MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యునానిమస్ గా కెప్టెన్ అయిన శివాజీ.. రతిక ఫెయిల్ కంటెస్టెంట్ అంటూ టార్గెట్ చేసిన ప్రశాంత్

యునానిమస్ గా కెప్టెన్ అయిన శివాజీ.. రతిక ఫెయిల్ కంటెస్టెంట్ అంటూ టార్గెట్ చేసిన ప్రశాంత్

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 శనివారం ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. వీకెండ్ కావడంతో నాగార్జున వేదికపైకి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఇంటి సభ్యులతో సంభాషణ మొదలు పెట్టారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 11 2023, 10:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 శనివారం ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. వీకెండ్ కావడంతో నాగార్జున వేదికపైకి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఇంటి సభ్యులతో సంభాషణ మొదలు పెట్టారు. ఈ వారం అంత హౌస్ లోకి కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ విశేషాలని నాగార్జున అడిగి తెలుసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నాగార్జున శివాజీ కొడుకు గురించి మాట్లాడుతూ.. నీ కొడుకు అచ్చం నీలాగే ఉన్నాడు అని చెప్పారు. ఆ క్రమంలో నువ్వు హౌస్ లోకి వచ్చి బాగా సన్నబడ్డావు అని నాగ్ అన్నారు. దీనికి  శివాజీ అవును బాబు గారు అని సమాధానం ఇచ్చారు. బాడీ వెయిట్ తగ్గింది కానీ హెడ్ వెయిట్ పెరిగింది అని నాగ్ అనడంతో శివాజీ ఆశ్చర్యపోయాడు. నేను నాలాగే ఉన్నాను. ప్రేక్షకులకు నచ్చితే ఉంటాను నాగార్జున గారు లేకుంటే లేదు అని సమాధానం ఇచ్చాడు. 

36

అనంతరం కెప్టెన్ ని ఎంపిక చేసే ప్రక్రియ మొదలయింది. అర్జున్, శివాజీ కెప్టెన్సీ కంటెండర్స్ గా పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరిలో కెప్టెన్ ఎవరో తేల్చేందుకు నాగార్జున చిన్న గేమ్ పెట్టారు. కన్ఫెషన్ రూంలో శివాజీ, అర్జున్ పేరుతో రెండు కిరీటాలు ఉంచారు. 

46

ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి శివాజీ, అర్జున్ లలో ఎవరు కెప్టెన్ కావాలని కోరుకుంటున్నారో చెప్పాలి. కెప్టెన్ గా ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో వారి కిరీటంనుంచి ఒక వజ్రం తీసేయాలి. నాగార్జున ఒక్కొక్కరిగా ఇంటి సభ్యులని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. యునానిమస్ గా అందరూ శివాజీ కెప్టెన్ కావాలని కోరుకున్నారు. ఆల్రెడీ అర్జున్ కెప్టెన్ అయ్యాడు. శివాజీ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలి అని కారణాలు చెప్పారు. 

56

శివాజీ కెప్టెన్ కావడంతో శోభా శెట్టి కిరీటాన్ని ఆయనకు పెట్టింది. అర్జున్ కెప్టెన్సీ బ్యాడ్జీని శివాజీకి పెట్టారు. మధ్యలో కొన్ని సరదా సంఘటనలు జరిగాయి. నాగార్జున శోభా శెట్టి దగ్గర కాఫీ పెట్టించుకుని వేదికపైకి తెప్పించుకుని తాగారు.జాగ్రత్త సర్ కాఫీ వేడిగా ఉంటుంది అని శోభా అంటే.. నీ అంత హాట్ గా ఉండదు లే అంటూ చిలిపిగా నాగ్ సమాధానం ఇచ్చారు. 

66

ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ గురించి కూడా నాగార్జున మాట్లాడారు. రతిక గురించి మాట్లాడుతూ ఏంటి రతిక.. శివ నీకు రోజ్ ఇచ్చాడు అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న ప్రియాంక అవును సర్ వాడు ఇచ్చారు ఈమె తీసుకుంది అని సరదాగా తెలిపింది. రతికా సమాధానం ఇస్తూ అన్నయ్య ఇస్తున్నట్లు భావించాను సర్ అని చెప్పింది.. నాగార్జున స్పందిస్తూ అమ్మా నువ్వు ఎప్పుడు ఎవరిని అన్నయ అంటావో.. ఫ్రెండ్ అంటావా అర్థం కావడం లేదు అని చెప్పింది. దీనితో పక్కనే ఉన్న ప్రశాంత్ నవ్వుతూ కనిపించాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Salman Khan Watch: సల్మాన్ ఖాన్ కొత్త వాచ్.. స్పెషాల్ ఫీచర్స్ ఏంటో తెలుసా? కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగుతాయ్..
Recommended image2
Main Vaapas Aaunga OTT: ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడాలంటే?
Recommended image3
DC Box Office Collections: లోకేష్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. తొలిరోజే ఇన్ని కోట్ల కలెక్షన్లా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved