MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: నిజం నిరూపించడానికి 4 రోజులు గడువు అడిగిన జానకి... జెస్సీ తల్లిదండ్రులకు మాటిచ్చిన రామ!

Janaki Kalaganaledu: నిజం నిరూపించడానికి 4 రోజులు గడువు అడిగిన జానకి... జెస్సీ తల్లిదండ్రులకు మాటిచ్చిన రామ!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 13వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Sep 13 2022, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జానకి, నిజం నిరూపించడానికి నాలుగు రోజులు గడువు ఇవ్వండి అత్తయ్య గారు. నాలుగు రోజులు జెస్సీ నీ  మన ఇంట్లో ఉంచండి, అప్పుడు మీకే తెలుస్తుంది. నేను ఎలాగైనా నిరూపిస్తాను అని అంటుంది. జ్ఞనాంబ ఆలోచనలో పడుతుంది. అప్పుడు జ్ఞానాంబ,తనని చూడడమే నాకు నచ్చదు అలాంటిది ఇంట్లో ఉంచుకోవడం అంటే అది అసంభవం.నేను నీకు నాలుగు రోజులు గడువు ఇస్తున్నాను.నువ్వు చెప్పేది నిజం అయితే నేనే పెళ్లి చేయిస్తాను, కానీ తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అప్పుడు రామా జానకితో, మీరు బాధపడొద్దు జానకి గారు నేను మీతో ఉన్నాను. జెస్సిని ఇప్పుడు ఇంటికి పంపిద్దాము వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పిద్దాము అని జెస్సి దగ్గరికి ఇద్దరు వెళ్తారు. అప్పుడు ఏమైంది అని జెస్సి అనగా ఇది ఇంత త్వరగా తేలే పని కాదమ్మా, కొంచెం సమయం కావాలి. నిన్ను ముందు ఇంట్లో దింపుతాము అక్కడ మీ అమ్మానాన్నలతో మాట్లాడి నీకు ఏ నిందా పడకుండా మేము చూస్తాము అని అంటారు. అప్పుడు ముగ్గురూ కలిసి జెస్సి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు.
 

36

 వాళ్ళు మోకాలు చూసిన జెస్సీ వాళ్ళ నాన్న,వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు కదా! నీ మొహం చూస్తేనే తెలుస్తుంది.జెస్సీ రా అమ్మ పోలీస్ స్టేషన్ కి వెళ్దాము అని అనగా రామా వచ్చి వద్దు నేను చెప్పేది వినండి. పిల్లలు తప్పు చేశారు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనదే కానీ ఇంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. సడన్గా వచ్చి ప్రేమ, పెళ్లి అంటే ఇంట్లో వాళ్లకి కూడా కొన్ని భయాలు ఉంటాయి కదా, ఆ ఇంటి పెద్ద కొడుకుగా నేను హామీ ఇస్తున్నాను జెస్సికి అఖిల్ తో పెళ్లి జరిపిస్తాను.
 

46

 కాకపోతే కొంచెం గడువు కావాలి,ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి కదా అప్పుడే జెస్సి జీవితం అక్కడ బాగుంటుంది అని అంటాడు.అప్పుడు జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి, సరే నేను మీ మాటలు నమ్మి కొంచెం సమయం గడివిస్తున్నాను అని జెస్సిని లోపలికి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత జానకి,రామ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జానకి రామా తో,మీరు నన్ను ఎందుకు నమ్ముతున్నారు రామా గారు? అని అడగగా ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అని మీరు ధైర్యంగా ఉన్నారంటే, మీ మాటల్లో నాకు నమ్మకం ఉన్నది జానకి గారు.
 

56

 అలాగే మీరు అమ్మ చెప్పినట్టు చదువు మీద దృష్టి పెట్టండి అని అంటాడు. ఆ తర్వాత జానకి తన గదిలో చదువుతూ ఉండగా అఖిల్ మాట మార్చిన విషయం గుర్తొచ్చి బాధపడుతూ ఉంటుంది. రామ వచ్చి భోజనం తినిపిస్తానన్నా జానకి తినదు మరోవైపు. మళ్ళీ మల్లిక తన గదిలో గెంతులు వేసుకుంటూ ఉంటుంది. రామా భోజనం ప్లేట్ ని టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. జ్ఞానాంబ  దాన్ని చూస్తుంది. ఆ తర్వాత జానకి టేబుల్ మీద కూర్చొని చదువుతూ ఉన్నప్పటికీ కూడా తన ఆలోచనలన్నీ అటువైపే ఉంటాయి.
 

66

 మరోవైపు అఖిల్ ఫోన్ చూస్తూ బయటికి వస్తాడు. రామ అఖిల్ మీ చూసి,ఈ సమస్యలన్నీ తీరాలంటే అఖిల్ నోట్లో నుంచి నిజం బయటికి తెప్పించడమే మంచిది అని అనుకోని అఖిల్ ని ఆపుతాడు. అప్పుడు అఖిల్ ఫోన్ వస్తున్నట్టు నటించి అక్కడ నుంచి వెళ్లి జ్ఞానాంబ దగ్గరకు వెళ్ళి ఒడిలో పడుకుంటాడు. రామా అటువైపు వస్తాడు. అప్పుడు అఖిల్, అన్నయ్య ఇటువైపు వస్తున్నాడు అమ్మ దగ్గర ఉండడమే మంచిది అని అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved