MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు

Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు

సోగ్గాడు శోభన్‌ బాబు, మన్మథుడు నాగార్జున, హీరో సుమన్‌ లో ఒక్కటే కామన్‌ క్వాలిటీ. అదే వీరికి మైనస్‌. దాని వల్లే మెగాస్టార్‌ రేంజ్‌కి వెళ్లలేపోయారని డైరెక్టర్‌ హాట్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 28 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరోగా పీక్‌లో ఉన్నప్పుడే కేసులో ఇరుక్కున్న సుమన్‌
Image Credit : youtube/idream

హీరోగా పీక్‌లో ఉన్నప్పుడే కేసులో ఇరుక్కున్న సుమన్‌

సుమన్‌ ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించారు. చిరంజీవి వంటి అగ్ర హీరోలకు పోటీ ఇచ్చారు. యాక్షన్‌ సినిమాలతో, ఫ్యామిలీ చిత్రాలతో మెప్పించారు. మంచి ఆదరణ పొందారు. హీరోగా పీక్‌లో ఉన్నప్పుడే ఆయన బ్లూ ఫిల్మ్ కేసులో, అమ్మాయిని హెరాస్‌ చేసినట్టు ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు. జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. అది ఆయన కెరీర్‌కి పెద్ద దెబ్బగా మారింది. ఆయన ఇమేజ్‌ మొత్తం డ్యామేజ్‌ అయ్యింది. జైలు నుంచి బయటకు వచ్చాక నెమ్మదిగా సినిమాలు చేశారు, ఆ తర్వాత హిట్లు వచ్చాయి, కానీ ఇమేజ్‌ రాలేదు. అది సుమన్‌కి గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. ఈ కేసులు లేకపోతే చిరంజీవికి పోటీ ఇచ్చేవారని అంటుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుమన్‌ లో ఉన్న మైనస్ ఏంటంటే?
Image Credit : our own

సుమన్‌ లో ఉన్న మైనస్ ఏంటంటే?

కానీ సుమన్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు సీనియర్‌ దర్శకులు. సుమన్‌ ఎందుకు సక్సెస్‌ కాలేదనేది చెప్పారు. మెగాస్టార్‌ ఇమేజ్‌ రాకపోవడానికి కారణాలు వెల్లడించారు. సోగ్గాడు శోభన్‌ బాబు, మన్మథుడు నాగార్జునలకు సుమన్‌ కి సంబంధం ఉందని, ఈ ముగ్గురిలోనూ ఒకే ఒక్క కామన్‌ క్వాలిటీ ఉందని, అదే వారికి మైనస్‌గా నిలిచిందని చెప్పారు. అదేంటంటే అందం. ఇదే వీరి మైనస్‌ అంటున్నారు దర్శకుడు గీతా కృష్ణ. మరి ఆయన చెప్పిన లాజిక్‌ ఏంటంటే?

35
నాగార్జున, శోభన్‌ బాబు, సుమన్‌లో ఉన్న కామన్‌ క్వాలిటీ
Image Credit : Asianet News

నాగార్జున, శోభన్‌ బాబు, సుమన్‌లో ఉన్న కామన్‌ క్వాలిటీ

సోగ్గాడు శోభన్‌బాబు.. మంచి అందగాడు. ఆయన్ని ఆడవారు బాగా ఇష్టపడేవారు, ఆరాధించేవారు. దీంతో ఎక్కువగా ఆయన ఫ్యామిలీ చిత్రాలు చేశారు. యాక్షన్‌ చిత్రాలు తక్కువగా చేశారు, చేసినా అవి పెద్దగా ఆడలేదు. దీంతో ఫ్యామిలీ చిత్రాలతోనే రాణించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. కృష్ణ, ఎన్టీఆర్‌ స్థాయిలో మాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకోలేకపోయారు. అలాగే నాగార్జున కూడా అందగాడు. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటేన్‌ చేస్తున్నారు. ఆయన మాస్‌, యాక్షన్‌ సినిమాలు చేశారు, కానీ లవ్‌ స్టోరీస్‌, ఫ్యామిలీ చిత్రాలతోనే ఎక్కువగా విజయాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణ, ఏఎన్నార్‌, కృష్ణంరాజు స్థాయిలో మాస్‌ ఇమేజ్‌ సొంతం చేసుకోలేకపోయారు. అందుకే ఆయన మెగాస్టార్‌ స్థాయికి ఎదగలేకపోయారని చెప్పారు.

45
అందుకే సుమన్‌ మెగాస్టార్‌ కాలేకపోయారు
Image Credit : our own

అందుకే సుమన్‌ మెగాస్టార్‌ కాలేకపోయారు

వీరిలాగే సుమన్‌ కూడానట. ఆయనకు పెద్ద మైనస్‌ అందమే అని చెప్పారు. హీరో అంటే రగ్గుడ్‌ గా, మాస్‌ లుక్‌లో ఉండాలి, ఇలా అందంగా, బంగారంలా మెరిస్తే మాస్‌ ఆడియెన్స్ పెద్దగా ఇష్టపడరు, అమ్మాయిలే ఇష్టపడతారని తెలిపారు గీతా కృష్ణ. సుమన్‌కి ఆ అందమే మైనస్‌ అని, ఆయన అమ్మయిలా కనిపిస్తాడని తెలిపారు. దానివల్లే ఆయన మెగాస్టార్‌ రేంజ్‌కి రాలేకపోయారని చెప్పారు. కేసులు అడ్డంకిగా మారాయనే కామెంట్‌ ఉంది, కానీ అది వాస్తవం కాదు, తనని కొంత వరకు ఆడియెన్స్ చూస్తారు, ఈ కలర్‌ని మాస్‌ ఆడియెన్స్ లైక్‌ చేయరు అని చెప్పారు. అదే చిరంజీవిలా రఫ్‌గా ఉంటే కథ వేరేలా ఉండేదని చెప్పారు. ఏసియానెట్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ గీతాకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు.

55
మాస్‌ ఆడియెన్స్ కి దగ్గరై మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి
Image Credit : Asianet News

మాస్‌ ఆడియెన్స్ కి దగ్గరై మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి

చిరంజీవి చూడ్డానికి మాస్‌గా, రఫ్‌గా ఉంటాడని, డాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడని, ఆయన చేస్తుంటే ఆడియెన్స్ చూస్తారని, అందుకే ఆయన్ని ఇష్టపడ్డారని చెప్పారు. చిరంజీవికి ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రమే కాదు, మాస్‌ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారని, అదే ఆయన్ని మెగాస్టార్‌ ని చేసిందన్నారు. ఫైట్లు, డాన్సులే కాదు, కామెడీ కూడా బాగా చేస్తాడని, అది ఆయన స్పెషాలిటీ అని, ఇన్ని స్పెషాలిటీలు చిరులో ఉన్నాయి, కాబట్టే ఆయన మెగాస్టార్‌ అయ్యారని వెల్లడించారు గీతా కృష్ణ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
శోభన్ బాబు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Siva Reddy: 11 లక్షలు పెడితే 100 కోట్లు.. స్నేహితుడి చేతిలో నటుడు శివారెడ్డి ఎలా మోసపోయాడో తెలుసా?
Recommended image2
Apoorva Remuneration: మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్.. ఆమెకు అందిన పారితోషికం ఎంతో తెలుసా?
Recommended image3
Hanuman Ansh Telugu Day 3 Collections: తెలుగులో హనుమాన్‌ అంశ్‌ ఊహించని జంప్‌.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Related Stories
Recommended image1
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Recommended image2
Kiku Chiranjeevi Movie Review: కికు చిరంజీవి మూవీ రివ్యూ, గుండె కుడివైపు ఉంటే.. సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved