MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హిట్‌ కోసం అన్న మెగాస్టార్‌ బాటలో తమ్ముడు పవర్‌ స్టార్‌.. వర్కౌట్‌ అయితే ఇండస్ట్రీ షేకే ?

హిట్‌ కోసం అన్న మెగాస్టార్‌ బాటలో తమ్ముడు పవర్‌ స్టార్‌.. వర్కౌట్‌ అయితే ఇండస్ట్రీ షేకే ?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ చూడబోతుంటే హిట్‌ కోసం అన్న మెగాస్టార్ ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. 25ఏళ్ల క్రితం అన్న చిరు చేసిందే, ఇప్పుడు తమ్ముడు పవన్‌ చేయబోతున్నారనే టాక్‌ టాలీవుడ్‌లో ఊపందుకుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 21 2022, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)కి ఇటీవల సరైన హిట్‌ లేవు. `వకీల్‌సాబ్‌`, `భీమ్లా నాయక్‌` యావరేజ్‌ సినిమాలుగానే మిగిలిపోయాయి. `భీమ్లా నాయక్‌` హిట్‌ టాక్‌ వచ్చినా, బాక్సాఫీసు వద్ద వీకెండ్‌లోనే డీలా పడిపోయింది. ఫ్యాన్స్ మూవ్‌మెంట్స్ లేవనే టాక్‌  వినిపించింది. పవన్‌ సరైన హిట్‌ చూసి 9ఏళ్లు అవుతుంది. `అత్తారింటికి దారేదీ` ఆయనకు దక్కిన చివరి విజయం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

`వకీల్‌సాబ్‌`, `భీమ్లా నాయక్‌` సినిమాలు రీమేక్‌లు. దీంతో అవి ఫర్వాలేదనిపించుకున్నాయి. కానీ స్ట్రెయిట్‌గా హిట్‌ రాక చాలా రోజులవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన `హరిహర వీరమల్లు`(HariHara VeeraMallu) చిత్రంలో నటిస్తున్నారు. హిస్టారికల్‌ నేపథ్యంలో రాబోతున్న చిత్రమిది. ఈ చిత్రంపై అనేక రకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీని ఫలితాన్ని ఊహించడం కష్టమే. విడుదలై సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకునేంత వరకు ఈ సినిమా రిజల్ట్ ని ఊహించడం కష్టం. 

37

దీంతో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఇప్పుడు ఆశలన్నీ హరీష్‌ శంకర్‌ (Harish Shankar) చిత్రంపై ఉంది. హరీష్‌ శంకర్‌తో పవన్‌ `భవదీయుడు భగత్‌ సింగ్‌` Bhavadeeyudu Bhagath Singh) చిత్రం చేయబోతున్నారు. ఈ సినిమాకి తాలుకూ ఫస్ట్ లుక్‌ కూడా వచ్చింది. బైక్‌పై పవన్‌ టీ తాగుతూ, గన్‌ పట్టుకుని ఉన్న ఓ పోస్టర్‌, అలాగే బైక్‌పై పుస్తకంతో మరో పోస్టర్‌ ఉంది. ఈ పోస్టర్స్  ఆసక్తిని రేకెత్తించాయి. బుక్కే కాదు, గన్‌ కూడా పట్టుకుంటాడనే అర్థంలో హరీష్‌ శంకర్‌ ఈ పోస్టర్స్ డిజైన్‌ చేశాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ చిత్రం నుంచి లేటెస్ట్ అప్‌డేట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అదే ఇప్పుడు గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది.

47

`భవదీయుడు భగత్‌సింగ్‌` చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ పాత్ర అప్‌డేట్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తుంది. ఇందులో పవన్‌ ప్రొఫెసర్‌ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్‌ శంకర్‌ స్వయంగా రివీల్‌ చేశారనే టాక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పవన్‌ పాత్ర సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతుందట. పవన్‌ ఇప్పటికే స్టూడెంట్‌గా, పోలీస్‌గా, లాయర్‌గా నటించారు. కానీ ప్రొఫెసర్‌ రోల్‌ చేయడం ఆయన కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్‌. దీంతో అది ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. 

57

అయితే చిరంజీవి(Chiranjeevi) కూడా తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ `మాస్టర్‌` (Master) చిత్రంలో లెక్చరర్‌ రోల్‌ చేశాడు. అంతకు ముందు పెద్దగా సక్సెస్‌ లేని చిరుకి `మాస్టర్‌` సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. చిరుకి కెరీర్‌ పరంగా పెద్ద బూస్ట్ నిచ్చింది. 25ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎంతటి పెద్ద విజయం సాధించిందో, పవన్‌ నటించబోతున్న `భవదీయుడు భగత్‌ సింగ్‌` మూవీ అంతకు మించిన విజయం సాధిస్తుందని అంటున్నారు నెటిజన్లు. 

67

అంతేకాదు  చిరంజీవి మరో సినిమా `ఠాగూర్‌`, బాలయ్య లెక్చరర్‌గా చేసిన `సింహా`, విజయ్‌ దేవరకొండ లెక్చరర్‌గా చేసిన `గీత గోవిందం` చిత్రాలు బ్లాక్‌బస్టర్‌  అయ్యాయి. ఇదే సెంటిమెంట్‌ పవన్‌కి వర్కౌట్‌ అయితే దుమ్ములేచిపోవడం ఖాయమే. ఈ క్రమంలోనే హిట్‌ కోసం పవన్‌.. అన్నయ్య మెగాస్టార్‌ దారిలోనే పయణిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. మరి ఇది నిజంగానే వర్కౌట్‌ అయితే ఇండస్ట్రీ షేక్‌ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

77

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ లో ప్రారంభం కానుందని సమాచారం. పూజాహెగ్డే కథానాయికగా నటించనుంది. `గబ్బర్‌ సింగ్‌` తర్వాత హరీష్‌ శంకర్‌, పవన్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇది. `గబ్బర్‌ సింగ్‌` ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. చాలా గ్యాప్‌తో వీరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి, భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు పవన్‌, అలాగే సముద్రఖని దర్శకత్వంలో ఓ తమిళ రీమేక్‌ చేయబోతున్నట్టు టాక్. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
National Awards: అత్యధిక నేషనల్ అవార్డులు గెలిచిన 9 మంది స్టార్స్ వీళ్లే.. టాప్‌లో మన సౌత్ యాక్టర్
Recommended image2
Sai Pallavi: సీత పాత్ర చేయాలంటే సాయి పల్లవి ఎంత భయపడిందో తెలుసా? చివరకు ఏం చేసిందంటే?
Recommended image3
Instagram followers : ఇన్‌స్టాలో హవా ఎవరిది? ప్రియాంక నుంచి శ్రద్ధా వరకు, ఎవరి ఫాలోవర్లు ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved