బోల్డ్ బ్యూటీ కిడ్నీ ఫెయిల్.. నా ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు, నటి కామెంట్స్
బాలీవుడ్ శృంగార తార షెర్లిన్ చోప్రా పేరు చెప్పగానే పలు వివాదాలు గుర్తుకు వస్తాయి. తరచుగా ఆమె బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉంటుంది. ప్లే బాయ్ మ్యాగజైన్ కి షెర్లిన్ న్యూడ్ గా ఫోటో షూట్ చేయడం అప్పట్లో సంచలనం.
బాలీవుడ్ శృంగార తార షెర్లిన్ చోప్రా పేరు చెప్పగానే పలు వివాదాలు గుర్తుకు వస్తాయి. తరచుగా ఆమె బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉంటుంది. ప్లే బాయ్ మ్యాగజైన్ కి షెర్లిన్ న్యూడ్ గా ఫోటో షూట్ చేయడం అప్పట్లో సంచలనం. ఆ తర్వాత శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాల వ్యవహారంలో షెర్లిన్ పేరు కూడా వినిపించింది.
ఎంతో బోల్డ్ గా ఉండే తనకి చాలా మంది దర్శకులు, నిర్మాతల నుంచి వేధింపులు ఎదురయ్యాయని షెర్లిన్ తెలిపింది. నాతో మాట్లాడాలంటే ముందుగా శృంగార విషయాలే మాట్లాడేవారు. ఓ డైరెక్టర్ అయితే నా వక్షోజాల గురించి అసభ్యంగా మాట్లాడారు. ఏంటి అక్కడ సర్జరీ చేయించుకున్నావా ? వాటి సైజ్ ఎంత అని ప్రశ్నించాడు.
నేను ఏది దాచి పెట్టను. అబద్దం చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే అవును సర్జరీ చేయించుకున్నాను. ఎందుకంటే నా పై భాగం ఫ్లాట్ గా ఉండడం నాకు ఇష్టం లేదు అంటూ బోల్డ్ గా సమాధానం ఇచ్చినట్లు షెర్లిన్ తెలిపింది. ఒకసారి టచ్ చేయొచ్చా అంటూ మరింత అసభ్యంగా అడిగాడు. దీనితో ఒక డైరెక్టర్ నాతో అలా మాట్లాడటంతో కోపం వచ్చింది.
హీరోయిన్ల సైజు తెలుసుకుని ప్రేక్షకులు థియేటర్స్ కి వెళతారా అని ప్రశ్నించాను. ఆడవాళ్ళ సైజులు తెలుసుకోవాలంటే.. మీకు పెళ్లయింది కాబట్టి ఇంటికి వెళ్లి మీ భార్యని అడగండి అంటూ ముఖం మీదే చెప్పేశా. కానీ అతడు నా భార్య నాతో సరిగా ఉండడం లేదు అని బదులిచ్చాడు. తన భార్యతో ఇలా ఓపెన్ గా మాట్లాలేను అని అన్నాడు.
భార్యతో ఉండలేడు కానీ నాతో ఉంటాడట అంటూ షెర్లిన్ ఇంటర్వ్యూలో ఫైర్ అయింది. షెర్లిన్ మరో షాకింగ్ విషయం కూడా చెప్పింది. 2021లో తన ఆరోగ్యం దెబ్బతిందట. ఫలితంగా కిడ్నీ సమస్యలు వచ్చాయని తెలిపింది. ఆ నా ఫ్యామిలీకి నేనేంటే ఇష్టం లేదు. అందుకే ఆ సమయంలో వారు నన్ను పట్టించుకోలేదు అని షెర్లిన్ తెలిపింది.
హెల్త్ పై దృష్టి పెట్టకుంటే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాలి లేదా డయాలసిస్ చేయించుకోవాలి అన్నారు. ఆ తర్వాత మందులు వాడడంతో ఆరోగ్యం కుదుటపడినట్లు షెర్లిన్ పేర్కొంది. ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభం నుంచి తనకి కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదురవుతూనే ఉన్నట్లు షెర్లిన్ పేర్కొంది.