MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shivashankar: మన్మథ రాసా నుంచి ధీర ధీర వరకు.. శివ శంకర్ మాస్టర్ టాప్ 5 సాంగ్స్, ఒక్క దానికి నేషనల్ అవార్డు

Shivashankar: మన్మథ రాసా నుంచి ధీర ధీర వరకు.. శివ శంకర్ మాస్టర్ టాప్ 5 సాంగ్స్, ఒక్క దానికి నేషనల్ అవార్డు

శివ శంకర్ మాస్టర్ వందల పాటలకు కొరియోగ్రఫీ అందించారు. డ్యాన్స్ కొరియోగ్రఫీలో ఆయన లెజెండ్. 1975 లోనే శివ శంకర్ మాస్టర్ కెరీర్ ప్రారంభించారు. ఆయన కొరియోగ్రఫీ అందించిన టాప్ 5 బెస్ట్ సాంగ్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 19 2026, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Shiva Shankar Master
Image Credit : Asianet News

Shiva Shankar Master

సౌత్ లో లెజెండ్రీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లో శివ శంకర్ మాస్టర్ ఒకరు. భరత నాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్ డ్యాన్స్ తో ఆయనకి అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. సినిమాల్లో ఎక్కువగా ఆయన క్లాసికల్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించారు. ఎన్నో వందల పాటలకు కొరియోగ్రఫీ అందించిన శివ శంకర్ మాస్టర్ ఓ సాంగ్ కి జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కెరీర్ లో టాప్ 5 బెస్ట్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రగులుతోంది మొగలి పొద
Image Credit : Asianet News

రగులుతోంది మొగలి పొద

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ చిత్రంలోని ఈ ఐకానిక్ సాంగ్. చిరంజీవి, మాధవి చేత శివ శంకర్ మాస్టర్ అద్భుతంగా నాగిని డ్యాన్స్ చేయించారు. అప్పట్లో ఈ సాంగ్ ఒక సంచలనం. శివ శంకర్ మాస్టర్ రూపొందించిన స్టెప్పులు.. చిరు, మాధవి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయితాయి. ఖైదీ చిత్రం చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే.

36
భూం భూం భుజంగం దీత్తై తరంగం
Image Credit : Asianet News

భూం భూం భుజంగం దీత్తై తరంగం

అనుష్క శెట్టి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో అరుంధతి ఒకటి. ఈ సినిమా అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తీసుకువచ్చింది. ఈ మూవీలో భూం భూం భుజంగం దీత్తై తరంగం అనే పవర్ ఫుల్ ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. ఒక ప్రత్యేక సందర్భంలో ఈ పాట వస్తుంది. కథానాయిక అయిన అనుష్క, విలన్ సోనూసూద్ మధ్య ఒక సన్నివేశంలాగా సాగే పాట ఇది. ఈ పాటలో డ్యాన్స్ తో పాటు నటన కూడా చాలా కీలకం. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ శివ శంకర్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు.

46
మన్మథ రాసా
Image Credit : Asianet News

మన్మథ రాసా

2003లో విడుదలైన తిరుడా తిరుడి చిత్రంలోది ఈ సాంగ్. మన్మథ రాసా సాంగ్ అప్పట్లో యువతని, మాస్ ఆడియన్స్ ని ఊపు ఊపేసింది. ఈ చిత్రంలో ధనుష్, ఛాయా సింగ్ జంటగా నటించారు. తన కెరీర్ కి గుర్తింపు తీసుకువచ్చిన ఈ పాటని, శివ శంకర్ మాస్టర్ అని ఆమె అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. ఓసారి తన బర్త్ డే రోజున ఛాయా సింగ్ మన్మథ రాసా సాంగ్ కి శివశంకర్ మాస్టర్ తో సరదాగా డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో దొంగ దొంగది అనే టైటిల్ తో రీమేక్ చేశారు. తెలుగులో మంచు మనోజ్, సదా జంటగా నటించారు. తెలుగులో కూడా ఈ సాంగ్ కి శివ శంకర్ మాస్టరే కొరియోగ్రఫీ అందించారు.

View this post on Instagram

A post shared by Chaya Singh (@chayasingh_16)

56
అమ్మోరు తల్లి
Image Credit : Asianet News

అమ్మోరు తల్లి

సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన అమ్మోరు మూవీ అప్పట్లో ఒక విజువల్ వండర్. ఈ మూవీలో అమ్మోరు తల్లి అంటూ సొంగ్ డివోషనల్ సాంగ్ కి శివ శంకర్ మాస్టర్ చక్కటి కొరియోగ్రఫీ అందించారు.

66
ధీర ధీర
Image Credit : Asianet News

ధీర ధీర

రాజమౌళి, రాంచరణ్ కాంబోలో తెరకెక్కిన దృశ్య కావ్యం మగధీర. ఈ మూవీలో ధీర ధీర అనే సాంగ్ ఎంతో స్పెషల్. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఈ సాంగ్ ని శివ శంకర్ మాస్టర్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా విధంగా కొరియోగ్రఫీ చేశారు. వాళ్లిద్దరో కాస్ట్యూమ్స్ చూపుతిప్పుకోలేని డ్యాన్స్ స్టెప్పులు, భంగిమలు, రాజమౌళి విజువలైజేషన్ అత్యంత అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే ఈ సాంగ్ కి ఏకంగా శివ శంకర్ మాస్టర్ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Related Stories
Recommended image1
Bandla Ganesh: ప్రాణ స్నేహితుడు, భక్తుడు ఇద్దరూ కలిసిపోయారు..పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీ
Recommended image2
Rajasekhar: చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved