MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే

Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే

Top 10 Heroes: ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోనే టాప్‌ 10 హీరోల జాబితాని విడుదల చేస్తుంది. తాజాగా ఆగస్ట్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాని విడుదల చేసింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 22 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్
Image Credit : IBTimes

ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్

ఆగస్ట్ నెలలో ఇండియాలోనే మోస్ట్ పాపులర్‌ హీరోలకు సంబంధించిన జాబితా వచ్చింది. ఓర్మాక్స్ మీడియా ఎప్పటిలాగే లిస్ట్ ని రిలీజ్‌ చేసింది. ఇందులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు ఎన్టీఆర్‌ లిస్ట్ లోనే లేడు. అలాగే రామ్‌ చరణ్‌ దారుణంగా పడిపోయాడు. మహేష్‌ బాబు తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. అలాగే అల్లు అర్జున్‌ కూడా డౌన్‌ అయ్యాడు. మరి టాప్ లో ఉన్నదెవరు, షారూఖ్‌ ఖాన్‌, విజయ్‌ స్థానాలేంటి అనేది చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నెంబర్‌ 1 ప్రభాస్‌
Image Credit : youtube/@PeopleMediaFactory

నెంబర్‌ 1 ప్రభాస్‌

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఆగస్ట్ టాప్ హీరోల జాబితాలో ప్రభాస్‌ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన్ని కొట్టేవాళ్లే లేరని చెప్పొచ్చు. ఎప్పటిలాగే ఆయన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఇక రెండో స్థానంలో బాలీవుడ్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ నిలవగా, మూడోస్థానంలోకి తమిళనాడు సీఎం, దళపతి విజయ్‌ వచ్చారు. అంతకు ముందు నెలలో విజయ్‌ రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఒక స్థానం పడిపోయారు.

36
ఒక్క స్థానం పడిపోయిన అల్లు అర్జున్‌
Image Credit : Asianet News

ఒక్క స్థానం పడిపోయిన అల్లు అర్జున్‌

జులైలో మూడో స్థానంలో ఉన్న అల్లు అర్జున్‌ ఒక స్థానం పడిపోయారు. ఆగస్ట్ లో ఆయన నాల్గో స్థానానికి పడిపోయారు. బన్నీ కూడా రెండు, మూడు, నాల్గో స్థానాల్లో రెగ్యూలర్‌గా మారుతున్నారు. బన్నీ ప్రస్తుతం `రాకా`లో నటిస్తున్న విషయం తెలిసిందే.

46
మహేష్‌ స్థానం పదిలం
Image Credit : youtube/@ColliderInterviews

మహేష్‌ స్థానం పదిలం

ఐదో స్థానంలో మహేష్‌ బాబు ఉన్నారు. మహేష్‌ గత కొంత కాలంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. మహేష్‌ `వారణాసి` మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆరో స్థానంలోకి సూర్య దూసుకొచ్చారు. `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` చిత్రంతో ఆయన టాప్‌లోకి రావడం విశేషం. గత నెలతో పోల్చితే సూర్య పుంజుకున్నారు. తన స్థానాన్ని పెంచుకున్నారు. జులైలో సూర్య ఏడో స్థానంలో ఉన్నారు.

56
ఫస్ట్ టైమ్‌ లిస్ట్ లోకి వచ్చిన యష్‌
Image Credit : instagram/@thenameisyash

ఫస్ట్ టైమ్‌ లిస్ట్ లోకి వచ్చిన యష్‌

అదే సమయంలో అసలు ఎప్పుడూ లిస్ట్ లో లేని యష్‌ ఈ సారి లిస్ట్ లోకి రావడం విశేషం. అదే సమయంలో ఆయన ఏడో స్థానంలోకి రావడం మరో విశేషం. `టాక్సిక్‌`, `రామాయణ్‌` చిత్రాల ప్రభావంతో యష్‌ టాప్‌లోకి వచ్చారని చెప్పొచ్చు. ఇక ఎనిమిదో స్థానంలో సల్మాన్‌ ఖాన్‌ ఉన్నారు. ఆయన స్థానంలో పెద్దగా మార్పులేదు.

66
తొమ్మిదో స్థానానికి పడిపోయిన రామ్‌ చరణ్‌
Image Credit : Asianet News

తొమ్మిదో స్థానానికి పడిపోయిన రామ్‌ చరణ్‌

తొమ్మిదో స్థానంలోకి రామ్‌ చరణ్‌ పడిపోయారు. అంతకు ముందు ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న రామ్‌ చరణ్‌ ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇక పదో స్థానంలో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఉన్నారు. అక్షయ్‌ కుమార్‌, అజిత్‌, ఎన్టీఆర్‌లు లిస్ట్ లోనేతమ స్థానాలను కోల్పోవడం గమనార్హం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
అల్లు అర్జున్
మహేష్ బాబు ఘట్టమనేని
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
టీవీకే విజయ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?
Recommended image2
కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్
Recommended image3
Ranabaali: రియల్‌ కపుల్‌ రొమాన్స్ అదిరిపోయేలా ఏందయ్య సామీ.. రణబాలి మూవీ ఫస్ట్ సాంగ్‌ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Srikanth Daughter: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image2
Ranabaali: రియల్‌ కపుల్‌ రొమాన్స్ అదిరిపోయేలా ఏందయ్య సామీ.. రణబాలి మూవీ ఫస్ట్ సాంగ్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved