MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దారుణంగా బుక్ అయిన సమంత.... అప్పుడు మహేష్ ని తప్పుబట్టావ్ ఇప్పుడు నిన్ను విజయ్ దేవరకొండ చేసిందేంటీ ?

దారుణంగా బుక్ అయిన సమంత.... అప్పుడు మహేష్ ని తప్పుబట్టావ్ ఇప్పుడు నిన్ను విజయ్ దేవరకొండ చేసిందేంటీ ?

ఒక్కోసారి మన కామెంట్స్ మనకే తిరిగి గుచ్చుకుంటాయి. సమంత విషయంలో అదే జరిగింది. ఎప్పుడో 2013లో ఆమె చేసిన ట్వీట్ కి అడ్డంగా బుక్ అయ్యింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 13 2023, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు వన్ నేనొక్కడినే చిత్రం చేశాడు. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్. ఆమెకు ఇది డెబ్యూ మూవీ. 'హలో రాక్ స్టార్' సాంగ్ లో మహేష్ అడుగు జాడలను హీరోయిన్ కృతి సనన్ చేతులతో తాకుతున్న షాట్ ఉంటుంది. ఈ షాట్ కి సంబంధించిన పోస్టర్స్ విడుదల కాగా, సమంత తప్పుబట్టారు. సదరు పోస్టర్ జోడించి అసహనం వెల్లడించారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

త్వరలో విడుదల కానున్న ఓ చిత్ర పోస్టర్ చాలా అభ్యంతరకరంగా ఉంది. పోస్టర్ లోని పోజు, దాని అర్థం మనోభావాలు దెబ్బతీసేలా ఉందని కామెంట్ పోస్ట్ చేసింది. పరిశ్రమలో అప్పుడే ఎదుగుతున్న సమంత మహేష్ బాబు వంటి స్టార్ ని తప్పుబట్టడం సంచలనమైంది. అప్పటికి సమంత పరిశ్రమకు వచ్చి మూడేళ్లు అవుతుంది.

36
Samantha

Samantha


అంటే మగాళ్లకు ఆడవాళ్లు బానిసలు అన్నట్లు ఆ పోస్టర్ ఉందనేది సమంత భావన. స్త్రీ పురుషులు సమానమే, హీరోయిన్ హీరో కాళ్ళను తాకుతున్నట్లు చూపడమేంటీ? అన్నట్లు ఆమె మాట్లాడారు. అప్పట్లోనే మహేష్ బాబు ఫ్యాన్స్ సమంత మీద మండిపడ్డారు. అది కేవలం సినిమా. పాటలో వచ్చే ఒక సన్నివేశం. దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. 
 

46


ఈ వివాదం జరిగింది పదేళ్లు అవుతుండగా సమంతను మహేష్ అభిమాని బుక్ చేశాడు. ఆమె లేటెస్ట్ మూవీ ఖుషి నుండి ఆరాధ్య అనే సాంగ్ విడుదలైంది. ఈ పాటలో విజయ్ దేవరకొండ సోఫాలో పడుకొని ఉండగా సమంత అతని కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్న షాట్ ఉంది. విజయ్ దేవరకొండ తన కాలితో సమంత చేతిని తాకాడు. 
 

56
samantha

samantha

దీంతో మహేష్ బాబు ఫ్యాన్ ఫైర్ అయ్యాడు. అప్పుడు మహేష్ బాబు సినిమాను ఇదే విషయంలో తప్పుబట్టావు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? ఇది అమ్మాయిలను కించపరచడం కాదా? ఇప్పుడు నీ మనోభావాలు దెబ్బతినలేదా? అంటూ కౌంటర్లు వేస్తున్నాడు. చూస్తుంటే సమంత గతంలో తాను చేసిన కామెంట్ కి అడ్డంగా బుక్ అయ్యారని అర్థమవుతుంది. 

66


కాగా ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. శివ నిర్వాణ దర్శకుడు కాగా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. చాలా గ్యాప్ అనంతరం సమంత ప్రేమకథా చిత్రం చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: 40 ఏళ్ల ప్రయాణంలో.. ఒకే రోజు రెండు అద్భుతాలు, ఏఎన్నార్ ను తలుచుకుని నాగార్జున ఎమోషనల్
Recommended image2
Rashmika Mandanna: రష్మిక మందన్న లో ఈ టాలెంట్ కూడా ఉందా? విజయ్ కట్టిన తాళిలో సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image3
Sobhan Babu: నోరు తెరిస్తే డబ్బు, పరమ పీనాసోడు, పక్కా బిజినెస్ మేన్.. శోభన్ బాబుపై స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved