MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • The Odyssey 3 Days Collections: ఇండియాలో దుమ్ములేపుతున్న ఒడిస్సీ.. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎంత రాబట్టిందంటే?

The Odyssey 3 Days Collections: ఇండియాలో దుమ్ములేపుతున్న ఒడిస్సీ.. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎంత రాబట్టిందంటే?

The Odyssey 3 Days Collections: క్రిస్టోఫర్‌ నోలన్‌ రూపొందించిన `ది ఒడిస్సీ` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఇండియాలో షాకింగ్‌ వసూళ్లు రాబట్టింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 20 2026, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపుతోన్న ఒడిస్సీ మూవీ
Image Credit : X/@odysseymovie

ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపుతోన్న ఒడిస్సీ మూవీ

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క సినిమా గురించి డిస్కషన్‌ నడుస్తోంది. అదే `ది ఒడిస్సీ`. ది గ్రేడ్‌ హాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలన్‌ రూపొందించిన చిత్రమిది. ఇందులో హాలీవుడ్‌ స్టార్స్ మ్యాట్‌ డేమాన్‌, టామ్‌ హోలాండ్‌, అన్నే హత్వే, రాబర్ట్ పట్టిన్సన్‌, లుపితా నైయాంగ్‌, సమంత మార్టన్‌ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 2004లో వచ్చిన `ట్రాయ్‌` మూవీకి కొనసాగింపు అని చెప్పొచ్చు. క్రిస్టోఫర్‌ నోలన్‌ రూపొందించిన చిత్రాలకు మన ఇండియాలో మంచి క్రేజ్‌, డిమాండ్‌ ఉంటుంది. ఆయన గతంలో `మెమెంటో`, `ఇన్సోమ్నియా`, `బ్యాట్‌ మ్యాన్‌ బిగిన్స్`, `ది ప్రిస్టీజ్‌`, `ది డార్క్ నైట్‌`, `ఇన్సెప్షన్‌`, `ది డార్క్ నైట్ రైజెస్‌`, `ఇంటర్‌సెల్లార్‌`, `డంకిర్క్`, `టెనెట్‌`, `ఓపెన్‌హెమ్మర్‌` వంటి చిత్రాలను రూపొందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఒడిస్సీ లో ఏం చూపించారంటే?
Image Credit : X/@odysseymovie

ఒడిస్సీ లో ఏం చూపించారంటే?

క్రిస్టోఫర్‌ ఇప్పుడు `ది ఒడిస్సీ` మూవీతో వచ్చారు. ఇదొక చందమామ కథలాంటి మూవీ. ఒక రాజు(ఒడిస్సీ) తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో అనేక రాజ్యాలపై యుద్ధాలు చేస్తూ వెళ్తుంటారు. ఓ దశలో ట్రాయ్‌ ని అక్రమించుకున్న తర్వాత తిరిగి తన రాజ్యానికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్నాయనేది కథ. దాదాపు పదేళ్లు ఒడిస్సీ తన ప్రయాణం చేస్తుంటాడు. దారి తప్పుతాడు, ఓ రాక్షసి శాపానికి గురవుతాడు, అనేక అడ్డంకులను ఎదుర్కొంటాడు. వాటిని ఎలా దాటుకుని ప్రాణాలతో బయటపడ్డాడు, తన రాజ్యానికి ఎలా చేరుకున్నారనేదాన్ని ఇందులో ఎమోషనల్‌ డ్రామాగా చూపించారు. మరోవైపు తన రాజ్యాన్ని భార్య పాలిస్తుంటుంది. విలన్లు కొందరు ఆమెని తన వశం చేసుకొని రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటారు. వారికి ఒడిస్సీ ఎలా ఎదుర్కొన్నాడు, తన భార్యని, తన రాజ్యాన్ని ఎలా సొంతం చేసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.

34
ది ఒడిస్సీ ఇండియా కలెక్షన్లు
Image Credit : X/@odysseymovie

ది ఒడిస్సీ ఇండియా కలెక్షన్లు

జులై 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీకి విశేష ఆదరణ లభించింది. మన భారతీయ కథలను పోలి ఈ మూవీ స్టోరీ ఉండటంతో బాగా కనెక్ట్ అయ్యింది. పైగా క్రిస్టోఫర్‌ నోలన్‌ సినిమా అంటే అందరిలోనూ అంచనాలుంటాయి. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిస్టోఫర్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు ఇండియాలో రావడం విశేషం. ఈ మూవీ మూడు రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు రూ.73కోట్లు రాబట్టిందట. ఇండియాలో ఈ స్థాయి కలెక్షన్లు అంటే రికార్డుగా చెప్పొచ్చు. ఇది వంద కోట్లు దాటేలా ఉంది. ఈజీగా రెండు వందల కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే, ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్‌ మూవీగా `ది ఒడిస్సీ` రికార్డు సృష్టిస్తుంది. ఇది తెలుగులో రూ.4.63కోట్లు రాబట్టింది.

44
ఒడిస్సీ వరల్డ్ వైడ్‌ కలెక్షన్లు
Image Credit : X/@odysseymovie

ఒడిస్సీ వరల్డ్ వైడ్‌ కలెక్షన్లు

ఇక ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. వరల్డ్ వైడ్‌గా  ఇది మూడు రోజుల్లో 264 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. అంటే రూ.2640కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రానికి 250 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. అయితే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ 625 మిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం ఇందులో 40శాతం వరకు కలెక్ట్ చేసింది. తొలి వీకెండ్‌లోనే ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషం. దీనికి లాంగ్‌ రన్‌ ఉంటుంది. దీంతో ఈజీగానే బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. క్రిస్టోఫర్‌ మూవీస్‌, స్క్రీన్‌ ప్లే బేస్డ్ గా ఉంటాయి. ట్విస్ట్ లు, టర్న్ లతో ఆకట్టుకుంటారు. అయితే ఈ మూవీని మాత్రం డ్రామా, ఎలివేషన్లతో రూపొందించారు. కమర్షియల్‌ ఫార్మాట్‌ని ఫాలో అయ్యారు. దీంతో ఇది కమర్షియల్‌గా బాక్సాఫీసు వద్ద గట్టిగానే వసూలు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image2
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Recommended image3
Suriya Jyotika Mumbai House: భార్య కోసం షాకింగ్ డెసిషన్.. సూర్య రూ.200 కోట్ల ఇల్లు ఎందుకు వదిలేశాడో తెలుసా ?
Related Stories
Recommended image1
Lenin 10 Days Collections: పదో రోజు అఖిల్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేక్‌.. `లెనిన్‌`కి టోటల్‌ కలెక్షన్లు ఎంతంటే?
Recommended image2
Pawan Kalyan: కన్నప్పగా పవన్ కళ్యాణ్, అది విని రాత్రంతా నిద్రలేదు.. సంచలన చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved