MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?

Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?

ఓ సినిమా షూటింగ్‌లో రజనీకాంత్‌ చేసిన అల్లరి పనిని బయటపెట్టింది రోజా. షూటింగ్‌ సెట్‌లో రజనీని చూసి అంతా షాక్‌ అయ్యారని తెలిపింది. ఇంతకి సూపర్‌ స్టార్‌ ఏంచేశాడంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 22 2026, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రజనీకాంత్‌ చేసిన పని బయటపెట్టిన రోజా
Image Credit : Asianet News

రజనీకాంత్‌ చేసిన పని బయటపెట్టిన రోజా

సీనియర్ నటి రోజా తన సినీ ప్రయాణంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. షూటింగ్ గ్యాప్‌లో తను నిద్రపోతున్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన అల్లరి పనిని గుర్తుచేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో రోజూ ఏదో ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వస్తూనే ఉంటుంది. పాత తరం నటీనటులు చెప్పే తెరవెనుక కథలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి వచ్చే వార్తలు, షూటింగ్‌లో సంఘటనలు, జోక్స్ తెలుసుకోవాలని అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
90ల నాటి కుర్రాళ్ల కలల రాణి రోజా
Image Credit : Instagram/Roja Selvamani

90ల నాటి కుర్రాళ్ల కలల రాణి రోజా

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా 90వ దశకంలో కుర్రకారుకు కలల రాణి. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలందరి సరసన ఆమె నటించారు. తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లో కూడా రోజా తన సత్తా చాటారు. తెలుగు, కన్నడ భాషల్లోనే కాకుండా తమిళంలో కూడా రోజా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ గురించి ఆమె చెప్పిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

34
సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా సరదా మనిషి
Image Credit : youtube@zeecinemalu

సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా సరదా మనిషి

రజనీకాంత్‌తో కలిసి పనిచేసినప్పటి అనుభవాలను రోజా ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రజనీతో కలిసి ఆమె రెండు సినిమాల్లో నటించారు. ఆ షూటింగ్ సెట్స్‌లో జరిగిన ముచ్చట్లను ఆమె గుర్తుచేసుకున్నారు. బయటకు చూడ్డానికి రజనీకాంత్ చాలా సీరియస్‌గా కనిపిస్తారు. కానీ రోజా చెప్పేది వేరు. రజనీ చాలా సరదాగా ఉంటారని, తనతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా జోకులు వేస్తూ మాట్లాడేవారని ఆమె చెప్పారు.

మీతోనే రజనీ ఎందుకు అలా ఉంటారు? రోజాను అడిగిన మీనా

ఒకసారి నటి మీనాకు, రోజాకు మధ్య రజనీకాంత్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. 'రజనీకాంత్ నాతో ఎప్పుడూ చాలా సీరియస్‌గా ఉంటారు. కానీ మీతో మాత్రం చాలా సరదాగా ఉంటారు, ఎందుకు?' అని మీనా ఒకసారి రోజాను అడిగారట. దానికి రోజా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. 'నువ్వు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటావు. అందుకే నీతో ఏం మాట్లాడాలో తెలియక ఆయన కూడా సీరియస్‌గా ఉంటారు' అని రోజా చెప్పారు. తాను మాత్రం అందరితో ఎప్పుడూ ఫ్రెండ్లీగా, నవ్వుతూ ఉంటానని, అందుకే రజనీకాంత్ కూడా తనతో చాలా ఫ్రీగా జోకులు వేసేవారని రోజా చెప్పుకొచ్చారు.

44
నేను నిద్రపోతుంటే రజనీకాంత్ ఫోటోలు తీశారు..!
Image Credit : Asianet News

నేను నిద్రపోతుంటే రజనీకాంత్ ఫోటోలు తీశారు..!

షూటింగ్ సమయంలో జరిగిన మరో ఫన్నీ ఇన్సిడెంట్‌ను కూడా రోజా గుర్తుచేసుకున్నారు. 'భోజనం చేశాక నేను ఈజీ చైర్‌లో పడుకునేదాన్ని. ముఖ్యంగా పాటలు, క్లోజప్ షాట్స్ తీసే ముందు కాస్త టైమ్ దొరికితే అలా రెస్ట్ తీసుకునేదాన్ని. అలా ఒకసారి నేను నిద్రపోతున్నప్పుడు రజనీకాంత్ నాతో ఆటపట్టించడం మొదలుపెట్టారు. ఆయన ఒక గొడుగు పట్టుకుని నా పక్కనే నిలబడ్డారు. నేను మంచి నిద్రలో ఉన్నాను. అప్పుడే నా ఫోటోలు తీశారు. మెలకువ వచ్చి చూసేసరికి నా చుట్టూ చాలా మంది నిలబడి ఉన్నారు. అప్పుడు చూశాను, రజనీకాంత్ గొడుగు పట్టుకుని అక్కడే నిలబడి ఉన్నారు' అని రోజా నవ్వుతూ చెప్పారు. అందరి ముందు ఇలా సరదాగా ఆటపట్టించడం రజనీకాంత్ నైజం అని ఆమె అన్నారు.

అలాగే సీనియర్ నటుడు శివాజీ గణేశన్ గురించి కూడా రోజా మాట్లాడారు. అంత పెద్ద స్టార్ హీరో అయినా సరే, ఆయన షూటింగ్ సెట్‌లోనే ఎక్కువ సమయం గడిపేవారట. లంచ్ బ్రేక్ వచ్చే వరకు ఆయన సెట్ నుంచి బయటకు వెళ్లేవారు కాదని చెప్పారు. ఇలాంటి సీనియర్ నటుల అంకితభావం, వృత్తి పట్ల వాళ్లకున్న గౌరవం చూసి ఇప్పటి తరం నేర్చుకోవాల్సింది చాలా ఉందని రోజా అన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Recommended image3
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Related Stories
Recommended image1
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image2
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved