MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT: థియేటర్స్ లో యావరేజ్, ఓటీటీలో మాత్రం దున్నేస్తున్న పృథ్వీరాజ్ సినిమా.. వారణాసి విలన్ అదరగొట్టడయ్యా

OTT: థియేటర్స్ లో యావరేజ్, ఓటీటీలో మాత్రం దున్నేస్తున్న పృథ్వీరాజ్ సినిమా.. వారణాసి విలన్ అదరగొట్టడయ్యా

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఐ నోబడి మూవీ ఓటీటీలో దుమ్ములేపుతోంది. ఈ సినిమా థియేటర్స్ లో జస్ట్ యావరేజ్ గా మాత్రమే ఆడింది. ఓటీటీలో ఇంతటి క్రేజీ రెస్పాన్స్ కి కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 03 2026, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
I Nobody
Image Credit : Asianet News

I Nobody

మలయాళం క్రేజీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ విలక్షణ నటనతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. దర్శకుడిగా కూడా రాణిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు వారణాసి మూవీలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై, పృథ్వీరాజ్ పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
థియేటర్స్ లో యావరేజ్
Image Credit : Asianet News

థియేటర్స్ లో యావరేజ్

ఇదిలా ఉండగా పృథ్వీరాజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఐ నోబడీ జూలైలో విడుదలైన జస్ట్ యావరేజ్ గా నిలిచింది. సాధారణంగా మలయాళీ థ్రిల్లర్ సినిమాలు బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అయితే ఐ నోబడి మాత్రం థియేటర్స్ లో జస్ట్ యావరేజ్ గా నిలిచింది. దీనికి కారణం సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కథ బాగా స్లో అవుతుంది.

35
ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్
Image Credit : Asianet News

ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్

అయితే ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, పృథ్వీరాజ్ పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇటీవల ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయింది. జనాలు ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు. ఓటీటీలో ఊహకందని రెస్పాన్స్ దక్కుతోంది. కామన్ మాన్ సిస్టమ్ కి వ్యతిరేకంగా చేసే పోరాటానికి ఓటీటీలో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు.

45
కథ ఏంటంటే
Image Credit : Asianet News

కథ ఏంటంటే

రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. భార్య పిల్లలతో జీవిస్తుంటాడు. రాజీవ్, అతని భార్య మధ్య విభేదాలు ఉంటాయి. కుటుంబ సమస్యల్లో ఉన్న రాజీవ్ అనుకోకుండా ఒక బ్యాంక్ దోపిడీ వ్యవహారంలో చిక్కుకుంటాడు. దోపిడీ చేసిన వాళ్ళు అందరూ యాక్సిడెంట్ లో మరణిస్తారు. వాళ్ళు దోచిన 17 కోట్లు మాత్రం అదృశ్యం అవుతాయి. దీనితో ప్రజలు, మీడియా, పోలీసులు, రాజకీయ నాయకులు, ముఠాలు అంతా రాజీవ్ వద్దే ఆ డబ్బు ఉన్నట్లు అనుమానిస్తారు.

55
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
Image Credit : E4 Entertainment

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ వ్యవహారం వల్ల అతడి కుటుంబం ప్రశాంతత కోల్పోతుంది. తన వద్ద డబ్బు లేదు అని నిరూపించుకోవడానికి, కుటుంబాన్ని కాపాడుకోవడానికి రాజీవ్ ఎలాంటి పథకం రచించాడు ? ఎలా పోరాడాడు ? అసలు ఆ డబ్బు ఏమైంది ? అనే విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ మూవీలో పృథ్వీరాజ్ భార్యగా నటి పార్వతి తిరువోతు నటించింది. ఆమె పెర్ఫార్మెన్స్ కూడా బావుంది. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ సినిమాలు కోరుకునేవారు అస్సలు మిస్ కాకుండా చూడండి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు ఆల్మోస్ట్ కన్ఫర్మ్, రాజకీయం చేసి తప్పించారు..నిర్మాత కొడుకు కామెంట్స్
Recommended image2
అమల నుంచి కనక వరకు 90ల్లో ఓ వెలుగు వెలిగి.. సడెన్‌గా మాయమైన టాప్ 5 హీరోయిన్లు
Recommended image3
Mahesh Babu: షర్ట్ వెనుక సిక్స్ ప్యాక్ ఉందంటగా.. సమంత చిలిపి ప్రశ్నకు మహేష్ బాబు పంచ్ కౌంటర్.. ఇచ్చిపడేశాడుగా!
Related Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved