- Home
- Entertainment
- Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Irumudi: రవితేజ హీరోగా నటించిన `ఇరుముడి` మూవీ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాని ఎక్కువ మంది చూశారు. కానీ తక్కువ మందిచూసిన పెద్ది సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇదేం లెక్క అనేది ఆశ్చర్యపరుస్తోంది.

ఇరుముడికి ఆడియెన్స్ బ్రహ్మరథం
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన `ఇరుముడి` మూవీ గత నెల 21న విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లో దుమ్మురేపుతోంది. ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా చూస్తున్నారు. అయ్యప్ప స్వామికి సంబంధించి అంశాలు, వారి భక్తులకు సంబంధించిన కథ కావడం, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీనికితోడు అమ్మాయిలను పెంచడానికి సంబంధించిన అంశాలు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఆడియెన్స్ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.
ఇరుముడికి కోటి 44 లక్షల టికెట్లు సేల్
ఈ మూవీ 25 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.235కోట్లు వసూలు చేసింది. సోమవారం కూడా రెండున్నరకోట్లని రాబట్టింది. రూ.20కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు వంద కోట్ల వరకు లాభాలను అర్జించడం విశేషం. రవితేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవగా, టాలీవుడ్‌లోనే అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ముందు వరుసలో ఈ మూవీ నిలవడం విశేషం. అయితే ఈ సినిమాకి ఇప్పటి వరకు కోటి 44 టికెట్లు తెగాయి(అంత మంది వీక్షించారు). కానీ ఈ మూవీకంటే తక్కువ టికెట్లు తెగిన చిత్రాలకు ఎక్కువ కలెక్షన్లు రావడం ఆశ్చర్యపరుస్తోంది.
పెద్దికి తెగిన టికెట్లు తక్కువ, కానీ కలెక్షన్లు ఎక్కువ
రామ్ చరణ్ హీరోగా నటించిన `పెద్ది` సినిమా సమ్మర్‌లో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు సుమారు రూ. 400కోట్లు. ఈ సినిమాకి కోటి 28లక్షల టికెట్లు తెగాయి. అంటే ఇరుముడి మూవీ కంటే తక్కువే కావడం గమనార్హం. కానీ `ఇరుముడి` మూవీ కంటే డబుల్ వసూళ్లు వచ్చాయి. మరి ఇదెలా జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి మన శంకర వర ప్రసాద్ విషయంలో కూడా సేమ్
ఇదే కాదు చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీ విషయంలోనూ ఇదే జరిగింది. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్ గెస్ట్ గా మెరిసిన విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకి కోటి 23 లక్షల టికెట్లు తెగాయి. కలెక్షన్లు మాత్రం రూ.375కోట్లు వచ్చాయి. ఈ సినిమా విషయంలో కూడా సేమ్ జరిగింది. తక్కువ టికెట్లు తెగితే, ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఇదెలా అనేది ఆసక్తికరంగా మారింది.
అసలు కారణం ఇదే
దీనికి టికెట్ రేట్ల పెంపు కారణం. ఈ రెండు చిత్రాల (పెద్ది, మన శంకర వర ప్రసాద్ గారు)కు మొదటి వారం, పది రోజులు టికెట్ రేట్లు హైక్ ఉన్నాయి. అంటే పది రోజులపాటు టికెట్‌పై 40శాతం ఎక్కువగా వసూలు చేశారు. ప్రీమియర్స్ కి రూ.600 వసూలు చేశారు. మొదటి పది రోజులు సింగిల్ థియేటర్లలో టికెట్‌పై వంద రూపాయలు, మల్టీప్లెక్స్ ల్లో టికెట్‌పై రూ.125 పెంచారు. దీంతో తక్కువ టికెట్లు తెగినా, ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. అదే ఇరుముడికి నార్మల్ రెగ్యూలర్ టికెట్ రేట్లు ఉన్నాయి. అందుకే దానికి ఎక్కువ టికెట్లు తెగినా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. అదే ఇరుముడికి కూడా ఎక్కువ టికెట్ రేట్లు ఉంటే ఇది ఐదు వందల కోట్ల వరకు వెళ్లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

