- Home
- Entertainment
- పబ్లిక్‌గా బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ హగ్గులు.. బ్లాక్ డ్రెస్‌లో హాట్ బ్యూటీ మైండ్ బ్లాక్..
పబ్లిక్‌గా బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ హగ్గులు.. బ్లాక్ డ్రెస్‌లో హాట్ బ్యూటీ మైండ్ బ్లాక్..
శృతి హాసన్.. ఘాటు ప్రేమలో మునిగితేలుతుంది. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికతో శృతి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.

శృతి హాసన్, ప్రియుడు శాంతనుతో కలిసి ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. ఇద్దరు కలిసి ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నారు. ఇందులో ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో ఉండటం విశేషం. శృతి హాసన్ బ్లాక్‌ని ఇష్టపడుతుంది. ఆమె 90శాతం బ్లాక్ డ్రెస్‌లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి బ్లాక్ డ్రెస్‌లో హంగామా చేశారు.
ఇందులో శృతి బ్లాక్ చాలా స్టయిలీష్‌గా ఉంది. ఆమె బ్లూ జీన్స్ షార్ట్ కూడా వేస్తుంది. ఈ నయా ట్రెండీ డ్రెస్‌లో శృతి హాసన్ సూపర్ హాట్‌గా ఉండటం విశేషం. ఆమె లుక్ వాహ్ అనేలా ఉంది. ఆమె స్టయిల్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
అయితే ఇందులో ఈ ఇద్దరు పబ్లిక్‌లో రెచ్చిపోయారు. ఎయిర్‌పోర్ట్ వద్ద హగ్గులిచ్చుకుంటూ రచ్చ చేశారు. ప్రియుడిని గట్టిగా కౌగిలించుకుంది శృతి. ఆయా పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శృతి హాసన్ ప్రియుడు శాంతను హజారిక డూడుల్ ఆర్టిస్ట్. అదొకరకమైన ఆర్ట్స్ కి సంబంధించిన టాలెంట్. కరోనా లాక్ డౌన్ సమయం నుంచే ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఆ సమయంలో చాలా వరకు కలిసే ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య అనుబంధం మరింతగా పెరిగింది.
అప్పట్నుంచి చాలా వరకు ఈ ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఓ రకంగా సహజీవనం చేస్తున్నారు. తరచూ ప్రియుడి గురించి పోస్ట్ లు పెడుతుంది శృతి. అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. చాలా వరకు ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లడం, కలిసే తిరగడం చేస్తున్నారు. ఇంట్లోనూ ప్రియుడి ఒళ్లో పడుకుని సేద తీరుతూ, చిలిపి పోజులతోనూ అలరిస్తుంటుంది శృతి హాసన్.
ఇక కెరీర్ పరంగా చూస్తే శృతి హాసన్.. ప్రస్తుతం ప్రభాస్‌తో `సలార్` చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో, యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. మొదటిసారి ఈసినిమా ద్వారా ప్రభాస్‌తో జోడీ కడుతుంది శృతి.
దీంతోపాటు నానితోనూ కలిసి నటిస్తుంది. `నాని30`లో శృతి ఎంపికైన విషయం తెలిసిందే. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఆమెతోపాటు శృతిని ఎంపిక చేశారు. మరి శృతిది కూడా హీరోయిన్ రోలా? లేక ఏదైనా కీలకపాత్రలో కనిపించబోతుందా? అనేది చూడాలి.
ఈ ఏడాది ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్లు అందుకుంది. చిరంజీవితో `వాల్తేర్ వీరయ్య`, బాలకృష్ణతో `వీరసింహారెడ్డి` చిత్రాలు చేసింది. ఈ రెండు ఒక్క రోజు గ్యాప్‌తో సంక్రాంతికి విడుదలయ్యాయి. రెండూ సూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు `సలార్`తో హ్యాట్రిక్ హిట్‌కి సిద్ధమవుతుందీ స్టార్ బ్యూటీ.