MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • తనని పెళ్లి చేసుకునేవాడు అలా చేయకూడదట.. మ్యారేజ్‌ చేసుకోకపోవడానికి అసలు కారణం బయటపెట్టిన సదా!

తనని పెళ్లి చేసుకునేవాడు అలా చేయకూడదట.. మ్యారేజ్‌ చేసుకోకపోవడానికి అసలు కారణం బయటపెట్టిన సదా!

ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపుఊపేసిన సదా ఇప్పుడు మళ్లీ సందడి చేస్తుంది. బుల్లితెరపై మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణమేంటనేది  బయటపెట్టింది సదా. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 25 2022, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తెలుగు సినిమా `జయం`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సదా(Sadaa). నితిన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. లవ్‌ స్టోరీస్‌లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది సదా.  ఇందులో `రాను రానంటూనే సిన్నదో`  అనే పాటలో నితిన్‌,  సదా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రేమ కథల్లో ఇదొక బెస్ట్ ఫీలింగ్‌గా నిలుస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీకి తెలుగుతోపాటు, తమిళం,  మలయాళం, కన్నడ,  హిందీలోనూ నటించింది. అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా వెలిగి,  కనుమరుగయ్యింది. కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ  ఇస్తుంది. సినిమాలు,  టీవీ, వెబ్‌ సిరీస్‌ ఇలా తేడా లేకుండా అన్నింటిలోనూ నటించేందుకు సిద్ధంగా  ఉంది.  ఇటీవల `హలో వరల్డ్` వెబ్‌ సిరీస్‌లోనూ మెరిసింది. 
 

38

ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఇందులో వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడించింది. అందులో భాగంగా తాను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటో చెప్పింది సదా. ఆమె చెప్పిన విషయాలు ఆద్యంతం షాకిచ్చేలా ఉండటం విశేషం. 

48

నలభై ఏళ్లకి చేరువలో ఉన్న సదా మ్యారేజ్‌పై స్పందించింది. తనకు పెళ్లి ఆలోచన లేదని చెప్పడం విశేషం. తనని పెళ్లి చేసుకునే వాడు తన సంపాదనపై ఆధార పడకూడదనని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి తనకు ఇప్పటి వరకు తారసపడలేదని చెప్పింది. అందుకే మ్యారేజ్‌ చేసుకోలేదని చెప్పింది సదా. 

58

సదా చెప్పిన కారణంపై పలు విమర్శలు వస్తున్నాయి. సదా లాంటి అందమైన అమ్మాయి దొరికితే చాలనుకునే వారు కోకొల్లలు. అలాంటిది  ఆమె సంపాదన వారికెందుకు అని,  సదా చెప్పిన కారణం చాలా సిల్లీగా ఉందని, స్టోరీస్‌ చెప్పడం ఆపి అసలు విషయానికి రా.. అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. 
 

68

`జయం` చిత్రంతో  ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయిన సదా.. తెలుగులో `ప్రాణం`, `నాగ`,  `దొంగ దొంగది`, `లీలా మహల్‌ సెంటర్‌`,  `ఔనన్నా  కాదన్నా`,  `చుక్కల్లో చంద్రుడు`,  `వీరభద్ర`,  `క్లాస్‌ మేట్స్`, మైత్రీ`,`యమలీలా 2` వంటి చిత్రాల్లో నటించింది. 

78

ఇటీవల `జబర్దస్త్` షోకి జడ్జ్ గా రీఎంట్రీ ఇచ్చింది. కొన్ని ఎపిసోడ్లు చేసిన ఆమె టీవీని, సినిమాలని బ్యాలెన్స్ చేయాలని భావిస్తుంది.  మరోసారి నటనపై పూర్తి ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగా ఇటీవల నిహారిక నిర్మించిన `హలో వరల్డ్` అనే  వెబ్‌ సిరీస్‌లో నటించింది సదా. 

88

మరోవైపు సినిమా అవకాశాల కోసం అందాలు ఆరబోస్తుంది. లేట్‌ వయసులో ఘాటు అందాలతో మతిపోగొడుతుంది. సోషల్‌ మీడియాలో నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్‌ సైడ్‌ మరింతగా ఓపెన్‌ అవుతుంది సదా. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Recommended image2
Folk Song : అందాలను ఇంత అద్భుతంగా వర్ణిస్తే ఏ అమ్మాయైనా ప్లాట్ అవ్వాల్సిందే.. అందుకే ఈ ఫోక్ కు 237M వ్యూస్
Recommended image3
Kiku Chiranjeevi Movie Review: కికు చిరంజీవి మూవీ రివ్యూ, గుండె కుడివైపు ఉంటే.. సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved