MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • చిరంజీవి పిస్తోల్‌ తీసుకుని ఎక్కుపెట్టుకున్న పవన్‌.. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?.. అన్‌స్టాపబుల్‌ ప్రోమో ఔట్‌

చిరంజీవి పిస్తోల్‌ తీసుకుని ఎక్కుపెట్టుకున్న పవన్‌.. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?.. అన్‌స్టాపబుల్‌ ప్రోమో ఔట్‌

పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్న `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే2` ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో పవన్‌ పెళ్లిళ్ల మ్యాటర్‌పై అలాగే, అన్నయ్య పిస్తోల్‌ తీసుకుని కాల్చుకునే పరిస్థితిపై ఓపెన్‌ కావడం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 27 2023, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలకృష్ణ హోస్ట్ గా రన్‌ అవుతున్న పాపులర్‌ టాక్‌ షో `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే`. ప్రస్తుతం సెకండ్‌ సీజన్‌ రన్‌ అవుతుంది. టాప్‌ స్టార్స్, రాజకీయ నాయకులు ఇందులో పాల్గొని సందడి చేస్తున్నారు. ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. అంతకు ముందు ప్రభాస్‌ ఈ షోలో పాల్గొనగా, ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఆయన ఎపిసోడ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్లింప్స్ విడుదల కాగా, ఆద్యంతం ఆకట్టుకుంది. వైరల్‌ అయ్యింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. వైరల్‌ అవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇందులో పవన్‌ ఎంట్రీతో మొదట బాలయ్య.. ఈశ్వరా.. పవనేశ్వర అంటూ ఆయనకు వెల్‌కమ్ చెప్పారు. దీనికి పవన్‌ స్పందిస్తూ, `మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు..` అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత `గుడుంబా శంకర్‌` చిత్రంలో ప్యాంట్‌ మీద ప్యాంట్ వేశాం. పాతికేళ్లు తగ్గావ్‌ తెలుసా అమ్మా అలా చేస్తే.. ` అని బాలయ్య చెప్పడం నవ్వులు పూయించింది. 
 

36

ఆ తర్వాత మనం ఫస్ట్ టైమ్‌ ఎక్కడ కలిశామో తెలుసా అమ్మా మీకు.. అని బాలయ్య చెప్పగా స్క్రీన్‌పై ఫోటో వచ్చింది. ఆ ఫోటోని చూపిస్తూ `కుర్రాడిలా ఉన్నాను కదా`, అంటే ఇప్పటికీ అలానే ఉన్నారని పవన్‌ చెప్పారు నవ్వులు పండించింది. `ఓ సారి త్రివిక్రమ్‌ మీ దగ్గరికి కథ చెప్పాల్సి వచ్చినప్పుడు.. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా అమ్మా..` అని బాలయ్య అంటే `ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చిందని పవన్‌ చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది. ఎంతో క్లోజ్‌ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్‌పై పవన్‌ అలా కామెంట్‌ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. 
 

46

ఆ తర్వాత బ్రదర్‌ సరదాగా సాయంత్రం పూట.. అని బాలయ్య అంటే 4 తర్వాతనా, 6 తర్వాతనా అని పవన్‌ రియాక్ట్ అవ్వడంతో బాలయ్య నవ్వాపుకోలేకపోయారు. `రామ్‌చరణ్‌ ఎలా క్లోజ్‌ అంటే.. `చిన్నప్పుడు నాకు వీళ్ల డ్యూటీ ఉండేది. నాగబాబు నిర్మాతగా ఉండేవాడు కాబట్టి నేను ఒక్కడినే ఇంట్లో దొరికిపోయేవాడిని. అలా పిల్లలతో క్లోజ్‌ అవ్వాల్సి వచ్చింది` అని పవన్‌ తెలిపారు. అంతలోనే చరణ్‌కి పోన్‌ చేసి, `ఏమయ్యా ఫిట్టింగ్‌ మాస్టారూ`, అంటూ రామ్‌చరణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు బాలయ్య.  

56

అంతేకాదు `ఇప్పుడు మీ అమ్మ అంటే భయమా, మీ ఆవిడంటే భయమా?` అని ప్రశ్నించగా నవ్వులు చిందించారు పవన్‌. ఇంతలోనే సాయిధరమ్‌ తేజ్‌ ఎంట్రీ ఇచ్చారు. హర్రర్‌ సినిమాకి, అమ్మాయిలకు తేడా లేదండీ అని చెప్పడం విశేషం. ఉందా ఇంటికెళ్లాక బడిత పూజేనా అని బాలయ్య అనగా, కొద్దిగా అంటూ పవన్‌ నవ్వడం విశేషం. దీనికి సాయిధరమ్‌ రియాక్ట్ అవుతూ, ఆఖరికి అమ్మాయిలను ఎలా గౌరవించాలో కూడా నేర్చించారు అని, అనగా, ఆ ఏందీ అంటూ పవన్ రియాక్ట్ కావడం మరింత ఆకట్టుకుంది. 
 

66

పెళ్లిళ్ల గొడవేంటి బయ్యా.. అని బాలయ్య అడగా.. వాళ్లు బాధపడతారేమో అని చెప్పి, నా విజ్ఞత, సంస్కారం మాట్లాడకుండా ఆపేస్తుంది. ఇంత మానసిక సంఘర్షణకు గురైన పవన్‌ పవర్‌ స్టార్‌ ఎలా అయ్యాడు.. అని బాలకృష్ణ ప్రశ్నించగా, అన్నయ్యరూమ్‌కి వెళ్లి పిస్టోల్‌ తీసుకుని ఎక్కు పెట్టుకున్నానని చెప్పడం షాకిస్తుంది. పవన్‌ ఎపిసోడ్‌ రెండు పార్ట్ లుగా ప్రసారం కానుంది. మొదటి పార్ట్ ఫిబ్రవరి 3న ప్రసారం చేయబోతున్నట్టు తెలిపారు. ఇది `ఆహా`లో స్ట్రీమింగ్‌ కానుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image3
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved