MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..

Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..

Pawan Kalyan: బండ్ల గణేష్‌, పవన్ కళ్యాణ్ ల బంధం గురించి ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు..ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా.. పవర్ స్టార్ గురించి గొప్పగా చెపుతుంటాడు బండ్ల.. దేవుడంటుంటాడు. మరి పవన్ ను బండ్ల ఇంతలా ఎలా ప్రసన్నం చేసుకున్నాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 18 2026, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నటుడిగా ప్రయాణం ప్రారంభించి
Image Credit : our own

నటుడిగా ప్రయాణం ప్రారంభించి

టాలీవుడ్ లో నటుడిగా ప్రయాణం ప్రారంభించిన బండ్ల గణేష్.. ఆతరువా నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎదుగుతూ.. కోటీశ్వరుడయ్యాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా పేరున్న బండ్ల.. పవన్ కళ్యాణ్‌ను మాత్రం తన దైవంగా భావిస్తాడు. నిర్మాతగా టాలీవుడ్‌లో స్టార్ గా వెలుగు వెలుగుతున్న బండ్లా.. పవన్ మాటకు విలువిస్తాడు. ఆయన ఏదంటే అదే పాట పాడతాడు. ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే తీరు, ఆయన పట్ల చూపే భక్తి అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయనఈ విషయాలకు సబంధించి క్లారిటీ ఇచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రసన్నం వెనుక ఉన్న రహస్యం
Image Credit : our own

ప్రసన్నం వెనుక ఉన్న రహస్యం

ఒక ప్రముఖ ఇంటర్వ్యూ కార్యక్రమంలో (ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే) హోస్ట్ వేసిన ప్రశ్నకు బండ్ల గణేష్ ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్శించింది. "పవన్ కళ్యాణ్‌ను అంతగా ఎలా కాకా పట్టగలిగావ్ .. ఎలా ప్రసన్నం చేసుకున్నా.. చేసుకున్నావ్, ఆ బుట్టలో పడేసే సీక్రెట్ టెక్నిక్ ఏంటి?" అని అడగ్గా.. గణేష్ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు . తన వ్యాపార రహస్యాన్ని అందరికీ చెబితే, రేపు వందల మంది అదే టెక్నిక్ వాడి తనకే పోటీగా నిలుస్తారని.. ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు బండ్ల. ప్రపంచంలో మనుషులను.. ముఖ్యంగా పెద్దవారిని మెప్పించడానికి 'ప్లీజింగ్' (వినమ్రత, బతిమాలడం) కంటే మించిన గొప్ప ఆయుధం మరొకటి లేదని స్పష్టం చేశారు. ఎవరితోనైనా విభేదించి విజయం సాధించలేమని, వినయంతో, ఆప్యాయతతో సహాయం కోరితే ఎంతటి వారైనా కరిగిపోతారని, తాను పవన్ కళ్యాణ్ గారి వద్ద అదే నమ్మకాన్ని, భక్తిని చూపానని బండ్ల గణేష్ ఓపెన్ అయ్యాడు.

34
పవన్ - బండ్ల గణేష్ అనుబంధం - సినిమాలు
Image Credit : our own

పవన్ - బండ్ల గణేష్ అనుబంధం - సినిమాలు

హాస్య నటుడిగా పలు చిత్రాల్లో నటించిన బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్‌పై ఉన్న అమితమైన అభిమానంతో ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పతాకంపై సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ (2012) చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిపోయారు. ఆ తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్‌లో ‘గోపాల గోపాల’ (2015) వంటి విజయవంతమైన చిత్రం వచ్చింది.

44
అభిమానుల్లో జోష్ నింపుతూ..
Image Credit : our own

అభిమానుల్లో జోష్ నింపుతూ..

సభల్లో మైక్ ముందు నిలబడినప్పుడు "ఈశ్వరా.. పవనేశ్వరా!" అంటూ పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా పూజించే బండ్ల గణేష్ మాటలు పవన్ అభిమానుల్లో విపరీతమైన జోష్ నింపుతాయి. పవన్ కళ్యాణ్ సాధించిన విజయాల వెనుక, ఆయన రాజకీయ ప్రయాణంలోనూ బండ్ల గణేష్ ఎప్పుడూ ఒక స్ట్రాంగ్ సపోర్టర్ గా నిలుస్తూ వస్తున్నారు. వీరిద్దరి బంధం కేవలం ఒక నటుడు-నిర్మాత సంబంధానికే పరిమితం కాకుండా అంతకు మించి నిలిచింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
Jabardasth: మెగాస్టార్ నే మెప్పించిన జబర్దస్త్ కమెడియన్, ఒక్క ఏడాది 8 సినిమాలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved