MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?

Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?

Katrina Kaif Trolling: కత్రినా కైఫ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే భర్త విక్కీ కౌశల్ సైలెంట్‌గా ఉన్నాడు. కానీ, సల్మాన్ ఖాన్ మాత్రం ఆమెకు బహిరంగంగా మద్దతుగా నిలిచాడు. దీంతో నెటిజన్లు విక్కీని టార్గెట్ చేశారు. అసలు విక్కీ మౌనికి కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 23 2026, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విక్కీ కౌశల్ పై ట్రోలింగ్..
Image Credit : Social Media

విక్కీ కౌశల్ పై ట్రోలింగ్..

బాలీవుడ్ స్టార్ కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్ జరుగుతుంటే సల్మాన్ ఖాన్ ఆమెకు బహిరంగంగా మద్దతు ఇచ్చాడు. కానీ, ఇదే విషయం ఇప్పుడు కత్రినా భర్త విక్కీ కౌశల్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో నెటిజన్లు అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిగ్ బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ ఫైర్
Image Credit : Instagram

బిగ్ బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ ఫైర్

ఇటీవల అంబానీ ఇంట జరిగిన వేడుకలో కత్రినా కైఫ్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆమె బరువు పెరిగిందంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. దీనిపై 'బిగ్ బాస్ వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ పరోక్షంగా స్పందించాడు. "ఇటీవలే తల్లయిన ఒక మహిళను ఇలా ట్రోల్ చేయడం కరెక్టేనా? ఆమె మళ్లీ సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఫిట్‌నెస్ సాధిస్తుంది, కాస్త సమయం ఇవ్వండి" అంటూ ఫైర్ అయ్యాడు. అలాగే తన సోదరుడు సోహైల్ ఖాన్ వయసుపై వస్తున్న కామెంట్స్, తనపై వస్తున్న ట్రోల్స్ పట్ల కూడా సల్మాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

35
విక్కీ కౌశల్‌పై నెటిజన్ల ఫైర్
Image Credit : Instagram

విక్కీ కౌశల్‌పై నెటిజన్ల ఫైర్

కత్రినాకు మద్దతుగా సల్మాన్ ఖాన్ మాట్లాడటంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. "భార్య కత్రినాకు ఇంత అవమానం జరుగుతున్నా భర్త విక్కీ కౌశల్ సైలెంట్‌గా ఉన్నాడు. కానీ, మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ మాత్రం ఆమె కోసం గొంతు విప్పాడు" అంటూ నెటిజన్లు విక్కీని ఆడేసుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో విక్కీని టార్గెట్ చేస్తూ ఎన్నో ట్రోల్స్, రీల్స్ వైరల్ అవుతున్నాయి.

45
విక్కీ మౌనానికి కారణం ఏంటి?
Image Credit : Instagram

విక్కీ మౌనానికి కారణం ఏంటి?

అయితే, ఈ వివాదంపై బాలీవుడ్ వర్గాల్లో మరో చర్చ కూడా నడుస్తోంది. కత్రినా కైఫ్ మొదటి నుంచి సోషల్ మీడియా వివాదాలకు దూరంగా ఉంటుంది. అనవసరమైన ట్రోల్స్‌కు స్పందించకుండా సైలెంట్‌గా ఉండటమే ఆమె స్టైల్. అందుకే, భార్య నిర్ణయాన్ని, ఆమె ప్రైవసీని గౌరవించే విక్కీ కౌశల్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది.

55
కొనసాగుతున్న సల్మాన్-కత్రినా స్నేహం
Image Credit : Asianet News

కొనసాగుతున్న సల్మాన్-కత్రినా స్నేహం

2003లో మొదలైన సల్మాన్, కత్రినాల ప్రేమాయణం 2008లో బ్రేకప్ అయింది. కానీ, సల్మాన్ ఖాన్ ఎలాంటి కోపం లేకుండా కత్రినాతో కలిసి 'బాడీగార్డ్', 'టైగర్' లాంటి హిట్ సినిమాల్లో నటించాడు. అంతేకాదు, కత్రినాకు సల్మాన్ కుటుంబంతో ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. అందుకే, కష్టకాలంలో కత్రినాకు సల్మాన్ అండగా నిలవడం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. కానీ, ఇదే విషయమై భర్త విక్కీ కౌశల్‌ను తక్కువ చేసి చూడటం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు ఆల్మోస్ట్ కన్ఫర్మ్, రాజకీయం చేసి తప్పించారు..నిర్మాత కొడుకు కామెంట్స్
Recommended image3
అమల నుంచి కనక వరకు 90ల్లో ఓ వెలుగు వెలిగి.. సడెన్‌గా మాయమైన టాప్ 5 హీరోయిన్లు
Related Stories
Recommended image1
Trigun: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, త్రిగుణ్ జీవితంలో అతి పెద్ద విషాదం గురించి తెలుసా?
Recommended image2
Paradise Review: ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ.. నాని సినిమాలో హైలెట్స్ ఇవే, మైనస్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved