MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: కన్నప్పగా పవన్ కళ్యాణ్, అది విని రాత్రంతా నిద్రలేదు.. సంచలన చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా ?

Pawan Kalyan: కన్నప్పగా పవన్ కళ్యాణ్, అది విని రాత్రంతా నిద్రలేదు.. సంచలన చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా ?

పవన్ కళ్యాణ్ శివ భక్తుడిగా కన్నప్ప సినిమాలో నటించాల్సింది. శివ భక్తుడిగా నటించాలి అని పవన్ కళ్యాణ్ కోరుకున్నారట. దీని గురించి తనికెళ్ళ భరణి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 20 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pawan Kalyan
Image Credit : Asianet News

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ మూవీస్ చేశారు. డివోషనల్ టచ్ మూవీ పవన్ చేసింది గోపాల గోపాల మాత్రమే. ఇందులో పవన్ శ్రీకృష్ణుడిగా నటించారు. అయితే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో పూర్తి స్థాయి డివోషనల్ మూవీ చేయలేదు. కానీ ఆ అవకాశం మాత్రం పవన్ కి వచ్చింది. ఏకంగా పరమ శివభక్తుడు కన్నప్ప పాత్రలో నటించే అవకాశం పవన్ కళ్యాణ్ కి దక్కింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తనికెళ్ళ భరణి కామెంట్స్
Image Credit : our own

తనికెళ్ళ భరణి కామెంట్స్

కానీ పవన్ కళ్యాణ్ కన్నప్ప మూవీ చేయలేకపోయారు. దీని గురించి ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలు మూవీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆసక్తికర సంఘటన జరిగింది. షూటింగ్ జరుగుతుండగా పవన్ కళ్యాణ్ కేరవ్యాన్ లో ఉన్నారు. ఆయన అసిస్టెంట్ ని పిలిచి కళ్యాణ్ గారు ఉన్నారా, ఆయనతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అడిగా. అసిస్టెంట్ వెళ్లి పవన్ కళ్యాణ్ కి చెప్పారు.

Related Articles

Related image1
Christopher Nolan: నోలన్ నోట తెలుగు సినిమా మాట.. ఇది కదా అసలైన గర్వకారణం, రాజమౌళి కి హ్యాట్సాఫ్
Related image2
Tollywood: ఆమె ముందు చిరంజీవి, బాలకృష్ణ కూతుళ్లు సరితూగగలరా.. అస్సలు హడావిడి లేదు, అయినా వేలకోట్లు
35
నాలోన శివుడు గలడు
Image Credit : x/manchu vishnu

నాలోన శివుడు గలడు

వెంటనే పవన్ నన్ను పిలిచారు. అప్పుడు నేను రాసిన 'నాలోన శివుడు గలడు' సీడీ ఇచ్చాను. కుదిరితే ఒకసారి వినండి అని చెప్పాను. తప్పకుండా వింటాను అని అన్నారు. మరుసటి రోజు షూటింగ్ కి రాగానే పవన్ కళ్యాణ్ నన్ను పిలిచారు. నేను వెళ్ళగానే లేచి నిలబడి రెండు చేతులు చాచి ఇలా రండి అని కౌగిలించుకున్నాడు.నేను పెద్ద భక్తుడిని కాదు. కానీ మీ సీడీ విన్న తర్వాత నాలో ఏదో తెలియని భక్తి భావం మొదలైంది.

45
పవన్ కి నిద్ర లేదు
Image Credit : others

పవన్ కి నిద్ర లేదు

రాత్రంతా నిద్రలేదు. ఏదో డిస్ట్రబెన్స్ చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈ రోజు అసలు షూటింగ్ కి రాకూడదు అని అనుకున్నా. ట్రాన్స్ లోకి వెళ్ళిపోయా. షూటింగ్ కి వెళ్లకపోతే అంతా ఇబ్బంది పడతారు కదా అని తేరుకుని వచ్చాను అని పవన్ నాతో అన్నాడు. శివభక్తుడిగా నటించాలని ఉంది అని చెప్పాడు. ఇది జరిగిన కొంత కాలం తర్వాత కన్నప్ప సినిమా చేయాలని అనుకున్నా. వెళ్లి పవన్ కళ్యాణ్ కి చెప్పాను. కన్నప్పగా మీరు నటించాలి అని అడిగా.

55
కన్నప్పగా నటించాలి అనుకున్న పవన్
Image Credit : stockPhoto

కన్నప్పగా నటించాలి అనుకున్న పవన్

పవన్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ ప్రస్తుతం నేను ఫ్లాపుల్లో ఉన్నాను. ఈ మూవీకి బడ్జెట్ చాలా అవసరం అవుతుంది. కొంత కాలం తర్వాత ఈ మూవీ చేద్దాం అని చెప్పాడు. పర్వాలేదు అర్జెంట్ గా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పా. కానీ ఆ తర్వాత పవన్ తన సినిమాలతో బిజీ అయిపోయాడు. నేను కూడా కన్నప్ప చిత్రాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మంచు విష్ణు ఆ మూవీ చేశాడు అని తనికెళ్ళ భరణి అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image2
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Recommended image3
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Related Stories
Recommended image1
Christopher Nolan: నోలన్ నోట తెలుగు సినిమా మాట.. ఇది కదా అసలైన గర్వకారణం, రాజమౌళి కి హ్యాట్సాఫ్
Recommended image2
Tollywood: ఆమె ముందు చిరంజీవి, బాలకృష్ణ కూతుళ్లు సరితూగగలరా.. అస్సలు హడావిడి లేదు, అయినా వేలకోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved