ఆర్జీవితో సురేఖా వాణి... నైట్ పార్టీలో రామ్ గోపాల్ వర్మతో కలిసి రచ్చ రచ్చ
ఏజ్ ఎంత అయితేం... గ్లామర్ విషయంలో హీరోయిన్లను మించిపోయింది.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి. హీరోయిన్ వయస్సున్న కూతురు ఉన్నా.. సురేఖా అందం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే ఆమె కూతురుకే పోటీ ఇస్తోంది సురేఖ. పబ్బులు పార్టీలు అంటూ తెగ తిరిగేస్తోంది. తాజాగా ఆర్జీవితో కలిసి రచ్చచేసింది బ్యూటీ.

నటి సురేఖా వాణి.. చాలా అమాయకంగా.. కమెడియన్లకు భార్యగా.. హీరోలకు అమ్మగా.. అక్కగా.. వదినగా ఎన్నో పాత్రల్లో మెరిసింది. కాని ఆమెలో మరో కోణం ఈమధ్య తెలిసింది నెటిజన్లకు. సురేఖా అంత హాట్ గా ఎవరూ ఉండలేదర. హీరోయిన్ అవ్వల్సినంత కూతురు ఉంచుకుని సురేఖ.. ఇంతలా గ్లామర్ ను మెయింటేన్ చేస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటుంది.
ఏజ్ పెరుగుతున్న ఇప్పటికీ ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో దుమారం రేపింది. కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మతో కలిసి సురేఖా వాని దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ నైట్ పార్టీ సందర్భంగా వీరు కలిసినట్లు సమాచారం. ఇందులో రామ్ గోపాల్ వర్మకు క్లోజ్‌గా, టైట్ హగ్ తో సురేఖ వాణి ఉన్నట్లు కనిపిస్తుంది. వర్మ చేతిలో గ్లాస్ ఉండగా.. వీరిద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ పోటో నెట్టింట్లో పెద్ద దుమారమే రేపుతోంది. అంతే కాదు ఈ ఫోటోపై రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు.
నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. ఏపాత్ర అయినా అద్భుతంగా చేస్తుంది. దాదాపు పదేళ్లపాటు ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోయింది సురేఖ. కాని ఎప్పుడైతే.. అనారోగ్యంతో తన భర్త చనిపోయాడో.. అప్పటి నుంచి చాలా కాలం నటనకుబ్రేక్ ఇచ్చింది సురేఖా.
కొంత కాలం డిప్రెషన మెయింటేన్ చేసిన సురేఖ.. ఆతరువాత సినిమాలు చేయడానికి రెడీ అయినా.. ఇప్పుడు పెద్దగా అవకాశాలు ఆమెకు రావడంలేదు. దాంతో కూతురుతో కలిసి.. సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది సురేఖ. హాట్ హాట్ పోజులతో బోల్ట్ ఫోటోలు.. డాన్స్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
అందరికి షాక్ ఇస్తోంది సురేఖా. నైట్ పార్టీలు.. పబ్బులతో పాటు..బొల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోంది. దాంతో పలు విమర్షలు కూడా ఫేస్ చేస్తోంది బ్యూటీ. అయినా సరే ఏమాత్రం తగ్గడంలేదు. విమర్షించేవారికి గట్టిగా సమాధానం కూడా చెపుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఆమె ఆర్జీవీతో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.