- Home
- Entertainment
- హైపర్ ఆదికి నటి క్లీన్ బౌల్డ్.. లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ బ్యూటీ.. దెబ్బకి మైండ్ బ్లాక్
హైపర్ ఆదికి నటి క్లీన్ బౌల్డ్.. లవ్ ప్రపోజ్ చేసిన యంగ్ బ్యూటీ.. దెబ్బకి మైండ్ బ్లాక్
జబర్దస్త్ తో పాపులర్ అయిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ లు పలు షోలలో పాల్గొంటున్నారు. చాలా ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతోంది.

జబర్దస్త్ తో పాపులర్ అయిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ లు పలు షోలలో పాల్గొంటున్నారు. చాలా ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతోంది. వాళ్ళు చేసే కామెడీ బేస్ చేసుకుని అనేక కార్యక్రమాలు సృష్టించారు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఆ ఛానల్ ని వదలి వెళ్ళిపోయాడు.
ఆ ఛానల్ లో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా బాగా పాపులర్ అయింది. ఈ షోలో హైపర్ ఆది, రాంప్రసాద్, నూకరాజు, ఇమ్మాన్యూల్ లు హాస్యంతో నవ్విస్తున్నారు. అయితే ఇటీవల ప్రసారం అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
యంగ్ బ్యూటీ రీతూ చౌదరి హైపర్ ఆదికి లవ్ ప్రపోజ్ చేసింది. అయితే ఇందంతా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగమే. లేటెస్ట్ ఎపిసోడ్ లో 'టిఆర్పి స్టంట్' పేరుతో కొత్త డ్రామా క్రియేట్ చేశారు. దీనిలో భాగంగా నటులంతా టిఆర్పి కోసం షాకింగ్ గా ఏమైనా చేయాలి.
నూకరాజు రీతూ చౌదరిని ప్రశ్నిస్తూ.. నువ్వు గతంలో ఓ ఛానల్ లో ఒకరిని హగ్ చేసుకున్నావు. అజార్ అంటే ఇష్టం అని చెప్పావు. అసలు నువ్వు నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నావు అని అడిగాడు.
దీనితో అందంగా ముస్తాబై వచ్చిన రీతూ చౌదరి తన మనసులో మాట బయట పెట్టింది. నేను నిజంగానే ప్రేమిస్తున్న వ్యక్తి ఇక్కడే ఉన్నారు. ఆ విషయం ఆయనకి కూడా తెలుసు అంటూ హైపర్ ఆది చేయి పట్టుకుని ' ఐలవ్యూ' చెప్పేసింది. దీనితో అక్కడ ఉన్న వారందరి మైండ్ బ్లాక్ అయ్యాయి. హైపర్ ఆది తనపై కామెడీ పంచ్ లు వేసినా నాకు ఇష్టమే.. ఎందుకంటే ఆ సమయంలో అయినా ఆదితో మాట్లాడవచ్చు అంటూ ఆదిపై తన ఇష్టాన్ని బయట పెట్టింది.