నోరు జారిన జబర్థస్త్ వర్ష... బిగ్ బాస్ హౌస్ లోకి లేడీ కమెడియన్..
బిగ్ బాస్ కోసం అంతా రెడీ అయ్యింది. ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అంతకు మించి ఉండబోతున్నట్టు మేకర్స్ హింట్ ఇస్తూనే ఉన్నారు. కంటెస్టెంట్స్ విషయంలో కూడా.. రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి జబర్థస్త్ వర్ష వెళ్తున్నట్టు దాదాపు కన్ ఫామ్ అయ్యింది.

జబర్థస్త్ పుణ్యమా అని ఎంతో మంది మూరుమూలన ఉన్న ఆర్టిస్ట్ లు బుల్లి తెరపై వెలుగు వెలుగుతున్నారు. కామెడీ షో వల్ల స్టార్లు గా మారిన వారిలో వర్ష కూడా ఉంది. జబర్థస్త్ స్కిట్లతో బాగా ఫేమస్ అయిన బ్యూటీ.. ఈ షోకి గ్లామర్ గా మారింది. రష్మీ, అనసూయల తరువాత బ్యూటీ గా వర్షకు పేరొచ్చింది.
చూడటానికి చక్కగా అందంగా హీరోయిన్ లా ఉండే వర్ష తన మాటలతో మాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు జబర్థస్త్ తో బాగా పాపులర్ అయిన బ్యూటీ.. ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా సాధిస్తోంది బ్యూటీ. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా వరుస ఫోటో షూట్లతో సందడి చేస్తుంది చిన్నది.
Jabardasth Varsha
ఏమాత్రం అవకాశం వచ్చినా.. సోషల్ మీడియాను వదలడంలేదు బ్యూటీ.. తీరొక్కరకంగా ఫోటోలు దిగుతూ.. హాట్ హాట్ అందాలు ఆరబోతస్తోంది. ఇన్ స్టాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ.. పాపులర్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజు రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది వర్ష.
Jabardasth Varsha
ఇదిలా ఉంటే వర్ష త్వరలో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టనుందని టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ గేమ్ షో కి వెళ్ళేది వీరే అని గతకొద్ది రోజులుగా కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో వర్ష పేరు కూడా ఉంది. రీసెంట్ గా వర్ష ఇన్ డైరెక్ట్ గా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jabardasth Varsha
ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని.. కానీ హీరోయిన్ గా చేయాలన్న ఆశలేదని.. అక్క, ఫ్రెండ్, వదిన ఇలాంటి పాత్రలు చేస్తాను అని తెలిపింది. అలాగే త్వరలో ఓ పెద్ద షోలో పాల్గొనబోతున్నా.. నాజీవితంలో జరిగిన మంచి ఎం చదువుకున్నాను అన్ని అక్కడ చెప్తా అని చెప్పుకొచ్చింది వర్ష.
అంతే కాదు ఈ షో కోసం అడ్వాన్స్ కూడా తీసుకుందట వర్ష. దాంతో పెద్ద షో అంటే బిగ్ బాస్ తప్పించి ఇంకేముంటుంది అని అంటున్నారు ఫ్యాన్స్. అంతే కాదు చాలా రోజుల నుంచి జబర్థస్త్ కంటెస్టెంట్ లిస్ట్ లో వర్ష పేరు కూడా వినిపిస్తోంది. దాంతో ప్రస్తుతం వర్ష మాటలతో అది కన్ ఫార్మ్ అయ్యింది.