- Home
- Entertainment
- ఎర్రచీరలో కట్టిపడేస్తున్న రవితేజ హీరోయిన్.. చీరకట్టులో అదిరిన మాళవిక శర్మ గ్లామర్ విందు.. గుండె గల్లంతే!
ఎర్రచీరలో కట్టిపడేస్తున్న రవితేజ హీరోయిన్.. చీరకట్టులో అదిరిన మాళవిక శర్మ గ్లామర్ విందు.. గుండె గల్లంతే!
రవితేజ హీరోయిన్ మాళవికా శర్మ సంప్రదాయ దుస్తుల్లో కట్టిపడేస్తోంది. తాజాగా చీరకట్టులో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఓరచూపుతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. అందాల విందుతో మంత్రముగ్ధులను చేస్తోంది.

మోడల్ గా కేరీర్ ను ప్రారంభించిన యంగ్ బ్యూటీ మాళవికా శర్మ (Malvika Sharma) ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ చిత్రాల్లో అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ (Raviteja) సరసన ‘నేలటికెట్టు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిందీ బ్యూటీ. ఇది ఆమెకు తొలిచిత్రం. సినిమా తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఫస్ట్ మూవీ ఆశించిన మేరకు ఫలితానివ్వకపోవడంతో పెద్దగా పాపులర్ కాలేకపోయింది.
నటన పరంగా, గ్లామర్ పరంగా మాత్రం మాళవికా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. దీంతో తెలుగు, తమిళంలో అవకాశాలను అందుకుంటోంది. ‘నేల టికెట్’ తర్వాత వెంటనే రామ్ పోతినేని సరసన ‘రెడ్’ మూవీలో మెరిసింది. ఈ చిత్రమూ సక్సెస్ కాకపోవడం గమనార్హం.
ఏదో ఆఫర్లను అందుకుంటున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందడం లేదు. మొత్తానికి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ.. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఫ్యాన్ ఫాలోయింగ్ నూ పెంచుకునేందుకు నెట్టింట సందడి చేస్తోంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే శారీలో ఫొటోషూట్ చేసింది. సంప్రదాయ దుస్తుల్లో గ్లామర్ మెరుపులతో నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఎర్ర చీరలో పరువాలను ప్రదర్శించి కుర్ర గుండెల్లో గంటలు మోగించింది.
యంగ్ బ్యూటీ గ్లామర్ విందుకు అభిమానులతో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లోనూ మాళవికా శర్మ అందం కట్టిపడేస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. కుర్ర భామా ఓర చూపులకు, కొంటె పోజులకు ఫాలోవర్స్ మంత్రముగ్ధులవుతున్నారు. లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.