MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ రష్మిక మందానపై బ్యాన్? భారీగా నష్టపోనున్న పుష్ప 2 మేకర్స్!

హీరోయిన్ రష్మిక మందానపై బ్యాన్? భారీగా నష్టపోనున్న పుష్ప 2 మేకర్స్!

స్టార్ హీరోయిన్ రష్మిక మందాన కన్నడ పరిశ్రమ తిరస్కరణకు గురి కానున్నారని, ఆమెను బ్యాన్ చేసే ఆలోచనలో పరిశ్రమ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఆమె అప్ కమింగ్ చిత్రాలు తీవ్రస్థాయిలో నష్టపోతాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 24 2022, 08:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


కర్ణాటకకు చెందిన రష్మిక మందాన చర్యలు కన్నడ పరిశ్రమను ఆగ్రహానికి గురి చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. గత మూడు నాలుగేళ్లలో ఆమెపై అనేక ఆరోపణలు కన్నడ పరిశ్రమ చేసింది. కన్నడిగులు తీవ్రంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా శాండిల్ వుడ్ బ్యాన్ చేసే ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక... మిగతా సౌత్ లాంగ్వేజెస్ మాదిరి కన్నడ భాష కూడా నేను మాట్లాడడానికి ఇబ్బందిపడతాను అన్నారు. తన మాతృ భాష మాట్లాడటం రాదని చెప్పడం ద్వారా ఆమె కన్నడను అవమానించారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. 
 

36
rashmika mandanna

rashmika mandanna

అలాగే కన్నడ పరిశ్రమకు చెందిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాంతార చిత్రం గురించి ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. కాంతార చిత్రం చూశారా? ఆ సినిమా సక్సెస్ పై మీ అభిప్రాయం ఏమిటని? అడిగారు. రష్మిక అసలు కాంతారా చిత్రం చూడలేదు అన్నారు. ఈ పరిణామం కూడా కన్నడిగులు మనోభావాలు దెబ్బ తినడానికి కారణమైంది. 
 

46

ఈ రెండు సంఘటనలతో పాటు రష్మిక లేటెస్ట్ ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ మొత్తం వెరసి ఆమెపై తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. దీంతో కన్నడ పరిశ్రమ, థియేటర్ ఓనర్స్, ఆర్గనైజేషన్స్ కలిసి ఆమెను బ్యాన్ చేయాలనే ఆలోచన చేస్తున్నాయట. త్వరలో రష్మికను కన్నడ పరిశ్రమ బహిష్కరించినట్లు అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు.

56
Rashmika Mandanna

Rashmika Mandanna


అదే జరిగితే ఆమె అప్ కమింగ్ చిత్రాలు భారీగా నష్టపోతాయి. ముఖ్యంగా పుష్ప ది రూల్ కోట్ల రూపాయల వసూళ్లు కోల్పోవాల్సి వస్తుంది. సౌత్ లో తెలుగు చిత్రాలకు కర్ణాటక అతిపెద్ద మార్కెట్ గా ఉంది. తమిళనాడు, కేరళతో పోల్చితే అక్కడ తెలుగు చిత్రాలకు ఆదరణ ఎక్కువ. తెలుగు ఆడియన్స్ అధికంగా ఉంటారు. అలాగే విజయ్ వారసుడు కూడా నష్టపోనుంది. 
 

66
Rashmika Mandanna

Rashmika Mandanna


వారసుడు మూవీ మరో రెండు నెలల్లో విడుదల కానుంది. ఈ లోగా బ్యాన్ ప్రకటన వస్తే దిల్ రాజుకు చుక్కలే. ఈ క్రమంలో రష్మిక హీరోయిన్ గా ఉన్న చిత్రాల నిర్మాతలు వణుకుతున్నారు. మరో వైపు రష్మిక ఎదుగుదలను చూడలేక కన్నడ పరిశ్రమ ఆమెపై కక్ష సాధిస్తుందని అభిమానులు వాపోతున్నారు. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడమే దీనికి కారణమంటూ మండిపడుతున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lasya: క్రేజీ యాంకర్ వెంటపడ్డ పెళ్ళైన వ్యక్తి ఎవరు, పెళ్లి కోసం దారుణమైన కామెంట్.. ఆమె లవ్ స్టోరీ ఇదే
Recommended image2
Aamir Khan Wedding: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో, అమీర్ ఖాన్ వెడ్డింగ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Janhvi Kapoor: తప్పిపోతే శిఖర్‌కి అప్పగించండి.. జాన్వీ కపూర్ నైట్‌సూట్‌ పై ఏంటి ఆ రాతలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved