MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఇది షూటింగ్ కాదు...తెలివిని ప్రదర్శిస్తున్నారా?: విశాల్‌పై హైకోర్టు ఆగ్రహం

ఇది షూటింగ్ కాదు...తెలివిని ప్రదర్శిస్తున్నారా?: విశాల్‌పై హైకోర్టు ఆగ్రహం

 కేసు విచారణలో విశాల్‌ (Vishal) తీరుపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాదనను వినిపించేందుకు గురువారం న్యాయస్థానానికి వెళ్లిన ఆయన్ని ప్రశ్నించింది. 

2 Min read
Author : Surya Prakash
Published : Aug 02 2024, 07:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
vishal

vishal


 
‘‘ఖాళీ పేపర్‌పై మీరెలా సంతకం చేశారు? తెలివిగా సమాధానం చెబుతున్నాననుకుంటున్నారా? ఇదేమీ సినిమా షూటింగ్‌ కాదు.. కాస్త జాగ్రత్తగా బదులివ్వండి’’ అని ఆదేశించారు. తమిళ హీరో  విశాల్‌ (Vishal) తీరుపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సరిగ్గా సమాధానం చెప్పమంటూ ఆదేశించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Vishal

Vishal

  
ప్రముఖ నిర్మాణసంస్థ లైకా పెట్టిన కేసు విచారణలో విశాల్‌ (Vishal) తీరుపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వాదనను వినిపించేందుకు గురువారం న్యాయస్థానానికి వెళ్లిన ఆయన్ని ప్రశ్నించింది. ఇందులోభాగంగా లైకాతో జరిగిన ఒప్పందం గురించి న్యాయమూర్తి ప్రశ్నించగా.. అది తన దృష్టికి రాలేదని.. తాను కేవలం ఒక ఖాళీ కాగితంపై సంతకం చేశానని బదులిచ్చారు. దీనిపై జడ్జ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

36
Vishal

Vishal

 
‘‘పందెంకోడి 2’ విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చారా?’’ అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు ఆయన ఆసక్తి చూపించలేదు. ‘‘ఇలా ప్రవర్తిస్తే కుదరదు. అవును, లేదా కాదు అని సమాధానం చెప్పండి’’ అని మరోసారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన తాను లైకా దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నట్లు అంగీకరించారు. ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

46


కేసు పూర్వపరాల్లోకి వెళితే... విశాల్‌, తమిళంలో  ప్ర‌ముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions)కు మధ్య కొన్నాళ్లకిత్రం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. సినిమా తీస్తాన‌ని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నార‌ని, ఆ డ‌బ్బు తిరిగి చెల్లించ‌లేద‌ంటూ 2022లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. 
 

56
Vishal

Vishal


తొలిసారి జరిగిన వాదనల అనంతరం లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్‌ రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని, తన ఆస్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అప్పటివరకూ ఆయన నటించి, నిర్మించిన సినిమాలేవీ థియేటర్లలో గానీ, ఓటీటీల్లో గానీ విడుదల చేయకూడదంటూ స్టే విధించింది.
 

66
Actor Vishal

Actor Vishal


అయితే, కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించార‌ని, త‌మ‌కు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించ‌కుండానే ఆయ‌న న‌టించి, నిర్మించిన ప‌లు సినిమాల‌ని విడుద‌ల చేశార‌ని విశాల్‌పై లైకా సంస్థ జూన్‌ నెలలో కోర్టు ధిక్క‌ర‌ణ కేసు ఫైల్ చేసింది. కానీ, అప్పుడు సంబంధిత ఆధారాలను ఆ సంస్థ కోర్టుకు చూపించలేకపోయింది. దాంతో, న్యాయస్థానం విచారణను గతంలో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image2
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Recommended image3
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved