MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • 13 ఏళ్లకే హీరోయిన్, రజినీ, చిరంజీవిలకు చుక్కలు చూపించిన ఈ 53 ఏళ్ల నటి ఎవరో గుర్తు పట్టారా?

13 ఏళ్లకే హీరోయిన్, రజినీ, చిరంజీవిలకు చుక్కలు చూపించిన ఈ 53 ఏళ్ల నటి ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫోటోలో బ్లాక్ ఫ్రాక్ లో వెనుక నిల్చొని ఉన్న అమ్మాయి సిల్వర్ స్క్రీన్ ని ఏలుతుంది. ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. రజినీకాంత్, చిరంజీవి వంటి స్టార్స్ ని కూడా ముప్పుతిప్పలు పెట్టింది. ఆమె ఎవరో గుర్తు పట్టారా? 

2 Min read
Author : Sambi Reddy
Published : May 16 2024, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పైన మీరు ఫోటోలో చూసిన పాప ఎవరో కాదు నటి రమ్యకృష్ణ. 1970 సెప్టెంబర్ 15న చెన్నైలో పుట్టిన రమ్యకృష్ణ ఇండియన్ సినిమాను ఏలింది. చిన్నప్పటి నుండే హీరోయిన్ కావాలనే కలలతో పెరిగిన రమ్యకృష్ణ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. నటనలో శిక్షణ తీసుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

1983లో విడుదలైన వెళ్లై మనసు అనే తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగులో ఆమె డెబ్యూ మూవీ కంచు కాగడ. తమిళ అమ్మాయి అయినప్పటికి తెలుగువారే రమ్యకృష్ణను ఎక్కువగా ఆదరించారు. 

 

38

కెరీర్ బిగినింగ్ లో రమ్యకృష్ణకు వరుస పరాజయాలతో ఎదురయ్యాయి. దర్శకుడు కే విశ్వనాథ్ తెరకెక్కించిన సూత్రధారులు చిత్రంతో బ్రేక్ వచ్చింది. ఆ మూవీలో రమ్యకృష్ణ నటన, డాన్సులు ఆకట్టుకున్నాయి. అద్భుతమైన సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. 

48

రమ్యకృష్ణను కమర్షియల్ హీరోగా మార్చిన ఘనత దర్శకుడు కే రాఘవేంద్రరావు దక్కుతుంది. ఆయన వరుస చిత్రాల్లో ఆమెకు ఆఫర్స్ ఇచ్చాడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ నటించిన అల్లుడుగారు, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. 


 

58

ఇక రమ్యకృష్ణ కెరీర్లో పడయప్ప ఎవర్ గ్రీన్ మూవీగా ఉంది. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ లో రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ చేసింది. తెలుగులో నరసింహ టైటిల్ తో విడుదల చేయగా... ఇక్కడ కూడా భారీ విజయం సాధించింది. నీలాంబరి పాత్రలో రజినీకాంత్ ని కూడా ఆమె డామినేట్ చేసింది. 

68

చిరంజీవితో అనేక సినిమాలు చేసిన రమ్యకృష్ణ అల్లుడా మజాకా లో పొగరుబట్టిన అమ్మాయి పాత్ర చేసింది. రమ్యకృష్ణ, రంభలతో చిరంజీవి ఆధిపత్య పోరు బాగుంటుంది. పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన రమ్యకృష్ణ, డివోషనల్ పాత్రలు కూడా చేసింది. కమల్ హాసన్ నటించిన పంచతంత్రం మూవీలో రమ్యకృష్ణ వేశ్య రోల్ చేయడం విశేషం. 

78


ఇక బాహుబలి చిత్రాల్లో శివగామిగా రాజసం పలికించింది. ఆ పాత్రకు మరొకరు న్యాయం చేయలేరు అన్నరీతిలో రమ్యకృష్ణ నటన సాగింది. నాలుగు దశాబ్దాలుగా రమ్యకృష్ణ తిరుగులేని నటిగా కొనసాగుతుంది. ఇప్పటికీ ఆమె చేతినిండా ఆఫర్స్ ఉన్నాయి. 
 

88


ఇక బాహుబలి చిత్రాల్లో శివగామిగా రాజసం పలికించింది. ఆ పాత్రకు మరొకరు న్యాయం చేయలేరు అన్నరీతిలో రమ్యకృష్ణ నటన సాగింది. నాలుగు దశాబ్దాలుగా రమ్యకృష్ణ తిరుగులేని నటిగా కొనసాగుతుంది. ఇప్పటికీ ఆమె చేతినిండా ఆఫర్స్ ఉన్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image2
Mohan Babu: నన్ను అంత మాట అంటావా... సీనియర్ నటుడిని అవమానించిన మోహన్ బాబు, ట్విస్ట్ ఏంటంటే?
Recommended image3
Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved