MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pushpa: ఎట్టకేలకు 'పుష్ప' సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి.. పాన్ ఇండియా సూపర్ హిట్ కి కారణం ఇదే

Pushpa: ఎట్టకేలకు 'పుష్ప' సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి.. పాన్ ఇండియా సూపర్ హిట్ కి కారణం ఇదే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 21 2022, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మాస్ మ్యానరిజమ్స్, ఎర్రచందనం స్మగ్లర్ గా నటన ప్రతి అంశం హిందీ ప్రేక్షకులని మెప్పించాయి. 

26

దీనితో హిందీలో పుష్ప మూవీ సాలిడ్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇండియా మొత్తం ప్రేక్షకులు పుష్ప పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 2 ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. పుష్ప చిత్రం పెద్ద విజయం సాధించినప్పటికీ ఇందులోని లోపాలని క్రిటిక్స్ ఎత్తి చూపారు. 

36

ముఖ్యంగా పుష్పలో బిజియం తీవ్రంగా నిరాశపరిచింది. అలాంటి లోపాలు ఉండకుండా పుష్ప 2 కోసం సుకుమార్ పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు. ఇదిలా ఉండగా సుకుమార్ క్రియేటివిటీ అంటే దర్శకధీరుడు రాజమౌళికి కూడా చాలా ఇష్టం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ పుష్ప చిత్రం నార్త్ లో అంత పెద్ద హిట్ కావడానికి అసలైన సీక్రెట్స్ రివీల్ చేశారు. 

46

రాజమౌళి మాట్లాడుతూ.. పుష్ప అనేది ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో కొన్ని లోపాలు ఉండొచ్చు. కానీ సుకుమార్ క్రియేటివిటీని ఎవరూ ప్రశ్నించలేరు. ఇలాంటివి చేయడంలో సుకుమార్ మాస్టర్. ఈ చిత్ర విజయానికి మొదటి కారణం సుకుమారే. 

 

56

ఇక రెండవ కారణం వచ్చేసి హీరో క్యారెక్టరైజేషన్. చాలా కాలంగా హిందీలో సాఫ్ట్ మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్ వస్తున్నాయి. ఒక్కసారిగా పుష్ప లాంటి మాస్, రస్టిక్ క్యారెక్టర్ తగలడంతో హిందీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అని రాజమౌళి తెలిపారు. పుష్ప పాన్ ఇండియా హిట్ కి రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఇవే. 

66

పుష్ప చిత్రంలో సుకుమార్ చాలా గమ్మతైన పాత్రలని క్రియేట్ చేశారు. కమెడియన్ సునీల్ ని విలన్ గా చూపించడం.. అనసూయని నెగిటివ్ రోల్ ప్రజెంట్ చేయడం.. మెయిన్ విలన్ గా మలయాళీ నటుడు ఫహద్ ఫజిల్ తో ప్రయోగం చేయడం ఈ చిత్రానికి బాగా కలసి వచ్చాయి. పుష్ప 2 లో వీరందరికి.. అల్లు అర్జున్ కి మధ్య పోరాటం ఏ స్థాయిలో ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి
Recommended image2
Sangeetha Vijay: విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా? ఆమె వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Recommended image3
Celebrity Weddings: రష్మిక-విజయ్ నుంచి సమంత- రాజ్ వరకు.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన 7 సౌత్ స్టార్ జంటలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved