MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?

Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?

Trigun: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 10 లో కాంట్రవర్సియల్ కంటెస్టెంట్ గా త్రిగుణ్ అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. రీసెంట్ గానే ఓ ఇంటివాడు అయిన త్రిగుణ్.. సీక్రెట్ గా ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అతని భార్య నివేదిత ఎవరు? ఏం చేస్తుందో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 22 2026, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ తెలుగు 10 లో త్రిగుణ్
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు 10 లో త్రిగుణ్

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్ (ఆదిత్ అరుణ్).. హీరోగా స్టార్ డమ్ సాధించడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ చిన్న చిన్న సినిమాలకే పరిమితం కావాల్సి వచ్చింది. చివరకు ఇండస్ట్రీలో సక్సెస్ కోసం బిగ్ బాస్ గుమ్మం తొక్కాడు త్రిగుణ్. బిగ్ బాస్ లో త్రిగుణ్ దూసుకుపొతున్నాడు. కాస్త నెగెటీవ్ ఇమేజ్ సాధించినా.. నామినేషన్స్ లో అందరికి ఇచ్చిపడేస్తూ.. ప్రతీ విషయంలో క్లియర్ గా తన వెర్షన్ ను మాట్లాడుతున్నాడు. దాంతో ఒకరిద్దరు తప్పించి.. హౌస్ లో అందరికి ఎనిమీగా మారిపోయాడు త్రిగుణ్. ఇక ఈ హీరో ఈమధ్య కాలంలోనే పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆయన పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
త్రిగుణ్ ఎందుకు రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు..
Image Credit : Asianet News

త్రిగుణ్ ఎందుకు రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు..

త్రిగుణ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, సీక్రెట్ మ్యారేజ్ వెనుక కారణాలు ఏంటీ అనే ప్రశ్నలు వైరల్ అయ్యాయి. ఈ అంశంపై ఈ మధ్య కాలంలోనే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో త్రిగుణ్ స్పందించాడు. తన వివాహం సీక్రెట్‌గా ఎందుకు జరిగిందో, దానికి గల కారణాలేంటో క్లారిటీ ఇచ్చాడు. త్రిగుణ్ వివరణ ప్రకారం, ఆయన పెళ్లి సీక్రెట్‌గా చేసుకోవాలని అనుకోలేదు. నిజానికి సంగీత్, రిసెప్షన్, మ్యూజిక్ బ్యాండ్ సహా వివాహ వేడుకలను ఎంతో ఆర్భాటంగా నిర్వహించాలని భావించారు. అందుకోసం కళ్యాణ మంటపానికి, ఇతర ఏర్పాట్లకు ముందస్తుగా అడ్వాన్స్ చెక్కులు కూడా ఇచ్చేశారు. పెళ్లి పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ఒక విషాదకర సంఘటన వారి కుటుంబంలో చోటుచేసుకుంది.

34
హఠాత్తుగా తల్లి కన్నుమూత
Image Credit : Asianet News

హఠాత్తుగా తల్లి కన్నుమూత

పెళ్లికి కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉందనగా త్రిగుణ్ తల్లి హఠాత్తుగా కన్నుమూశారు. తల్లి మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. త్రిగుణ్ ఇంట్లో ఒక్కగానొక్క కొడుకు కావడం, అతనిపెళ్లి చూడడమే ఆమె జీవితంలో అతిపెద్ద కోరికగా ఉండేది. కొడుకుగా ఆమెకు కారు, ఇల్లు, కుక్కపిల్లలను కొనిచ్చినా, తన పెళ్లి కంటే ఎక్కువ సంతోషాన్ని అవి ఇవ్వలేకపోయాయని త్రిగుణ్ ఎమోషనల్ అయ్యారు. ఆ సంతోషాన్ని తల్లి చూడలేకపోయిందనే బాధ వారిని తీవ్రంగా కలచివేసింది.

44
సింపుల్ గా పెళ్లి చేసుకున్న త్రిగుణ్..
Image Credit : Asianet News

సింపుల్ గా పెళ్లి చేసుకున్న త్రిగుణ్..

తల్లి మరణించిన కొద్దికాలానికే అంత ఆర్భాటంగా పెళ్లి చేసుకోవడం సరైన సమయం కాదని ఆయన భావించారు. అయితే, ఇంట్లో త్వరగా ఒక శుభకార్యం జరగడం మంచిదని తండ్రితో పాటు కుటుంబ సభ్యులు సూచించారు. గ్రాండ్ గా చేయాల్సిన వేడుకలను రద్దు చేసుకుని, బంధువులు, సన్నిహితులను కూడా పిలవకుండా అత్యంత నిరాడంబరంగా పెళ్లి పూర్తి చేశారు. ఇదే విషయంపై కొండా మురళి వంటి రాజకీయ ప్రముఖులు కూడా ఎందుకు పిలవలేదని అడిగినప్పుడు, తల్లి మరణించిన విషయాన్ని తెలిపానని త్రిగుణ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

భార్య నివేదిత ఏం చేస్తుంది? ఎలా పరిచయం

తన భార్య నివేదిత ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారని, ఆమె తమ బంధువుల అమ్మాయేనని త్రిగుణ్ తెలిపారు. ఇల్లు నిర్మించే క్రమంలో సహాయం చేయడానికి వచ్చిన నివేదితను ఆయన తల్లి పరిచయం చేశారని, ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారితీసిందని వివరించారు. ఈ విధంగా, తన వివాహం సీక్రెట్‌గా జరగడానికి కారణం ఏ విధమైన రహస్యాలు కాదని, కేవలం తల్లి మరణం వల్ల ఏర్పడిన విషాద పరిస్థితులేనని త్రిగుణ్ స్పష్టం చేశారు

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Neha Sharma: చిరుత హీరోయిన్ నేహా శర్మ గ్లామరస్ ఫొటోలు..పింక్ డ్రెస్ లో స్టన్నింగ్ షో
Recommended image2
Ram Charan - Sukumar: రామ్ చరణ్ RC17 కోసం సుకుమార్ టీమ్ రెడీ.. హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్ ప్రారంభం
Recommended image3
Yash Ramayana Look: 'రామాయణం'లో యశ్ రావణుడి గెటప్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్.. ఏం మారలేదు అంటూ..
Related Stories
Recommended image1
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Recommended image2
Rajeev Kanakala: అల్లు అర్జున్ మాట లెక్క చేయకుండా.. భారీగా నష్టపోయిన రాజీవ్ కనకాల, బన్ని ఏం చెప్పాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved