MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్-అనుష్క, విశాల్ - త్రిష.. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరో, హీరోయిన్లు ఇంకెవరున్నారంటే..?

ప్రభాస్-అనుష్క, విశాల్ - త్రిష.. 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరో, హీరోయిన్లు ఇంకెవరున్నారంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యా చిలర్లకు కొదవ లేదు. అందులోనూ.. ఏజ్ బార్ అవుతున్న  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ మాత్రం పెరుగుతూనే ఉంది.  40 ఏళ్లు దాటినా.. పెళ్లీ ఊసెత్తని తారలు ఎంతో మంది ఉన్నారు. ఈ విషయంలో హీరోలకు పోటీ ఇస్తున్నారు హీరోయిన్లు.  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : May 09 2024, 05:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బద్రం బీకేర్ ఫుల్ బ్రదరు.. బ్యాచిలర్ లైఫ్ బెటరు అంటూ స్టార్ హీరోలు, హీరోయిన్లు పాడుకుంటున్నారు. సోలోగా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నారు. గతంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే సల్మాన్ ఖాన్ పేరు మాత్రమే వినిపించేది. కాని ఇఫ్పుడు ఇలా చాలామంది తయారయ్యారు. అందులో మన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్ళి గురించి ప్యాన్స్ బాధపడుతున్నారు. 44 ఏళ్ళు వచ్చినా ప్రభాస్ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. ప్రస్తుతం 6 పాన్ ఇండియా సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి అవి కంప్లీట్ అయ్యే వరకూ ప్రభాస్ కు 50 ఏళ్ళు దాటడం ఖాయం.. ఇంక ప్రభాస్ పెళ్ళి గురించి ఫ్యాన్స్ మర్చిపోవాల్సిందేనేమో..

కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

27

ఒకప్పుడు 20 ఏళ్ళ లోపు పెళ్ళి చేసేవారు.. అది కాస్తా ఆతరువాత 30 కి చేరింది. ఇప్పుడు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదు. బ్యాచిలర్ హీరో అంటే ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి సల్మాన్ ఖాన్. ఈయన ఇండస్ట్రీలో బ్యాచిలర్ల సంఘానికి అత్యక్షుడు.. 60 ఏళ్లు వస్తున్నాయి సల్మాన్ కు.. కాని ఇంత వరకూ పెళ్ళి చేసకోలేదు. ఇక చేసుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. 

 

ప్రభాస్ అమ్మగారికి బాగా ఇష్టమైన సినిమా ఏదో తెలుసా..? కొడుకుని ఆ సినిమాలో చూసి మురిసిపోయిందట స్టార్ మదర్..

37

నాలుగు పదులు దాటినా పెళ్లి గురించి ఆలోచించని తారల్లో హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో మొదట చెప్పుకోవల్సింది అనుష్క గురించే. స్టార్ హీరోయిన్ గా వెలిగిన అనుష్క శెట్టి.. అరుంధతి సినిమాతో తరాలు పాటు గుర్తుంచుకునేలా చేసింది. ఇక ఆమె వయస్సు 42 అయినా పెళ్ళి గురించి క్లారిటీ ఇవ్వడంలేదు. రూమర్లయితే చాలా వస్తున్నాయి.. ముఖ్యంగా ప్రభాస్ తో ప్రేమలో ఉంది. రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఫారెన్ లో ఇల్లు కూడా కొన్నారు అని అన్నారు. కాని క్లారిటీ లేదు. వీరి పెళ్లి కూడా చేశారు గ్రాఫిక్స్ లో.. 

సందీప్ కిషన్‌కు తల్లిగా ప్రభాస్ హీరోయిన్, షాకింగ్ న్యూస్ లో నిజమెంత..?

47
Vishal Quit Smoking

Vishal Quit Smoking

ఇండస్ట్రీలో మరో మోస్ట్ బ్యాచిలర్ హీరో విశాల్. తమిళంలో స్టార్ హీరోగా మారిన ఈ తెలుగు కుర్రాడు.. 46 ఏళ్ళు వచ్చినా..ఇంకా పెళ్ళి పీటలు ఎక్కలేదు. కాని ఓ రెండు సార్లు ఎంగేజ్మెంట్ వరకూ వెళ్ళాడు.. ఓ లవ ఫేల్యూర్స్ ను ఫేస్ చేశాడు. ఇలా ముచ్చటగా మూడు సార్లు పెళ్లి ఆగిపోయి.. ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ నుఎంజాయ్ చేస్తున్నాడు. పెళ్ళెప్పుడు బాబు అని అడిగితే.. ప్రభాస్ చేసుకున్నాక చేసుకుంటాను అంటున్నాడు. కోలీవుడ్ సమాచారం ప్రకారం.. అక్కడ నిర్మిస్తున్ననడిగర్ సంఘ భవన నిర్మాణం తరువాత విశాల్ పెళ్లి చేసుకుంటాడట.

హేమమాలిని డెలివరీ కోసం 100 రూమ్స్ బుక్ చేసిన ధర్మేంద్ర.. చాలా ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్..

57
Actress Trisha

Actress Trisha

హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్ త్రిష. నాలుగుపదుల వయస్సుల దాటినా.. కుర్ర హీరోయిన్లను మించిన అందంతో అద్భుతం చేస్తోంది త్రిష కృష్ణన్. గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న త్రిష.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. గతంలో ఓ బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్ చేసి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న త్రిష.. సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు.
 

ప్రభాస్ అంటే త్రిషకు అంత ఇష్టమా..? రెబల్ స్టార్ కోసం 20 రోజులు వర్షంలో తడిచిన బ్యూటీ..?

67

నాలుగు పదులు దాటినా పెళ్ళి ఊసు ఎత్తడం లేదు హీరో తరుణ్. ఒక్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తో దూసుకుపోయిన ఈ హీరో.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. అవకాశాలు లేక.. రాక.. టాలీవుడ్ ను వదిలి ప్రస్తుతం తన ఫ్యామిలీ బిజినెస్ లు చేసుకుంటూ.. గడిపేస్తున్నాడు.  అప్పుడప్పుడు మాత్రం నేను ఉన్నా అని కనిపిస్తుంటాడు. ఈ హీరో కూడా ఇంత వరకూ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

77

మెస్ట్ ఎలిజిబుల్ హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్  నగ్మ గురించి మాట్లాడుకోవాలి.. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. సౌత్.. నార్త్ హీరోలతో నటించి మెప్పించింది. కాని ఈ ముద్దు గుమ్మ 50 ఏళ్లు దాటినా పెళ్ళి చేసుకోలేదు. ఇక పెళ్ళి ఊసెత్తని హీరోయిన్లలో టబు కూడా ఒకరు. గ్లామర్ హీరోయిన్ గా 90స్ లో వెండితెరను ఒక ఊపుఊపేసిన ఈ తార.. ప్రస్తుతం గ్లామర్ కలిగిన క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. కాని 52 ఏళ్ళు వచ్చినా పెళ్ళి మాత్రం చేసుకోలేదు. వీళ్లే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏజ్ బార్ అవుతున్నా పెళ్లిళ్లు చేసుకోని తారలు చాలా మంది ఉన్నారు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, గ్రేట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి.. ఒకప్పటి అందాల తార, క్లాసికల్ డాన్సర్ శోభన కూడా పెళ్ళి చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
టబు
త్రిష
అనుష్క శెట్టి

Latest Videos
Recommended Stories
Recommended image1
50 లక్షల బడ్జెట్, 120 కోట్ల కలెక్షన్స్, సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Recommended image2
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Recommended image3
Theatre Movies: ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు.. శ్రీవిష్ణు మళ్లీ వస్తున్నాడు, వరలక్ష్మి ప్రయోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved