- Home
- Entertainment
- నైట్ క్లబ్ లో స్టార్ హీరోయిన్ తో ముద్దుల వీడియో లీక్.. నా లైఫ్ అవుట్ అనుకున్నా, డేటింగ్ లో ఉంటే అంతే
నైట్ క్లబ్ లో స్టార్ హీరోయిన్ తో ముద్దుల వీడియో లీక్.. నా లైఫ్ అవుట్ అనుకున్నా, డేటింగ్ లో ఉంటే అంతే
బాలీవుడ్ అందగాడు షాహిద్ కపూర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. యువత మెచ్చే చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అప్పుడప్పుడూ సినిమాలతో ప్రయోగాలు కూడా చేయడం చూస్తున్నాం.

బాలీవుడ్ అందగాడు షాహిద్ కపూర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. యువత మెచ్చే చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అప్పుడప్పుడూ సినిమాలతో ప్రయోగాలు కూడా చేయడం చూస్తున్నాం. ఇటీవల షాహిద్ కపూర్ జెర్సీ, అర్జున్ రెడ్డి లాంటి టాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్ ని హిందీలో రీమేక్ చేశాడు.
2015లో మీరా రాజ్ పుత్ ని వివాహం చేసుకున్నషాహిద్ అంతకు ముందు ఘాటైన ప్రేమ వ్యవహారాలే నడిపాడు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తో దాదాపు 6 ఏళ్ల పాటు షాహిద్ డేటింగ్ చేశాడు. కానీ ఎందుకో ఈ జంట పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు.
వీరిద్దరి ప్రేమ వ్యవహారం బహిరంగ రహస్యమే. అప్పట్లో చెట్టాపట్టాలేసుకుని బాగా ఎంజాయ్ చేశారు. కానీ పబ్బులు, పార్టీలతో ఎంజాయ్ చేశారు. అప్పట్లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఓ నైట్ క్లబ్ లో ఘాటుగా రొమాన్స్ లో మునిగిపోయి చుట్టూ ప్రపంచాన్ని మరచిపోయారు. ఇద్దరూ లిప్ లాక్స్ తో రొమాన్స్ చేస్తుండగా ఎవరో వీడియో తీసి లీక్ చేశారు.
అప్పట్లో ఈ వ్యవహారం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించింది. ఇన్నేళ్ల తర్వాత షాహిద్ కపూర్ ఆ వీడియో లీక్ గురించి ఓపెన్ అయ్యారు. దాదాపు ఇది 19 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అప్పుడు నా వయసు 24 ఏళ్ళు. ఒక్కసారిగా ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యే సరిగా అంతా బ్లాంక్ అయినట్లు అనిపించింది.
నా జీవితం ముగిసిపోయింది అనుకున్నా. ఆ వయసులో ఆందోళన ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులో ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో అర్థం కాలేదు. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఇక డేటింగ్ లో ఉంటే ఇలాగే జరుగుతుంది. నాకు పెళ్లయ్యాక అంతా కుదుటపడింది అని షాహిద్ కపూర్ తెలిపాడు.
ఆ తర్వాత కరీనా కపూర్.. సైఫ్ అలీ ఖాన్ ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి జీవితాలని వాళ్ళు గడుపుతున్నారు. కరీనా కపూర్, షాహిద్ ఇద్దరూ ఫిదా, చుప్ చుప్ కె, మిలేంగే మిలేంగే లాంటి చిత్రాల్లో నటించారు.