- Home
- Entertainment
- Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్
Surya teja: నటుడిగా మెప్పించి, ఇప్పుడు 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' పుస్తకంతో రచయితగా మారుతున్న `శంభో శివ శంభో` ఫేమ్ సూర్య తేజ్ గారితో ఇంటర్వ్యూ విశేషాలు తెలుసుకుందాం.

రైటర్‌గా మారిన శంభో శివ శంభో నటుడు
ప్రశ్న: 'శంభో శివ శంభో', `వినాయకుడు` లాంటి కల్ట్ క్లాసిక్ తర్వాత, ఇప్పుడు రచయితగా మారుతున్నారు. ఈ కొత్త ప్రయాణం ఎలా అనిపిస్తోంది?
సూర్య తేజ్: చాలా సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 'శంభో శివ శంభో' రీ-రిలీజ్ ఘన విజయం సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు రచయితగా నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఒక మైలురాయిగా భావిస్తున్నాను.
ప్రశ్న: మీ తొలి పుస్తకం 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' గురించి చెప్పండి. దీని ప్రత్యేకత ఏమిటి?
సూర్య తేజ్: నాగపూర్ పవిత్ర "తేక్డి గణపతి" వైభవాన్ని, చరిత్రను పుస్తక రూపంలో నమోదు చేసిన ప్రపంచంలోనే మొదటి రచయితగా నిలవడం నా అదృష్టం. ఇది సంప్రదాయ కథనానికి భిన్నంగా రాసిన పుస్తకం. ఇది కేవలం భక్తి పుస్తకం కాదు, జీవితాన్ని చూసే ఒక ప్రాక్టికల్ దృక్పథం. "గణపతి అంటే జ్ఞానం". ఓర్పు, జ్ఞానంతో సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పే మార్గదర్శి ఇది.
ప్రశ్న: ఈ పుస్తకం ఫస్ట్ లుక్ ఆవిష్కరణ ఎలా జరిగింది?
సూర్య తేజ్: సుచిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ డాక్టర్ లయన్ కిరణ్ గారి చేతుల మీదుగా శ్రేయోభిలాషుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఆయన నా జీవితంలో అత్యంత స్ఫూర్తిదాయక వ్యక్తి, నా మెంటార్. నా రచయిత ప్రయాణం ఆయన చేతుల మీదుగా ఆశీర్వదించబడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
నితిన్ గడ్కరి కోసం పనిచేస్తా - సూర్యతేజ
ప్రశ్న: సోలో హీరోగా మీ సినిమా హిందీ డబ్బింగ్ యూట్యూబ్ లో 11 మిలియన్ వ్యూస్ సాధించింది. మరోవైపు మీరు వ్యాపారవేత్త గా రాణిస్తున్నారు. ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేసుకుంటున్నారు?
సూర్య తేజ్: 'అప్పుడలా ఇప్పుడిలా' చిత్రం ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతూనే, హిందీలో 'పర్ఫెక్ట్ బిజినెస్ మాన్' గా 11 మిలియన్ వ్యూస్ రావడం సంతోషం. సినిమాతో పాటు నేను "శాక న్యోరా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్" కు కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వంతో అధికారికంగా అనుబంధం కలిగి ఉండి, స్కిల్ డెవలప్‌మెంట్, ఉన్నత విద్యా రంగంలో పనిచేస్తున్నాం.
ప్రశ్న: రచయితగా భవిష్యత్తులో మీ తదుపరి ప్రణాళికలు ఏమిటి?
సూర్య తేజ్: కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారితో సన్నిహితంగా ఉంటూ, ఆయన ప్రవేశపెట్టిన దార్శనిక విధానాలను ప్రచారం చేస్తున్నాను. భవిష్యత్తులో రైతులు, గ్రామీణ యువత ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే భారతీయ విధానాలపై మరిన్ని పుస్తకాలను తీసుకురాబోతున్నాను.

