MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?

OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?

OTT: ఓటీటీలో మలయాళ సినిమాలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. డిఫరెంట్ స్టోరీ, గట్టి స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలకు పరభాషా ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. అందుకే చాలా మలయాళ సినిమాలు డబ్ అయి ఓటీటీలోకి వస్తున్నాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 17 2026, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మలయాళ సినిమాలకు పెరిగిన క్రేజ్..
Image Credit : Ini Utharam Trailer

మలయాళ సినిమాలకు పెరిగిన క్రేజ్..

ఓటీటీలో మలయాళ సినిమాలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. డిఫరెంట్ స్టోరీ, గట్టి స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలకు పరభాషా ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. అందుకే చాలా మలయాళ సినిమాలు డబ్ అయి ఓటీటీలోకి వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా
Image Credit : Ini Utharam Trailer

అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా

ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా 'ఇని ఉత్తరం' (Ini Utharam). సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదిరిపోయే ట్విస్టులతో క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కు ఈ సినిమా మంచి ట్రీట్ ఇస్తుంది.

36
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
Image Credit : Ini Utharam Trailer

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా

2020లో రిలీజైన ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో గట్టిగా సౌండ్ చేస్తోంది. ఆ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి అనే డాక్టర్ ఒకరోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి, తానొక మర్డర్ చేశానని చెప్తుంది. కానీ పోలీసులు ఆమె మాటలను సీరియస్‌గా తీసుకోరు. మీడియా వాళ్లు ప్రశ్నిస్తే, జానకికి మతిస్థిమితం లేదని పోలీసులు కవర్ చేస్తారు. కానీ జానకి తన మాట మీదే నిలబడుతుంది. తాను చంపిన శవాలను పాతేసిన చోటు చూపిస్తానని అంటుంది. ఆమె పోలీసులు, మీడియా వాళ్లను అడవిలోకి తీసుకెళ్తుంది. ఈ వార్త తెలిసి ఊరి జనాలు కూడా అక్కడికి వస్తారు.

46
జానకి ఆరోపణల్లో నిజం ఎంత..?
Image Credit : Ini Utharam Trailer

జానకి ఆరోపణల్లో నిజం ఎంత..?

అక్కడ తవ్వి చూస్తే రెండు శవాలు బయటపడతాయి. దీంతో కేసు సీరియస్ అవుతుంది. కానీ, ఆ తర్వాత జానకి చెప్పే మాట మొత్తం ఇన్వెస్టిగేషన్ దిశనే మార్చేస్తుంది. ఆ ఇద్దరినీ తాను చంపలేదని, ఒక పోలీస్ ఆఫీసరే వాళ్లను చంపాడని ఆమె ఆరోపిస్తుంది.జానకి తన ఆరోపణలకు తగ్గ సాక్ష్యాలను కూడా ఇస్తుంది. దీంతో ఈ విషయం పైఅధికారుల దృష్టికి వెళ్తుంది. ఎస్పీ (SP) డైరెక్ట్‌గా ఎంట్రీ ఇచ్చి దర్యాప్తు మొదలుపెడతారు.

ఇన్వెస్టిగేషన్ వేగవంతం అయ్యేసరికి, ఈ మర్డర్ కేసు వెనుక ఒక మంత్రి హస్తం ఉన్నట్లు బయటపడుతుంది. ఇంతకీ హత్యకు గురైన ఆ ఇద్దరు ఎవరు? వాళ్లకూ జానకికీ సంబంధం ఏంటి? జానకి చెప్తోంది నిజమేనా? పోలీస్ ఆఫీసర్‌పై చేసిన ఆరోపణల్లో నిజం ఉందా? ఇందులో రాజకీయ నాయకుడి పాత్ర ఏంటి? చివరకు అసలు నేరస్థులను ఎలా పట్టుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా మిగతా కథ.

56
అపర్ణా బాలమురళి నటనకు మంచి మార్కులు..
Image Credit : Asianet News

అపర్ణా బాలమురళి నటనకు మంచి మార్కులు..

'ఆకాశం నీ హద్దురా' (Soorarai Pottru) సినిమాతో నేషనల్ లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న అపర్ణా బాలమురళి ఇందులో మెయిన్ రోల్ చేసింది. సుధీష్ రామచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కళాభవన్ షాజోన్, హరీష్ ఉత్తమన్, సిద్ధిక్, చందునాథ్ జి. నాయర్, జాఫర్ ఇడుక్కి, సిద్ధార్థ్ మీనన్ తదితరులు నటించారు. హేశామ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. 'ఖుషి', 'హాయ్ నాన్న' సినిమాల్లో తన మెలోడీ పాటలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన అతను, ఈ సినిమాకు కూడా అద్భుతమైన సంగీతం అందించాడు.

66
ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో చూడొచ్చంటే?
Image Credit : our own

ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో చూడొచ్చంటే?

'ఇని ఉత్తరం' సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్, ఊహించని ట్విస్టులు ఉన్న సినిమాలను ఇష్టపడేవాళ్లు ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ను అస్సలు మిస్ కాకుండా చూడొచ్చు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఓటీటీ
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bathukamma Song : మంగ్లీ స్టైల్లో మరో బతుకమ్మ పాట రెడీ.. ఐదు గంటల్లోనే లక్ష వ్యూస్, యూట్యూబ్ ను షేక్ చేస్తోందిగా
Recommended image2
Parasuram: పూరి, త్రివిక్రమ్ తర్వాత నువ్వే అని ముంచేశారు.. కృతజ్ఞతతో ఆ హీరో తండ్రి పేరే నా కొడుక్కి పెట్టా
Recommended image3
Chiranjeevi Villain: వాచ్‌మన్ నుంచి చిరంజీవి విలన్ వరకు.. ఒక్క దెబ్బకు 10 సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నటుడు
Related Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved