలారామన్ రొమాంటిక్ ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటో షూట్ లో వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఇంటిమేట్ గా ఉన్నారు. ఆ ఫోటోలని విమలారామన్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీనితో ఆమె తన ప్రేమని అఫీషియల్ గా ప్రకటించినట్లే అని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం విమలారామన్, వినయ్ రాయ్ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
మోడరన్ డ్రెస్ లో విమలారామన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. తన ప్రియుడితో రొమాంటిక్ వే లో ఈ ఫోటో షూట్ లో ఆమె పాల్గొంది. కొన్ని ఫొటోల్లో వినయ్ రాయ్ విమలారామన్ పాదాలని సైతం తాకుతున్నారు.