MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్, సమంత కలిసి చేసి ఉంటే ఆ మూవీ పరిస్థితి.. సూపర్ స్టార్ క్లారిటీ అదుర్స్..

మహేష్, సమంత కలిసి చేసి ఉంటే ఆ మూవీ పరిస్థితి.. సూపర్ స్టార్ క్లారిటీ అదుర్స్..

చిత్ర పరిశ్రమలో అనేక పరిణామాలు జరుగుతుంటాయి. దర్శకులు ఒక హీరోని అనుకుని కథ రెడీ చేసుకోవడం.. కుదరకపోతే మరొక హీరోతో ఆ మూవీ తీయడం జరుగుతూనే ఉంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 19 2022, 07:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో అనేక పరిణామాలు జరుగుతుంటాయి. దర్శకులు ఒక హీరోని అనుకుని కథ రెడీ చేసుకోవడం.. కుదరకపోతే మరొక హీరోతో ఆ మూవీ తీయడం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలు కథ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. మహేష్ బాబు తన స్క్రిప్ట్స్ ఎంపికలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సెన్సిబుల్ చిత్రాల దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాజాగా 'లైఫ్ ఆఫ్ ముత్తు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. శింబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగులో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. 

36

నాగ ఛైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన 'ఏమాయ చేశావే' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ కథతో యువతని ఈ మూవీ మెప్పించింది. నాగ చైతన్యకి ఇదే ఫస్ట్ హిట్. ఈ కథని ముందుగా మహేష్ బాబుతో చేయాలని గౌతమ్ మీనన్ అనుకున్నారట. 

46

ఈ విషయాన్ని మహేష్ సోదరి మంజుల గారికి చెప్పాను. ఇది లవ్ స్టోరీ కదా.. మహేష్ కి నచ్చుతుందో లేదు అని అనుమానం వ్యక్తం చేశారు. ఒకసారి కథ నేరేట్ చేయండి అన్నారు. దీనితో మహేష్ బాబుకి కథ చెప్పాను. మహేష్ వద్దు అన్నారు. మన కాంబినేషన్ లో సినిమా అంటే భారీగా యాక్షన్ మూవీ అయి ఉండాలి. అలాంటి కథ రెడీ చేయండి చేద్దాం అని అన్నారు. 

56

ఒక వేళ మహేష్ ఈ చిత్రం చేసి ఉంటే 'ఏ మాయ చేశావే' ఇంకా పెద్ద విజయం సాధించి ఉండేది అని గౌతమ్ అన్నారు. దీనితో మహేష్ అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 

66

గౌతమ్ మీనన్ అంచనా తప్పు. ఈ మూవీ మహేష్ సాధించి ఉంటే విజయం సాధించేది కాదు. మహేష్ బాబు నుంచి ఫ్యాన్స్ ఇలాంటి సినిమాలు ఆశించరు. స్లోగా సాగే కథలు మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సెట్ కావు. బ్రహ్మోత్సవం పరిస్థితి చూశాంగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు క్లారిటీని అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మహేష్ అన్న ఈ మూవీ చేసి ఉంటే కనీసం డీసెంట్ మూవీ చేశాడు అనే సంతృప్తి ఉండేది. కానీ ఆ మురుగదాస్ తో స్పైడర్ అనే చెత్త సినిమా చేశాడు అని అంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved