MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సైఫ్ అలీ ఖాన్ "హెల్త్ ఇన్సూరెన్స్‌" క్లైమ్ పై వివాదం

సైఫ్ అలీ ఖాన్ "హెల్త్ ఇన్సూరెన్స్‌" క్లైమ్ పై వివాదం

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన తర్వాత, ఆయన రూ.36 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. ఈ క్లెయిమ్ త్వరగా ఆమోదించడంపై వైద్య నిపుణుల సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 27 2025, 04:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన విషయంలో ప్రతీది సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే.  తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో దాడిచి సైఫ్ అలీ ఖాన్‌ని గాయపరిచాడు. సైఫ్ శరీరంపై ఆరో చోట్ల గాయాలయ్యాయి.

వెన్నెముకపై తీవ్ర గాయం కావడంతో పాటు మెడపై గాయాలు ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే అతని నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆయనకు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి, ఆయన వెన్నుముకలో విరిగిన కత్తి భాగాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
saif ali khan

saif ali khan


ఐదు రోజుల తర్వాత సైఫ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దాదాపు వారం రోజులుగా సైఫ్ అలీఖాన్ బిల్లు రూ.36 లక్షలు అయ్యిందని  కథనాలు చెబుతున్నాయి.   సైఫ్ అలీ ఖాన్ రూ. 35.95 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లు ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నివా బుపా పేర్కొంది.

క్లెయిమ్ చేసిన దాంట్లో రూ. 25 లక్షలు అప్రూవ్ చేసినట్లు వెల్లడించింది. పూర్తి చికిత్స తర్వాత తుది బిల్లులు సమర్పించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని సెటిల్ చేస్తామని నివా బుపా పేర్కొంది.  సైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ వివరాలు సోషల్ మీడియాలో కనిపించాయి. చికిత్స ఖర్చు, అతడి డిశ్చార్జ్ తేదీల వివరాలు వెల్లడించింది.  
 

35


ఈ వ్యవహారంపై ముంబైకి చెందిన వైద్య నిపుణుల సంస్థ ‘‘అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్’’ సైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌ని ప్రశ్నించింది. సైఫ్ ఇన్సూరెన్స్‌ని త్వరగా ఆమోదించిన విధానాన్ని ప్రశ్నిస్తూ వైద్య నిపుణుల సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులరేటరీ సంస్థ అయిన ‘‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)’’కి లేఖ రాసింది.

45

‘‘మిస్టర్ సైఫ్ అలీ ఖాన్ తన బీమా పాలసీ కింద నగదు రహిత చికిత్స కోసం రూ. 25 లక్షలు మంజూరు చేయబడ్డారనే ఇటీవలి వార్తల గురించి మా ఆందోళన మరియు అసంతృప్తిని వ్యక్తం చేయడానికి లేఖ రాస్తున్నాము. ఇది సాధారణ పాలసీదారులతో పోలిస్తే సైఫ్ అలీ ఖాన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది’’ అని చెప్పింది.

ఇది సెలబ్రిటీలు, ఉన్నతస్థాయి వ్యక్తులు, కార్పొరేట్ పాలసీలు ఉన్న రోజులకు అనులకూమైన నిబంధనలు, అధిక నగదు రహిత చికిత్స పరిమితులను పొందుతున్నారని, అయితే సాధారణ పౌరులకు తగినంత కవరేజ్, తక్కువ రీఎయింబర్స్‌మెంట్ రేట్లతో ఇబ్బంది పడుతున్నారని వైద్యుల సంస్థ పేర్కొంది. 
 

55


సైఫ్ అలీ ఖాన్ హెల్త్ ఇన్సూరెన్స్ సామాన్యులు, ఉన్నతులకు మధ్య అన్యాయమైన అసమానతలను సృష్టిస్తోందని మెడికల్ కన్సల్టెటంట్స్ అసోసియేషన్ పేర్కొంది. సామాజిక హోదాతో సంబంధం లేకుండా భీమా అందరికి రక్షణగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని, సామాజిక హోదాతో సంబంధం లేకుండా అన్ని పాలసీదారులను సమానంగా చూసేలా చూసుకోవాలని సంస్థ IRDAIని అభ్యర్థించింది.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved