MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘గాడ్ ఫాదర్’ సక్సెస్.. ఫ్యాన్స్ కు నయనతార థ్యాంక్యూ నోట్.. మెగాస్టార్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్.!

‘గాడ్ ఫాదర్’ సక్సెస్.. ఫ్యాన్స్ కు నయనతార థ్యాంక్యూ నోట్.. మెగాస్టార్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్.!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’(Godfather) బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషించింది. దీంతో అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సుధీర్ఘమైన నోట్ రాసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 08 2022, 11:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పొలిటికల్ డ్రామాగా తెలుగులో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ‘లూసిఫర్’కు రీమేక్ గా వచ్చిన చిత్రమిది.  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), లేడీ సూపర్ స్టార్ నయనతారా  (Nayanthara) ప్రధాన పాత్రలు పోషించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సల్మాన్ ఖాన్,  సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్  బ్యానర్లపై నిర్మాతలు రామ్ చరణ్, ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అక్టోబర్ 5న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హవా చూపించింది.
 

36

ఈరోజు చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులు, ప్రేక్షకులు, చిత్ర యూనిట్ కు స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ ‘గాడ్ ఫాదర్’ టీం బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్ కు హాజరు కాలేకపోయిన నయనతార సోషల్ మీడియా వేదికన మాత్రం సుదీర్ఘమైన నోట్ రాస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. 

46

నోట్ లో.. గాడ్‌ఫాదర్‌ను భారీ బ్లాక్‌బస్టర్‌గా రూపొందించినందుకు సినీ ప్రేమికులందరికీ, తన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. గాడ్ ఫాదర్ తనకు చాలా ప్రత్యేకమైనదని చెప్పింది. చిత్ర బృందం, నటీనటులు అందరితో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉందని తెలియజేసింది. 
 

56

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే నయనతార ‘సైరా నర్సింహారెడ్డి’లో నటించిన విషయం తెలిసిందే. ఆయన ఒక రత్నమని, నటనలో పవర్‌హౌస్ ప్రదర్శనకారుడంటూ కొనియాడింది. సెట్స్ లో చిరంజీవితో ఉన్న ప్రతి క్షణం జీవితంలో గొప్ప సమయంగా భావిస్తానని చెప్పింది. 
 

66

అలాగే నిరంతరం తపై నమ్మకం ఉంచుతూ తన సినిమాల్లో మూడోసారి అవకాశం కలిపించిన దర్శకుడు మోహన్ రాజాకు కృతజ్ఞతలు తెలిపింది. గాడ్ ఫాదర్ మూవీలో ‘సత్యప్రియ’ పాత్రలో అద్భుతంగా నటించటానికి కారణం.. కేవలం దర్శకుడు తనపై ఉంచిన నమ్మకమే అన్నారు.  మరోవైపు మూవీలో నటించిన సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సహనటులందరికీ, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Recommended image2
Baahubali 3: బాహుబలి 3పై అదిరిపోయే అప్‌ డేట్‌.. అనుష్క, రానాతో కలిసి హింట్‌ ఇచ్చిన ప్రభాస్‌
Recommended image3
Heroes Lady Getup: లేడీ గెటప్స్‌లో దుమ్ములేపిన స్టార్ హీరోలు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved