MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • VenkyAnil 5: వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ అదిరిపోయిందిగా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

VenkyAnil 5: వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి మూవీ టైటిల్ అదిరిపోయిందిగా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

January 12 Vidudala: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాకు జనవరి 12 విడుదల అనే టైటిల్ ఖరారైంది. 2027 జనవరి 12న సినిమా విడుదల కానుంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 19 2026, 07:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ కాంబో
Image Credit : Asianet News

వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ కాంబో

అనిల్ రావిపూడి ఏం చేసినా ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంటారు. ఆయన సినిమాల టైటిల్స్ విషయంలోనూ ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప్రకటించినప్పుడు కొందరు విమర్శలు, సెటైర్లు చేసినప్పటికీ, ఆ సినిమా విడుదలైన తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ప్రాంతీయ సినిమా పరిశ్రమలో పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాకు కూడా ఆసక్తికరమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. దానికి అనుగుణంగానే సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జనవరి 12 విడుదల
Image Credit : Asianet News

జనవరి 12 విడుదల

టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన వీడియో కూడా సరదాగా సాగింది. ఇందులో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కనిపించారు. జనవరి 12 విడుదల అనే మాట విన్న కీర్తి సురేష్, కృతి శెట్టి అది సినిమా టైటిల్ అనుకోవాలా, లేక విడుదల తేదీ అనుకోవాలా అన్న అయోమయంలో పడతారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి అసలు విషయాన్ని వివరిస్తారు. సినిమా పేరు కూడా జనవరి 12 విడుదలేనని, విడుదల తేదీ కూడా జనవరి 12నే అని చెబుతారు. ఈ సందర్భంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఓ పాత సినిమాలోని క్లిప్‌ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన వీడియోలోని కామెడీ, హీరోలతో పాటు హీరోయిన్లను కూడా భాగం చేయడం ఆసక్తికరంగా మారింది.

Related Articles

Related image1
Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్
Related image2
Shivashankar: మన్మథ రాసా నుంచి ధీర ధీర వరకు.. శివ శంకర్ మాస్టర్ టాప్ 5 సాంగ్స్, ఒక్క దానికి నేషనల్ అవార్డు
35
ట్యాగ్ లైన్ కూడా అదిరింది
Image Credit : Asianet News

ట్యాగ్ లైన్ కూడా అదిరింది

ఈ సినిమాకు బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఖరారు చేశారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయిక నేపథ్యంలో ఈ ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు జనవరి 12 విడుదలతో అనిల్ రావిపూడి ఎలాంటి కథను చెప్పబోతున్నారు, బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్ వెనుక ఉన్న అసలు భావం ఏమిటనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వెంకటేష్ టైమింగ్, కల్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలవడంతో సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది.

45
మరోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా
Image Credit : Asianet News

మరోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా

ఈ భారీ చిత్రాన్ని షైన్ స్క్రీన్ కి చెందిన సాహు గారపాటి, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే చిత్ర కథకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. టైటిల్ ప్రకటనతో సినిమా ఏ తరహాలో ఉండబోతుందనే ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌కు అనిల్ రావిపూడి మరోసారి తన సినిమాను తీసుకురావడం గమనార్హం.

55
ఒకే దెబ్బకు 2 పిట్టలు
Image Credit : Asianet News

ఒకే దెబ్బకు 2 పిట్టలు

మొత్తంగా చూస్తే జనవరి 12 విడుదల అనే టైటిల్‌తోనే ఈ సినిమా ప్రమోషన్ ఆసక్తికరంగా మొదలైంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా టైటిల్ ఉంది. సినిమా టైటిల్ క్రేజీగా ఉండడంతో పాటు దానిలోనే రిలీజ్ డేట్ కూడా వచ్చేలా పబ్లిసిటీ లభించేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేసిన విధానం అదుర్స్. ఇటీవల అనిల్ రావిపూడి సినిమాలన్నీ సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. అదే తరహాలో టైటిల్స్ కూడా ఉంటున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు.. సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. నెక్స్ట్ సంక్రాంతికి జనవరి 12 విడుదల చిత్రం రాబోతోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Recommended image2
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Recommended image3
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్
Related Stories
Recommended image1
Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్
Recommended image2
Shivashankar: మన్మథ రాసా నుంచి ధీర ధీర వరకు.. శివ శంకర్ మాస్టర్ టాప్ 5 సాంగ్స్, ఒక్క దానికి నేషనల్ అవార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved