MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rakul Wedding Pics: ప్రియుడిని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్..చూడ ముచ్చటగా జంట, ఫోటోలు వైరల్

Rakul Wedding Pics: ప్రియుడిని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్..చూడ ముచ్చటగా జంట, ఫోటోలు వైరల్

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి టాప్ స్టార్స్ తో నటించింది. కొంతకాలం రకుల్ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 21 2024, 09:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి టాప్ స్టార్స్ తో నటించింది. కొంతకాలం రకుల్ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది. కానీ ఒక్కసారిగా ఆమెకి అవకాశాలు పడిపోయాయి. బాలీవుడ్ లో కూడా రకుల్ కి కలసి రాలేదు.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడింది. గోవాలో వీరిద్దరి పెళ్లి వేడుక నేడు అంగరంగ వైభవంగా జరిగింది. సాంప్రదాయ వస్త్ర ధారణలో రకుల్, జాకీ భగ్నానీ మెరిసిపోతున్నారు. 

310

వీళ్లిద్దరి వెడ్డింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకుల్ పింక్ కలర్ లెహంగాలో ఎంతో అందంగా ముస్తాబైంది. నవ వధూవరులు ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ పెళ్లి పీటలపై ఉన్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో రకుల్ వివాహం గ్రాండ్ గా జరిగింది. 

410

పెళ్లి అనంతరం రకుల్, జాకీ భగ్నానీ మీడియా ముందు కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. రకుల్ పై జాకీ భగ్నానీ ముద్దులు కురిపిస్తున్నాడు.  బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉంది. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ షిప్ ని అఫీషియల్ గా ప్రకటించారు.

510

రకుల్, జాకీ భాగాన్ని తమ పెళ్లి వేడుక కోసం ఐటిసి గ్రాండ్ గోవా రిసార్ట్ ని ఎంచుకున్నారు. ఈ లగ్జరీ రిసార్ట్ మొత్తం 45 ఎకరాల్లో ఉంటుంది. మొత్తం 246 రూమ్స్ రూమ్స్ ఉన్నాయట. ఒక్కో రూమ్ రెంట్ 19 వేల నుంచి 75 వేల వరకు ఉంటుందని  చెబుతున్నారు. 

610

బీచ్ పక్కనే ఎంతో అందంగా ఈ రిస్టార్ ని నిర్మించారు. ఇండియా పోర్చుగీస్ విలేజ్ స్టైల్ లో రిసార్ట్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. రిసార్ట్ నుంచి నేరుగా బీచ్ లొకేషన్ కి వెళ్లొచ్చు. 

 

710

మొత్తంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చాలా గ్రాండ్ గా.. ఎలాంటి పొల్యూషన్ కి తావులేకుండా జరిగింది. చాలా మంది నటీమణులు 35 ప్లస్ అయినప్పటికీ వివాహానికి దూరంగా ఉన్నారు. 

810

కానీ రకుల్ 33 ఏళ్ళ వయసులో తన ప్రియుడిని పెళ్లాడింది. రకుల్ వివాహం తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగించనుంది. రకుల్, జాకీ భగ్నానీ వెడ్డింగ్ కోసం ముగ్గురు డిజైనర్లు పనిచేశారు. 

910

సబ్యసాచి, తరుణ్ తహిల్యాని, మనీష్ మల్హోత్రా ఇలా ముగ్గురు డిజైనర్లు రెడీ చేసిన వస్త్రాలు ధరించి రకుల్, జాకీ కనిపించారు.   రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. 

1010

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం కొన్ని చిత్రాలకు కమిటై ఉంది. వెడ్డింగ్ తర్వాత రకుల్, జాకీ భగ్నానీ జంట హనీ మూన్ కి వెళ్లనున్నట్లు సమాచారం. తిరిగి వచ్చిన అనంతరం రకుల్ తన చిత్రాలతో బిజీ అవుతుంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Female Lead Movies: 2026లో బాక్సాఫీస్‌ను దున్నేయనున్న హీరోయిన్లు వీరే.. ఈ ఐదుగురిదే హవా!
Recommended image2
Sushmita: ఉపాసన చేసే వంటలపై సుస్మిత కొణిదెల కామెంట్‌.. తన పిల్లలు మాత్రం వదిలిపెట్టరట
Recommended image3
Bhagyaraj Movies: భాగ్యరాజ్ సినిమాల్లోని 7 జీవిత సత్యాలు.. ఇవి పాటిస్తే చాలు లైఫ్‌ మొత్తం బిందాస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved