నిండైన బట్టల్లో ఊహించని షాక్ ఇచ్చిన శ్రీముఖి.. ఆభరణాలకే అందం తెస్తూ రెడ్ లిప్స్ తో ఘాటుగా రాములమ్మ
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్.బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది.
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది.
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.
బిగ్ బాస్ సీజన్ 3లోశ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు.
శ్రీముఖి చివరగా 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.
ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు హాట్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది. నిండైన బట్టల్లో తన అసలు సిసలైన సొగసుతో మెస్మరైజ్ చేస్తోంది.
చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మాత్రమే కాదు.. ఇలా నిండైన వస్త్రధారణలో కూడా తాను అందంగా ఉంటానని శ్రీముఖి చెప్పకనే చెబుతోంది. మెరుపులు మెరిపిస్తున్న వైట్ డ్రెస్ లో శ్రీముఖి అదరహో అనిపిస్తోంది.
ఎరుపెక్కిన పెదాలతో ఘాటుగా యువతని ఊరిస్తూ సిగ్గు మొగ్గలేస్తున్నట్లు గా ఉన్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. తన అందంతో ఆమె ధరించిన ఆభరణాలకు అందం తీసుకువచ్చింది శ్రీముఖి.
శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ దర్శకుడు. అయితే శ్రీముఖి రోల్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.