MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?

Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?

Missing Meghana: మిస్సింగ్‌ మేఘన సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్ము అభిరామి మూవీ ప్రమోషన్స్ కి దూరంగా ఉండటంపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. అసలు జరిగిందేంటో ఓపెన్‌గా బయటపెట్టాడు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 15 2026, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
హీరోయిన్‌తో గొడవపై మిస్సింగ్‌ మేఘన దర్శకుడు క్లారిటీ
Image Credit : Asianet News

హీరోయిన్‌తో గొడవపై మిస్సింగ్‌ మేఘన దర్శకుడు క్లారిటీ

రామ్‌ కార్తిక్‌, అంకిత్‌ కొయ్య, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా వంటి వారు ప్రధాన పాత్రధారులుగా `మిస్సింగ్‌ మేఘన` మూవీ రూపొందింది. వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపి మూవీస్‌, కేడీ అండ్‌ కో బ్యానర్‌ పై పంచుమర్తి నరేష్‌ బాబు నిర్మించారు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు హీరోయిన్‌కి సంబంధించిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. మేఘన పాత్రలో నటించిన అమ్ము అభిరామి ప్రమోషన్స్ కి దూరంగా ఉన్న నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చారు.

దర్శకుడు మాట్లాడుతూ, `చిన్న చిన్న గొడవలు జరగడం ప్రతి సినిమా విషయంలో ఉంటుంది. మా మూవీ విషయంలో కూడా ఉన్నాయి. హీరోయిన్‌కి ఇంకా పారితోషికం పూర్తిగా ఇవ్వలేదు. దీంతో ఆమె ప్రమోషన్స్ కి దూరంగా ఉంది, అదే తప్ప మరో సమస్య కాదు అని తెలిపారు దర్శకుడు. దీనికి హీరో రియాక్ట్ అవుతూ, దర్శకుడు చెప్పింది నిజం కాదని, ఆమె వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉందని, డేట్స్ కుదరక రాలేకపోతుందని వెల్లడించారు.

చిత్ర దర్శకుడు వాచస్పతి ఇంకా మాట్లాడుతూ, `ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థాంక్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం కథ. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన చిత్ర బృందం అందరికీ థాంక్స్. ఈ నెల 18న విడుదల కానున్న మిస్సింగ్ మేఘన సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మిస్సింగ్‌ మేఘన సరికొత్తగా ఉంటుంది. ప్రారంభం నుంచి ఎంగేజ్‌ చేస్తుంది. సినిమాలో మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ మాత్రమే కాదు, మంచి లవ్‌ స్టోరీ ఉంటుంది, అది ఆకట్టుకుంటుంది. ట్విస్ట్ లు, టర్న్ లు చాలానే ఉన్నాయి. థియేటర్‌లో సర్‌ప్రైజ్‌ అవుతారు` అని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
థ్రిల్‌కి గురి చేసే మిస్సింగ్‌ మేఘన
Image Credit : Asianet News

థ్రిల్‌కి గురి చేసే మిస్సింగ్‌ మేఘన

నటుడు రామ్ కార్తీక్ మాట్లాడుతూ, `నా తొలి చిత్రం నుండి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్. ధ్రువన్ పాటలు వల్ల సినిమా ప్రేక్షకులకి బాగా వెళ్ళింది. పాటలు పాడిన గాయకులకు థాంక్స్. నేను గతంలో సినిమా చేయడం మిస్ అయిన అయిన అందరితో కలిసి ఈ సినిమాలో పని చేయడం చాలా సంతోషం అనిపించింది. నాకు బెక్కం వేణు గోపాల్ గారు మంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నా తోటి నటుడు అంకిత్ తో పని చేయడం బాగా అనిపించింది. అమ్ము అభిరామి తో ఇది నా రెండవ సినిమా. దర్శకులు ఈ సినిమాకు చాలా కష్టపడి పని చేశారు. సినిమా కచ్చితంగా ఎంగేజ్‌ చేస్తుంది. థ్రిల్‌కి గురి చేస్తుంది. మాకు మంచి బ్రేక్‌ ఇస్తుందని నమ్ముతున్నా` అని అన్నారు.

నటుడు అంకిత్ కొయ్య మాట్లాడుతూ, `సంవత్సరం తర్వాత మీడియా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఉండటానికి కారణం దర్శకుడు వాచస్పతి గారు, ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేశారు. సినిమాకు పని చేసిన బృందానికి, నిర్మాతలకు థాంక్స్. రామ్ కార్తీక్ తో పని చేయడం చాలా సంతోషం అనిపించింది. మీడియా తలుచుకుంటే ఏం చేయగలదో నా గత సినిమాలకు నేను చూసాను, ఈ సినిమాకు కూడా మీడియా మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను` అని వెల్లడించారు. ఇందులో గెస్ట్ గా నిర్మాత దామోదర ప్రసాద్‌, బెక్కెం వేణుగోపాల్‌తోపాటు ధృవన్‌, సింగర్‌ సాకేత్‌, నటుడు గోపరాజు రమణ వంటి వారు పాల్గొన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image2
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image3
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Related Stories
Recommended image1
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved