ఎట్టకేలకు ప్రదీప్ పెళ్లిపై క్లారిటీ.. అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?
బ్రేకింగ్ న్యూస్.. యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో పెళ్లి చేసకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత..?

టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా దూసుకుపోతున్నాడు ప్రదీప్ మాచిరాజు. యాంకర్స్ గ్రూప్ లో సుమ తరువాత అంతటి స్టార్ డమ్ ఉన్న యాంకర్ గాప్రదీప్ పేరు తెచ్చుకున్నాడు. మెయిల్ యాంకర్స్ లో ఎంతో మంది ఉన్నా.. ప్రదీప్ ఎప్పటికీ టాప్ లోనే ఉన్నాడు. ఎంతో మంది యాంకరింగ్ లోకి వచ్చి వెళ్లిపోయారు కూడా. కాని ప్రదీప్ చాలా ఏళ్లుగా ఇందులో పాతుకుని ఉన్నాడు.
ఇక ప్రదీప్ లో మరో ప్రత్యేకత ఏంటంటే.. మోస్ట్ ఎలిజిబుల్ స్టార్స్ లో ఆయన కూడా ఒకరు. ప్రదీప్ పెళ్ళి ఎప్పుడూ అన్న విషయంలో ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ కూడా పెట్టారంటే.. ప్రదీప్ పెళ్లి గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుస్తుంది. అంతే కాదు.. అమ్మాయిల్లో ప్రదీప్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని ట్యాగ్ వేయించుకున్నవారిలో ప్రభాస్ తరువాత మన ప్రదీప్ కూడా అంతే పాపులారిటీ దక్కించుకున్నాడు.
బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ముందున్నాడు మాచిరాజు ప్రదీప్. యాంకర్ గా మనోడు స్టార్. ప్రదీప్ వేసే పంచులకు పగలబడి నవ్వడంతో పాటు.. అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యి.. పడిపోతుంటారు కూడా. ఈక్రమంలో అతనికి ప్రపోజ్ చేసిన అమ్మాయిలెందరో.. కాని మనోడి పెళ్లి.. ప్రేమ గురించి మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.
గతంలో ప్రదీప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మొదలైంది. అతడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని వినిపిస్తోంది. ప్రదీప్-నవ్య చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు వీరి బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని భావించారని చెప్పుకుంటున్నారు.
ప్రదీప్ పెళ్లి గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. కాని అవేవి నిజం కాలేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి. కాని మనోడు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడు.. ? అసలు చేసుకుంటాడా..? లేదా అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. కాగా ప్రదీప్ పెళ్లికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ లో షేర్వానీ వేసుకొని చాలా పద్ధతిగా చాలా అట్రాక్టివ్ గా కనిపించాడు ప్రదీప్.
దాంతో మరోసారి ఆయన పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. కాని ఈ గెటప్ మాత్రం ఆయన కొత్త ప్రోగ్రామ్ కు సబంధించినది అని తెలుస్తోంది. మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే ఈవెంట్ కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో పిక్ ఇది అని తెలుస్తోంది. ఇక ప్రదీప్ తన చిన్నాటి ఫ్రెండ్ ను ప్రేమిస్తున్నాడట. ఆమెనే పెళ్ళాడతాడట. కాని అందుకు కొన్ని అడ్డంకులు ఉన్నట్టు సమాచారం.
ఒక వేళ అమ్మాయితో పెళ్లి జరగకపోతే.. మనోడు లైఫ్ టైమ్ బ్యాచిలర్ గా ఉండటానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రంప్రదీప్ పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే 38 ఏళ్ల ప్రదీప్.. మరో రెండేళ్లలో.. 40 లోకి అడుగు పెట్టబోతున్నాడు. మరి ఈలోపు పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.